Share News

kumaram bheem asifabad- చేప చెరువుకు చేరేనా..?

ABN , Publish Date - Oct 30 , 2026 | 10:45 PM

టెండర్‌ ప్రక్రియ పూర్తయి జలవనరుల్లో చేప పిల్లల విడుదలకు సిద్ధమవుతున్న తరుణం లో ఎల్‌నినో ప్రభావంతో మరింత జాప్యమ య్యేలా కనిపిస్తోంది. ఐదారు నెలలపాటు నీరుండే చెరువుల్లోనే విడుదల చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో కథ మొదటికొచ్చింది. జిల్లాలోని పెద్ద చెరువుల్లో 80-100 మిల్లీమీ టర్ల పరిమాణం కలిగిన వాటి విడుదల విషయంలో ఇబ్బంది లేకున్నా చిన్నవాటిల్లో వేసే 35-40 మిల్లీమీటర్ల విషయంలో సందిగ్ధం నెలకొంది.

kumaram bheem asifabad- చేప చెరువుకు చేరేనా..?
లోగో

ఆసిఫాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): టెండర్‌ ప్రక్రియ పూర్తయి జలవనరుల్లో చేప పిల్లల విడుదలకు సిద్ధమవుతున్న తరుణం లో ఎల్‌నినో ప్రభావంతో మరింత జాప్యమ య్యేలా కనిపిస్తోంది. ఐదారు నెలలపాటు నీరుండే చెరువుల్లోనే విడుదల చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో కథ మొదటికొచ్చింది. జిల్లాలోని పెద్ద చెరువుల్లో 80-100 మిల్లీమీ టర్ల పరిమాణం కలిగిన వాటి విడుదల విషయంలో ఇబ్బంది లేకున్నా చిన్నవాటిల్లో వేసే 35-40 మిల్లీమీటర్ల విషయంలో సందిగ్ధం నెలకొంది. మత్స్యశాఖ అధికారులు పది రోజుల కిందట కలెక్టర్‌ ఆమోదంతో ప్రభుత్వానికి మళ్లీ నివేదించినా ఇంకా అనుమతి రాకపోవడంతో డోలాయ మానం నెలకొంది.

జిల్లాలో ఇలా..

మొదట జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులు, 11 పెద్ద చెరువుల్లో 80-100 ఎంఎం చేప పిల్లలు 78.15 లక్షలు, మరో 260 చెరువుల్లో 35-40 ఎంఎం పిల్లలు 66.03 లక్షలు.. మొత్తం సుమారు1.45 కోట్లు విడుదల చేసేలా మత్స్యశాఖ అధికారులు టెండర్‌ ఆహ్వానించి ప్రణాళిక సిద్ధం చేశారు. వర్షంలోటుతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరో అయిదారు నెలల పాటు నీరుండే చెరువుల్లోనే వేయాలని ఆదేశించింది. మొత్తం 260 చిన్న చెరువులకు గాను 142లలో ఐదు నంఉచి ఆరు నెలలపాటు నీరు నిల్వ ఉండవచ్చని అధికారులు గుర్తించారు.వీటిలో 35-40 ఎంఎం పిల్లలు 45.03 లక్షలు వేసేలా మార్పులు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో ఏడాది పొడవునా నీరు ఉండడంతో.80-100 ఎంఎం పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాగా ఇప్పుడే వేసవిని తలపించేలా ఎండలు ఉండడంతో.. ఐదారు నెలల వరకు చెరువులలో నీరు ఉంటుందా అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. నీరు ఎండి పోతే చేపల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడనుంది. కొన్ని జిల్లాల్లో నీటి కొరత కారణంతో 35-40 పరిమాణం ఉన్నవి వేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో వేసే వాటిని అనుమతించి.. చిన్నవాటిని రద్దు చేస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. జాప్యం జరిగే కొద్దీ పిల్లల పెరుగుదలపై ప్రభావం ఉంటుం దని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవా లని మత్స్యకారులు కోరుతున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 10:45 PM