Share News

kumaram bheem asifabad- రైతు బీమా కొనసాగేనా..?

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:15 PM

గడువు దాటినా రైతు బీమా పాలసీలు రెన్యూవల్‌ కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రైతు బీమా పథకానికి ప్రభుత్వం మంగళ పాడనుందా..? అనే విషయంపై నిపుణులు, అధికార వర్గాలు ఔననే చెబుతున్నారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి బీమా సౌకర్యం కల్పిస్తామని రేవంత్‌ సర్కార్‌ ఇది వరకే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తుందా..? లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు.

kumaram bheem asifabad- రైతు బీమా కొనసాగేనా..?
లోగో

- జిల్లాలో రెండు లక్షల మంది రైతులు

- 4.6లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు

చింతలమానేపల్లి/బెజ్జూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యో తి): గడువు దాటినా రైతు బీమా పాలసీలు రెన్యూవల్‌ కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రైతు బీమా పథకానికి ప్రభుత్వం మంగళ పాడనుందా..? అనే విషయంపై నిపుణులు, అధికార వర్గాలు ఔననే చెబుతున్నారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి బీమా సౌకర్యం కల్పిస్తామని రేవంత్‌ సర్కార్‌ ఇది వరకే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తుందా..? లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఆగసు నెలలోనే రైతు భీమాకు సంబంధించి రెన్యూవల్‌ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం గడువు ముగిసినీ రైతులందరికీ బీమా చేయలేదు. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఉన్నతాధి కారుల నిర్ణయం మేరకు తీసుకుంటామని అధికా రులు చెబుతున్నారు. గడువు దాటిన రైతు బీమా పాలసీలు రెన్యూవల్‌ కాక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొన్నది.

- వీడని సందిగ్ధత..

ప్రభుత్వం నుంచి రైతు బీమాపై ఎలాంటి ఉత ్తర్వులు వెలువడక పోవడంతో దీని కొనసాగింపుపై సందిగ్ధత నెలకొన్నది. ఏటా ఆగస్టు 14 నుంచి రైతు బీమా ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో ఈ పథకం కొనసాగడంపై స్పష్టత కరువైంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్ల పరిధిలో ప్రతి సీజన్‌లో సుమారు 4.6లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగవుతున్నాయి. సుమారు రెం డు లక్షల మేర రైతులు పంటలు పండిస్తున్నారు. కాగా రైతులు పొలాల వద్దకు వెళ్లుతుంటారు. రాత్రిళ్లు విష సర్పాల ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే బోరు బావుల దగ్గర కరెంటు ప్రమాదాలు జరిగే అకవాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం 2018లో రైతు బీమా పథకాన్ని ప్రారంభిం చింది. 18- 59 వయస్సు మధ్య గల రైతులను అర్హులుగా పేర్కొంటూ ఆ రైతుకు ప్రభుత్వం రూ.3,556 చొప్పున ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకున్నది. ఏటా ఆగస్టు 13 ఆర్థరాత్రిలో పాలసీల కాల పరిమితి ముగిసింది. రైతులు చని పోతే వారి కుటుంబ సభ్యులకు పదిహేను రోజుల్లో రూ.5 లక్షలు చెల్లిస్తారు.

- వారం రోజులు దాటినా..

వారం రోజులు దాటినా రైతు బీమా పథకంపై ప్రభుత్వం స్పందించక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన ప్రతి ఏడాది గడువు ముగిసే ముందు వెబ్‌ సైట్‌ ఆన్‌ అవుతుంది. కొత్త వారికిగా దరఖాస్తు చేసుకునేందుకు వీలుం టుంది. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి స్పందన లేదు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల కుటుంబ బీమా చేయిస్తామని గతంలో రేవంత్‌ సర్కార్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రైతు బీమా ఇవ్వాల్సిన అవసరం ఉం దా..? అనే అంశంపై ప్రభుత్వం అడుగులు వేస్తున్న ట్టు నిపుణులు చెబుతున్నారు. మరి కొందరు రైతు బీమా పథకంతో పాటు ప్రతి రేషన్‌ కార్డుకు కుటుం బ బీమా చేయిస్తే అనేక లాభాలుంటాయని పలువు రు పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవ సాయాధికారి వెంకట్‌ను వివరణ కోరగా రైతు బీమా పై ఎలాంటి ఉత్తర్వులు ఇంత వరకు రాలేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే సంబంఽధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - Aug 21 , 2026 | 11:15 PM