సీఎంఆర్ రికవరీ అయ్యేనా..?
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:18 PM
ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసనప్పటికీ లక్ష్యం మేరకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వని మిల్లులపై చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్దం అవుతోంది.
-జిల్లాలో రూ. కోట్లలో పేరుకు పోయిన బకాయిలు
-శృతి మించుతున్న రైస్ మిల్లర్ల వైఖరి
-ఆర్‌ఆర్ చట్టం ప్రయోగించినా స్పందన శూన్యం
-మంత్రి ఆదేశాలూ పట్టించుకోని మిల్లర్లు
మంచిర్యాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసనప్పటికీ లక్ష్యం మేరకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వని మిల్లులపై చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్దం అవుతోంది. ఆయా సీజన్లలో పౌరసరఫరాల శాఖ అధ్వ ర్యంలో ధాన్యం కేటాయించిన మిల్లులు సకాలంలో బి య్యం అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టించు కోకపోవడంతో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం అవు తోంది. ఎప్పటికప్పుడు గడవు విధిస్తున్నా మిల్లర్లు పెడ చెవిన పెడుతున్నారు. రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధిం చి కచ్చితంగా మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవాలని రా ష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా అధికారులకు ఆ దేశాలు ఉన్నాయి. చాలా మంది మిల్లర్లు పలు కారణా లు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేయడంతో అధికా రులు ప్రత్యక్ష చర్యలకు పూనుకునేందుకు సిద్దపడుతు న్నారు. సీజన్ల వారీగా మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, తిరిగి ఇవ్వాల్సిన బియ్యం వివరాలు మెట్రిక్ టన్నుల్లో....
సంవత్సరం సీజన్ ధాన్యం ఇవ్వాల్సిన బియ్యం పెండింగ్
(మెట్రిక్ టన్నుల్లో)
2024-25 ఖరీఫ్ 53121 50512 2600
2024-25 రబీ 60897 55687 5209
2025-26 ఖరీఫ్ 49243 32309 16933
2025-26 రబీ 41330 5152 36177
ధాన్యం అమ్ముకున్నరూ...!
జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్ ఇచ్చే సమయంలో రేషన్ బియ్యాన్నే కొనుగోలు చేసి, తిరిగి అప్పగిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. తనిఖీలో సమయంలో నిల్వలు చూపించాల్సి రావడంతో రేషన్ బి య్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎంఆర్‌గా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌సీఐ అధికారులు పరిశీలన సమ యం లోనూ లెక్కలు చూపించకుండా తప్పించుకున్న మిల్ల ర్లు ఉన్నారు. గతంలో కొన్ని మిల్లుల్లో రేషన్ బియ్యం పట్టుబడటమే దీనికి నిదర్శనం. అలాగే ఒక్కొక్కరికి రెం డేసి చొప్పున మిల్లులు ఉండగా, కొన్నేళ్లు ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతో కోట్లకు పడగలెత్తుతున్నారు. వీటన్నింటి పైనా విచారణ జరిపేందుకు పౌరసరఫరాల శాఖ సి ద్ధపడుతోంది. మరోవైపు జిల్లాలోనే రేషన్ బియ్యాన్నే రీ సైక్లింగ్ చేసి, తిరిగి సీఎంఆర్‌గా అప్పగిస్తున్నట్లు ఆరోప ణలున్నాయి. ఈ క్రమంలో జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని ఓ రైస్ మిల్లులో ఈ నెల 10న అధికా రులు తనిఖీలు కూడా నిర్వహించడం కొసమెరుపు.
మంత్రి ఆదేశాలూ బేఖాతర్...
సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై జరిమానాలు, కేసులు విధిస్తున్నా వారి తీరు మారడం లేదు. ప్రతీ సీజన్‌లో ప్రభుత్వమే రైతుల నుంచి మద్ద తు ధరతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుపుతోంది. ఈ ధాన్యాన్ని జిల్లాలో ఉన్న మిల్లులకు కేటాయిస్తే మిల్లర్లు సీఎంఆర్ చేసి తిరిగి అందించాలి. బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తే రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తా రు. అయితే ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు....బియ్యం మాత్రం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మిల్లర్లపై క్రి మినల్ కేసుల నమోదు, రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చ ట్టం అమలు చేశారు. ఆర్‌ఆర్ యాక్టు కింద మిల్లుల నిర్వాహకుల కుటుంబ సభ్యుల స్థిరాస్తుల జప్తునకూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో సీఎంఆర్ బకా యిలు ఉన్న మిల్లర్లపై ఇప్పటి వరకు 20 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. బియ్యం ఇవ్వని మిల్లులకు జ రిమానా, వడ్డీ కలిపి చెల్లించాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ధాన్యం విలువకు వ డ్డీతో సహా లెక్కలు గట్టి వసూలు చేస్తున్నారు. అయిన ప్పటికీ చాలా మంది మిల్లర్లు మొండి కేస్తుండటంతో వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిరాస్థులను సై తం జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం ఆర్ పెండింగ్ విషయమై ఇటీవల రాష్ట్ర పౌర సరఫ రాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా మిల్లర్ల వైఖరిలో మార్పు రాకపోగా, మంత్రి ఆదేశాలను ఖా తరు చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పీడీ యాక్టు నమోదు యోచనలో...
సీఎంఆర్‌కు సంబంధించిన ధాన్యం బకాయిలు ఉన్న మిల్లర్లపై కఠిన చర్యలకూ ప్రభుత్వం సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. రూ. కోట్లలో బకాయిలు ఉన్న మిల్లులపై ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టగా, అవసరమైన పక్షంలో ఈడీ (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) విచా రణ కూడా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తె లుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మిల్లర్ల బకా యిలు పేరుకుపోవడంతో ఎలాగైనా రికవరీకి సిద్దపడు తున్నట్లు సమాచారం. ప్రభుత్వం యోచిస్తున్న విధంగా ఈడీ రంగంలోకి దిగితే బియ్యం పక్కదారి విషయమే గాక, మిల్లర్ల ఆస్తిపాస్తులపైనా విచారణ లోతుగా జరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొం దరు మిల్లర్లు అప్రమత్తమై బకాయిలు చెల్లిస్తుండగా, మిగతా వారు కూడా దారిలోకి వస్తారనే భావనలో అ ధికారులు ఉన్నారు. సీఎంఆర్ బకాయిలున్న పెద్దపల్లి జిల్లాకు చెందన ఓ మిల్లర్‌పై రెండు నెలల క్రితం పో లీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. అదే మాదిరిగా జిల్లాలో కేసులు ఎదుర్కొంటున్న మొండి బకాయిదా రులపైనా పీడీ యాక్టు ప్రయోగించాలనే ఆలోచనతో యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది.