kumaram bheem asifabad- బిల్లులు వచ్చేనా..?
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:53 PM
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం ఇప్పటికీ బిల్లుల కష్టాలు తప్పడం లేదు. కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. పనులు చేయడానికి అప్పులు చేసి, సొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టినప్పటికీ చెల్లింపులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు చెబుతున్నారు.
- ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ల ఆవేదన
కాగజ్‌నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం ఇప్పటికీ బిల్లుల కష్టాలు తప్పడం లేదు. కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. పనులు చేయడానికి అప్పులు చేసి, సొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టినప్పటికీ చెల్లింపులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు చెబుతున్నారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుదీకరణ, డైనింగ్ హాళ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు చేపట్టారు. టెండర్లు దక్కిం చుకున్న కాంట్రాక్టర్లు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి కూలీలతో పనులు చేయించి పూర్తి చేశారు. పనులు పూర్తయిన తర్వాత బిల్లులు సమర్పించినా చెల్లింపులు మాత్రం ఆశించిన స్థాయిలో జరుగలేదు. దీంతో అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందు లు పడుతున్నట్టు కాంట్రాక్టర్టు వాపోతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ నివేదికలో జిల్లాకు సంబంఽధించిన మరుగుదొడ్ల నిర్మాణానికి 16 పనులు, విద్యుదీకరణకు 22 పనుల, డైనింగ్ హాళ్లకు 7 పను లు కలిపి రూ.3 కోట్లకుపైగా నిధులను కేటాయిం చారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో ఈ పనులు చేపట్టారు. లక్షల్లో పెట్టి అప్పులు చేసిన తర్వాత భవనాల నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారి పోయింది. ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియకు పూర్తిగా బ్రేక్ పడింది. నిధులు విడుదల చేయాలని గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా స్థాయిలో దశల వారీగా పోరాటం చేశారు. కాగజ్‌నగర్‌లో ఏకంగా ఏడాది క్రితం కూడా కాగజ్‌నగర్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. తమకు బిల్లులు చెల్లించకుంటే తమ పరిస్థితి పూర్తిగా రోడ్డున పడేలా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ తర్వాత చెల్లింపులు జరుగాయని ఆశించినా ఇంత వరకు అతీగతీ లేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ జిల్లా స్థాయి అధికారుల నుంచి రాష్ట్రస్థాయి అధికార ులకు కూడా నేరుగా వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడికి ప్రత్యా మ్నాయంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పనులు నిర్వహిస్తోంది. మన ఊరి మన బడి భవనాల పూర్తి చేసిన వాటికి మాత్రం నిధులను కేటాయించడం లేదని, బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బిల్లులు రాక ఇబ్బందులు..
-చటారే స్వాతి, సర్పంచ్ బురదగూడ
గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాల భవనాలు పూర్తి చేసినప్పటికీ బిల్లులివ్వా లని అడిగితే రేపు, మాపు అంటూ మూడేళ్ల కాలం గడిచింది. పనులు పూర్తి చేసిన నెల రోజుల్లోనే బిల్లు వస్తుందని అప్పుడు చెప్పారు. కానీ ఇప్పటికీ పట్టించు కోవడం లేదు. అధికారులు స్పందించి బిల్లులు అందేలా చొరవ చూపాలి.