పశు సంవర్థకశాఖ గాడిలో పడేనా..!
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:23 PM
మూగ జీ వాలైన పశువుల పట్ల ఆది నుంచి ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని వీడటం లేదు. పశు సంవర్థక శాఖకు పెద్దపీ ట వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మాట ను నిలబెట్టుకోవడంలో విఫలం అవుతుందనే చెప్పాలి. అత్యవసర సమయాల్లో పశువుల ప్రాణాలు కాపా డేందుకు అవసరమైన పాముకాటు చికిత్స మందులు జిల్లా వ్యాప్తంగా ఏ మండలంలోనూ అందుబాటులో లేవంటే అతిశయోక్తికాదు.
-సిబ్బంది కొరతో తప్పని ఇబ్బందులు
-శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనాలు
-జిల్లాలో 10 లక్షల వరకు వివిధ రకాల పశువులు
-ఇరుకు స్థలాల్లో మూగజీవాలకు చికిత్స
మంచిర్యాల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మూగ జీ వాలైన పశువుల పట్ల ఆది నుంచి ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని వీడటం లేదు. పశు సంవర్థక శాఖకు పెద్దపీ ట వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మాట ను నిలబెట్టుకోవడంలో విఫలం అవుతుందనే చెప్పాలి. అత్యవసర సమయాల్లో పశువుల ప్రాణాలు కాపా డేందుకు అవసరమైన పాముకాటు చికిత్స మందులు జిల్లా వ్యాప్తంగా ఏ మండలంలోనూ అందుబాటులో లేవంటే అతిశయోక్తికాదు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన పశు సంవర్థకశాఖలో కాం గ్రెస్ ప్రభుత్వంలో కొంతమేర మార్పులు జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
జిల్లాలో 10 లక్షల వరకు పశువులు...
జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పశువులు 10 లక్షల వరకు ఉన్నాయి. వాటిలో ఆవులు, ఎద్దులు కలిపి 1.86 లక్షలు ఉండగా, గేదెలు 94వేలు, మేకలు 2 లక్షలు, గొ ర్లు 5.13 లక్షలు ఉన్నాయి. ఇంకా కోళ్లు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటన్నంటికీ చికిత్స అందించేం దుకు ప్రస్తుతం జిల్లాలో మందుల కొరత లేనప్పటికీ ఇతరత్రా కారణాలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మం దుల కొనుగోలుకు అవసరమైన నిధులు సైతం ప్రభు త్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుండటంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తడం లేదు. జిల్లాలోని పశువులకు సరిపడా 66 రకాల మందులు ప్రస్తుతం అందుబాటు లో ఉన్నాయి. అయితే పాముకాటు, పొదుపు వాపు వ్యాధికి సంబంధించి మాత్రం జిల్లాలో ఎక్కడా కూడా అవసరమైన మందులు అందుబాటులో లేవు. పై రెం డు అంశాల విషయంలో మాత్రం అత్యవసర సమయాల్లో సంబంధిత పశువుల యజమానులు మందుల కోసం ప్రైవేటు మెడికల్ స్టోర్స్‌ను ఆశ్రయిం చక తప్పని పరిస్థితులు ఉన్నాయి. పాముకాటు, పొ దుపువాపు మందులు అధిక ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ప్రభుత్వపరంగా సరఫరా చేయడం లేదని సమాచారం.
వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత...
పశు సంవర్థకశాఖలో జిల్లాకు సంబంఽధించి పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో పశువు లకు చికిత్స అందించడంలో ఇబ్బందులు ఏర్పడు తున్నాయి. అసలు పశుసంవర్థక శాఖకు జిల్లా అధికా రే లేకపోవడం గమనార్హం. అంతకు ముందు డిస్ట్రిక్ట్ వె టర్నరీ అండ్ ఎనిమల్ హజ్మండరీ ఆఫీసర్ (డీవీఏ హెచ్‌ఓ)గా విధులు నిర్వహించిన మధుకర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఇతర అధికారులకు అదనపు బా ధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం డీవీఏహెచ్‌వోగా డా క్టర్ యాకూబ్ రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. జిల్లా వ్యాప్తంగా 44 వెటర్నరీ ఆసుపత్రులు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది సంఖ్య సరిపడా లేరు. జిల్లాలోని రెండు ఏరియా వెటర్నిటీ ఆసుపత్రులు ఉం డగా, వాటిలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులు ఇద్దరు ఉండాలి. అయితే ప్రస్తుతం ఒకరితోనే వెళ్లదీ యాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే 27 ప్రాథమిక పశువైద్య శాలలు ఉండగా, వాటిలో జన్నారం మండ లం ఇందన్‌పల్లిలో వైద్యుని పోస్టు ఖాళీగా ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా 15 సబ్ సెంటర్లు ఉండగా, వాటిలో ప్యారా వెటర్నరీ సిబ్బంది పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా వెటర్నరీ అసిస్టెంట్లకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో 16 మంది వరకు వెటర్నరీ అసిస్టెంట్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఈ విభాగంలో ఆరు పోస్టులు ఖా ళీగా ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ విషయానికి వస్తే 44 మంది ఉండాల్సి ఉండగా, కేవలం 26 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అరకొర వసతులతో భవనాలు...
పశు సంవర్థకశాఖలో భవనాల పరిస్థితి పూర్తిగా ధీన స్థితిలో ఉంది. కొన్ని చోట్లా ఆరవై డెబ్బై ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకు న్నాయి. మరికొన్ని చోట్లా కేవలం చిన్న గదిలో ఆసుప త్రులు నిర్వహించాల్సి వస్తోంది. దశాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భవనాల నిర్మాణం వి షయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జిల్లా లో మొత్తం 44 వెటర్నరీ ఆసుపత్రులకు గాను కేవలం ఐదు చోట్ల మాత్రమే శాశ్వత సొంత భవనాలు ఉం డటం గమనార్హం. రేచిన, బెల్లంపల్లి, ఆస్నాద్, ఆవడం, లక్షెట్టిపేటలో మాత్రమే సొంత భవనాలు అందుబా టులో ఉండగా, ఇంకా 39 చోట్ల అరకొర సౌకర్యాలే ఉ న్నాయి. భీమిని, కాసిపేట, చెన్నూరులో చిన్న గదుల్లో ఆసుపత్రులు నిర్వహిస్తుండగా, వాటిలో కొన్ని శిథిలా వస్థకు చేరి, ఏ క్షణాన కూలిపోతాయో తెలియని పరి స్థితులు ఉన్నాయి. నెన్నెల, చెన్నూరు మండలం కత్తెర శాలలో అసలు భవనాలే లేవు. హాజీపూర్, ముల్కల్లలో భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి, కూలడానికి సిద్దంగా ఉన్నాయి. హాజీపూర్‌లోని భవనం స్లాబు కు రుస్తుండగా, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరి స్థితులు ఉన్నాయి. ఇక మంచిర్యాల జిల్లా కేంధ్రంలో హౌసింగ్ బోర్డుకు చెందిన ఓ చిన్న గదిలో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఇలా అరకొర సౌకర్యాల మధ్య మూ గజీవాలకు చికిత్సలు అందిస్తుండటంతో నానా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ప్రతిపాదనలు పంపించాం...
పశు సంవర్థకశాఖ జిల్లా అధికారి డా. యాకూబ్‌రెడ్డి
జిల్లాలో పశువుల వైద్యానికి సంబంఽధించి ప్రస్తుతా నికి ఎలాంటి ఇబ్బందులు లేదు. పశువుల సంఖ్యకు సరిపడా అన్ని రకాల మందులు పూర్తిస్థాయిలో అం దుబాటులో ఉన్నాయి. సిబ్బంది కొరత కొంతమేర ఉంది. పలుచోట్లా ఆసుపత్రుల భవనాలు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని చోట్లా చిన్న గదుల్లో ఆసుపత్రులు నిర్వహించాల్సి వస్తున్న విషయం వాస్తవమే. సొంత భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది.