Share News

రేషన్‌ సరుకులు పునరుద్ధరించేనా

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:10 AM

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు తెల్లరేషన్‌ కార్డు ద్వారా అందించే నిత్యావసర సరుకులకు ప్రభుత్వం క్రమక్రమంగా మంగళం పాడుతోంది. కేంద్ర ప్రభుత్వం చక్కెరకు ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తోంది.

రేషన్‌ సరుకులు పునరుద్ధరించేనా

బియ్యం పంపిణీకే పరిమితమైన దుకాణాలు

నిలిచిన గోధుమలు, చక్కెర సరఫరా

మంత్రి హామీ ఇచ్చినా అమలు కాని వైనం..

మంచిర్యాల, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు తెల్లరేషన్‌ కార్డు ద్వారా అందించే నిత్యావసర సరుకులకు ప్రభుత్వం క్రమక్రమంగా మంగళం పాడుతోంది. కేంద్ర ప్రభుత్వం చక్కెరకు ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తోంది. తెల్లరేషన్‌ కార్డులపై సబ్సిడీ కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు బియ్యం, చక్కెర, కిరోసిన్‌, తదితర ని త్యావసర వస్తువులు గతంలో చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసేవారు. ఇందులో అత్యధిక శాతం సబ్సిడీని కేం ద్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం చక్కెర సబ్సిడీని నిలిపివేయడంతో చౌర ధరల దుకాణాలకు సర ఫరా నిలిచిపోయింది. దీంతో పౌర సరఫరాల శాఖ సరుకుల పంపిణీలో భారీ కోత విధించింది. రేషన్‌ షాపుల్లో ప్రస్తుతం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు.

జిల్లాలో 424 రేషన్‌ దుకాణాలు

జిల్లా వ్యాప్తంగా 1,97,343 తెల్లరేషన్‌ కార్డులు, 15,061 అంత్యోదయ కార్డులు, 192 అన్నపూర్ణ కార్డులున్నాయి. 424 చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నెల 29వ తేదీ నాటికి రేషన్‌ షాపులకు నిత్యావసర స రుకులు అందేవి. దీంతో ప్రతీ నెల 1వ తేదీ నుంచి సరు కులు వినియోగదారులకు అందించేవారు. కొన్ని నెలలు బి య్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు. చక్కెర సరఫరా నిలి చిపోయింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో గతంలో బి య్యం, చక్కెర, గోధుమ పిండి, పామాయిల్‌, ఉప్పు, కంది పప్పు, కారం, పసుపు వంటి తొమ్మిది రకాల సరుకులతో కూడిన అమ్మహస్తం పథకాన్ని రూపొందించి ప్రజలకు పం పిణీ చేసేవారు. మూడేళ్ల క్రితం వరకూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం నిర్విరామం గా కొనసాగింది. ఈ పథకంలో భాగంగా పేద ప్రజలకు ప్ర త్యేకంగా తయారు చేసిన సంచిలో అన్ని సరుకులు అందేవి. రెండున్నరేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సరుకుల పంపిణీకి కోత పెడుతూ వచ్చింది. ప్రస్తుతం చక్కెర బంద్‌ అయిపో యింది. 2 లక్షల 12 వేల 596 కార్డుదార్లకు నెలకు అరకిలో చక్కె రూ. 6.75 చొప్పున పంపిణీ చేసేవారు. బహిరంగ మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.42 వరకు ఉంది. దీంతో చక్కెరకు అదనంగా అవుతున్న రూ. 32లో రూ. 18.50లు కేంద్రం భరిస్తుండగా, మిగతా రూ. 13.5లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. కేంద్ర సబ్సిడీని నిలిపివేస్తామని చెప్పడంతో రా ష్ట్రంపై రూ.18.50 అదనపు భారం పడనుంది. దీంతో రేషన్‌ షాపుల్లో చక్కెర సరఫరా నిలిపివేతకే రాష్ట్ర ప్రభుత్వం మొ గ్గు చూపుతోంది. ఇదిలా ఉండగా, రేషన్‌ షాపుల ద్వారా పే దలకు బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ వాటా పోను మిగిలిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల నుంచి కిలో రూ.24కు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నా రు. బియ్యంపైనే అధిక భారం పడుతుండగా, చక్కెరను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

గోధుమలు బంద్‌

రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల జాబి తాలో నుంచి గోధుమలను తొలగించారు. కొంతకాలంగా గోధుమల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటి వ రకు రేషన్‌ షాపుల ద్వారా నెలకు కిలో గోదుమలు పంపిణీ చేసేవారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గోధుమలను రూ.6.10కు కిలో చొప్పున రాష్ర్టానికి సరఫరా చేస్తూ వచ్చిం ది. ప్రభుత్వం రూ.7లకు కిలో చొప్పున వినియోగదారులకు పంపిణీ చేసేది. అయితే దేశవ్యాప్తంగా గోధుమల దిగుబడి తగ్గిపోవడంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతు న్నారు. ఈ కారణంగానే నాలుగు నెలల నుంచి గోధుమల కోటాను నిలిపివేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సబ్సి డీల భారాన్ని తగ్గించుకునేందుకు రేషన్‌ జాబితా నుంచి ఒ క్కొక్క వస్తువును తొలగిస్తూ వస్తుండడంతో రాష్ట్ర ప్రభు త్వం కూడా ఆ భారం నుంచి వైదొలుగుతోంది.

సరుకులు ఇస్తలేరు

మంత్రి లావణ్య, మంచిర్యాల

ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రేషన్‌ సరుకుల్లో రానురాను కోత విధిస్తున్నారు. ప్రస్తుతం బియ్యం తప్ప ఇతర ఏ వస్తువును అందజేయడం లేదు.

సరుకుల పంపిణీలో ప్రభుత్వం విఫలం

- రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు

బుర్ర మహేందర్‌ గౌడ్‌

రేషన్‌ షాపుల ద్వారా పేద ప్రజలకు సరుకులు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. డీడీలు చెల్లిం చిన డబ్బులు కూడా రావడం లేదు. కమీషన్‌ మాట దేవు డెరుగు హమాలీ చార్జిలు కూడా చెల్లించడం లేదు. డీలర్ల బతుకులు రోడ్ల పాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వపరంగా కేటాయింపులు లేవు

- జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు

రేషన్‌ సరుకుల విషయమై ప్రభుత్వపరంగా కేటాయిం పులు లేవు. ఐదారు నెలలుగా రేషన్‌ సరుకుల్లో కోత విధి స్తున్నారు. ప్రస్తుతం బియ్యం పంపిణీ మాత్రమే జరుగు తోంది. చక్కెరను పూర్తిగా ఇవ్వడం లేదు. భవిష్యత్తులో చౌక ధరల దుకాణాల ద్వారా ఏయే వస్తువులు పంపిణీ చేయా లో పూర్తి సమాచారం లేదు.

Updated Date - Apr 29 , 2026 | 12:10 AM