Share News

మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేనా...?

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:48 PM

రాష్ట్ర వ్యా ప్తంగా మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ అంశం తీవ్ర చర్చ నీయాంశం అవుతోంది. మందమర్రి మున్సిపాలిటీ కి 30 ఏళ్లుగా ఎన్నికలు జరగడం లేదు. మున్సిపాలి టీగా ఏర్పడ్డ నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నం దున అభివృద్ధికి నోచుకోక ఇక్కడి ప్రజలు నానా ఇబ్బం దులు పడుతున్నారు.

మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేనా...?
మందమర్రి మున్సిపల్‌ కార్యాలయం

-30 ఏళ్లుగా ఎన్నికలు ఎరుగని ప్రజలు

-ఏజెన్సీ చట్టం అమలులో ఉండటమే కారణం

-కేసీఆర్‌ సహా నెరవేరని నేతల హామీలు

-ఏజెన్సీ హక్కులు కోల్పోతున్న గిరిజనులు

మంచిర్యాల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యా ప్తంగా మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ అంశం తీవ్ర చర్చ నీయాంశం అవుతోంది. మందమర్రి మున్సిపాలిటీ కి 30 ఏళ్లుగా ఎన్నికలు జరగడం లేదు. మున్సిపాలి టీగా ఏర్పడ్డ నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నం దున అభివృద్ధికి నోచుకోక ఇక్కడి ప్రజలు నానా ఇబ్బం దులు పడుతున్నారు. తమ గోడు వినడానికి ప్రతినిధి లేకుండా పోయారని ఆవేదన చెందుతున్నారు. తమను గెలిపిస్తే స్థానిక ఎన్నికల నిర్వహించేందుకు కృషి చేస్తా మని హామీలిచ్చిన ముఖ్య నేతలు కూడా పట్టించుకోక పోవడంతో సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సింగరేణి బొగ్గు గనులతో పారి శ్రామికంగా అభివృద్ధి చెందిన మందమర్రి మున్సిపా లిటీ ప్రజలకు మూడు దశాబ్దాలుగా స్థానిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. మరోవైపు మున్సిపాలి టీలో ఏజెన్సీ యాక్ట్‌ అమలులో ఉన్నప్పటికీ ఆ చట్టాలు కూడా అమలు కావడం లేదు. ఏజెన్సీ భూముల్లో విచ్చ ల విడిగా వెంచర్లు ఏర్పాటు చేస్తుండగా, పెద్ద మొ త్తంలో పక్కా భవనాల నిర్మాణం కూడా చేపట్టారు. దీంతో గిరిజనులు వారి హక్కులను కోల్పోతుండగా, రాజకీయ పరంగానూ లబ్ది జరగడం లేదు.

పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా...

1992 వరకు గ్రామ పంచాయతీగా కొనసాగిన మం దమర్రిని 1993లో నోటిఫైడ్‌ ఏరియాగా గుర్తించి, చైర్మ న్‌ను నియమించారు. 1995 ఆగస్టులో గ్రేడ్‌-2 మున్సి పాలిటీ హోదా కల్పిస్తూ జీవో జారీ అయింది. 1998 జూన్‌లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే చైర్మన్‌ పదవిని ఎస్సీలకు రిజ ర్వ్‌ చేయడం వివాదానికి దారి తీసింది. ఏజెన్సీ ఏరి యా పరిధిలోని మందమర్రిలో 1/70 చట్టం అమలు లో ఉండటంతో ఇక్కడ ఎన్నికలు జరపడానికి వీలులే దని, ఒకవేళ జరపాలనుకుంటే చైర్మన్‌ పదవిని ఎస్టీల కు కేటాయించాలని స్థానికులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ చేసింది. అప్పటి నుంచి మందమర్రి మున్సిపా లిటీకి ఎన్నికలు జరగడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 52,352 మంది ఉన్నారు.

నెరవేరని హామీలు...

మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నికలు జరిపిస్తామ ని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ కూ డా అమలుకు నోచుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ యేడు నవంబరు 29న మం దమర్రిలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాల్క సుమన్‌ను గెలిపిస్తే మందమర్రి మున్సిపాలిటీకి తాను ఎన్నికలు జరిపిస్తానని అప్పట్లో కేసీఆర్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సహా పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యే లు సైతం హామీలు ఇచ్చినప్పటికీ అవి నెరవేరలేదు. ఇ దిలా ఉండగా మందమర్రి మున్సిపాలిటీని ఏజెన్సీ ప్రాం తంగా గుర్తించినా తమకు గిరిజన చట్టాలు, హక్కులు అమలు కావడంలేదని గిరిజన కుటుంబాలు వాపోతు న్నాయి. తమ భూములను గిరిజనేతరులు అన్యాక్రాం తం చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలను అధికారులు అ డ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ము న్సిపల్‌ ఎన్నికల సమయం ఆసన్నమైందున ఇప్పటి కైనా మందమర్రి బల్దియాకు ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే ఏజెన్సీ యాక్టు, రాజ్యాంగం కల్పించిన హక్కు లను కాపాడుకోవడం కోసం మందమర్రి మున్సిపాలి టీని తిరిగి పంచాయతీగా మార్చాలనే డిమాండ్‌లు ఉన్నాయి.

Updated Date - Jan 08 , 2026 | 11:48 PM