Share News

kumaram bheem asifabad- పంటల బీమా అమలయ్యేనా?

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:13 PM

రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. రాష్ట్రలో ఆరేళ్ల క్రితం నిలిచిపోయిన పంట ల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా కూడా పథకం అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2026-27బడ్జెట్‌లో పంటల బీమా పథకం అమలు చేసేందుకు 1,800లకు పైగా కోట్లు కేటాయించినప్ప టికీ అది కాగితాలకే పరిమితమైంది.

kumaram bheem asifabad- పంటల బీమా అమలయ్యేనా?
లోగో

- కాగితాలకే పరిమితమైన బడ్జెట్‌

బెజ్జూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. రాష్ట్రలో ఆరేళ్ల క్రితం నిలిచిపోయిన పంట ల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా కూడా పథకం అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2026-27బడ్జెట్‌లో పంటల బీమా పథకం అమలు చేసేందుకు 1,800లకు పైగా కోట్లు కేటాయించినప్ప టికీ అది కాగితాలకే పరిమితమైంది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వర్షాలు కురిసే స్థితి లేదని వాతావరణ కేంద్ర నిపుణులు చెబుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు పంటలు వేసిన రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పంటల బీమా పథకం అమల్లో ఉంటే భరోసా ఉండేదని రైతులు అంటున్నారు.

- జిల్లాలో 4.50లక్షల ఎకరాల్లో..

జిల్లాలో 4.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా పత్తి, వరి, కంది, మొక్కజొన్న వంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో పెద్దగా సాగునీటి ప్ర ాజెక్టులు లేని కారణంగా వర్షాదారం పైనే ఆదారప డి పంటలు సాగు చేస్తున్నారు. ఏటా భారీ వర్షాలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక పంటలను రైతులు నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాం టి నష్టపరిహారం అందడం లేదు. ఎప్పుడో ఒకసారి నష్టపరిహారాన్ని అందిస్తుండగా, నామమాత్రంగానే పంట నష్టపరిహారం సర్వే జరుగుతున్నది. దీంతో రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. కాగా రాష్ట్రంలో పంటల బీమా పథకం 2019-20వరకు మాత్రమే అమలైంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభు త్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంగా అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30శాతం చెల్లిస్తే, రైతులు తమ వాటా కింత 10శాతం ప్రీమియం చెల్లించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. జిల్లాలో ప్రత్యేక రైతులు పంటల సాగు కోసం జూన్‌, జూలై నెలల్లో పంట రుణాలు తీసుకుం టారు. అదే సమయంలో రైతులు పండించే పంటలకు బీమా చేస్తుంటారు. బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాల నుంచి వాటాను మినహాయించుకొని వారు పండించే పంటలను బీమా పథకంలో చేరుస్తారు. ఈ పథకంలో కొన్ని పంటలు గ్రామ యూనిట్‌గా, కొన్ని మండల యూనిట్‌గా అమలు చేశారు. ఈ పథకంలో లొసుగులు ఉన్నాయని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దీనిని సవరించాలని సూచన చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం సవరణ చేయకపోవడంతో పంటల బీమా పథకం నుంచి ప్రభుత్వం తప్పుకున్నది. 2019-20నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేదు. రైతులు పంట నష్టపోతే ప్రభు త్వం కేవలం ఎకరానికి రూ.6వేల చొప్పున, ఆ తర్వాత ఎకరానికి రూ.10వేల రూపాయల చొప్పున అందజేసింది. ఈ పరిహారం కూడా పూర్తి స్థాయి లో చెల్లించకుండా వచ్చింది. దీంతో ప్రకృతి వైపరీ త్యాల వల్ల ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతూ వస్తున్నా పాలకులు పట్టించుకో వడం లేదు.

- నిధులు కేటాయించినా..

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల గడుస్తున్నా ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రకటిస్తూనే ఉన్నది. కానీ అమలులో మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో జరిగిన అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27ఆర్థిక సంవత్సరానికి గాను ప్రకటించిన బడ్జెట్‌లో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు 1,896కోట్ల రూపా యలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ పథకం అమలు ఊసెత్తడం లేదు. ఈ సీజన్‌లో పంటల సాగు దాదాపు పూర్తయ్యింది. జిల్లాలో అత్యధికంగా పత్తి, వరి పంటలను సాగు చేశారు. ఈ సీజన్‌లో మొదటి నుంచి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని రైతులు అరుతడిపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ రైతులకు పలు సూచనలు చేస్తూ వచ్చింది. జిల్లాలో కొద్దిమేర వర్షాలు కురవడంతో రైతులు వరి, పత్తి పంటలను సాగు చేశారు. కానీ సెప్టెం బరు మాసం నుంచి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన మొద లైంది. పంటల బీమా పథకం అమలులో ఉంటే తద్వారా పరిహారం అందే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలు దృష్టిలో ఉంచుకొని పంటల బీమా పథకాన్ని అమలు చేసే లా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మార్గదర్శకాలు లేవు..

- నాగరాజు, ఏవో, బెజ్జూరు

పంటల బీమా పథకంల అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఈ పథకంలో 2019-20వరకే అమలులో ఉండేది. ప్రస్తు తం ప్రభుత్వం ఈ పథకం అమలు చేయ డానికి ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలైతే అమలు చేస్తాం.

Updated Date - Sep 15 , 2026 | 11:13 PM