చెన్నూరుకు రెవెన్యూ డివిజన్ భాగ్యం కలిగేనా..?
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:16 AM
చెన్నూరుకు రెవెన్యూ డివిజన్ భాగ్యం ఎప్పుడు కలుగుతుందోనని అక్కడి ప్రజలు గంపె డాశతో ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితమే అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఆ దిశగా అడుగులు ముందు కు పడటం లేదు. ఈ కారణంగా రెవెన్యూ, పరిపాలనకు సంబం ధించిన ప్రతీ పనికి అక్కడి ప్రజలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావలసి వస్తుండటంతో దూర భారానికి గురవుతున్నారు.
-గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ జారీ
-రెండున్నరేళ్లు గడుస్తున్నా కలగని మోక్షం
-మంచిర్యాలకు రాకపోకలతో పెరుగుతున్న దూర భారం
-మంత్రి వివేకానంద పైనే ప్రజల ఆశలు
మంచిర్యాల, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): చెన్నూరుకు రెవెన్యూ డివిజన్ భాగ్యం ఎప్పుడు కలుగుతుందోనని అక్కడి ప్రజలు గంపె డాశతో ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితమే అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఆ దిశగా అడుగులు ముందు కు పడటం లేదు. ఈ కారణంగా రెవెన్యూ, పరిపాలనకు సంబం ధించిన ప్రతీ పనికి అక్కడి ప్రజలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావలసి వస్తుండటంతో దూర భారానికి గురవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లు ఉండగా, కొత్తగా చెన్నూరును డివిజన్‌గా మార్చాలనే ప్రణాళికలు రూ పుది ద్దుకున్నాయి. చెన్నూరు నియోజక వర్గంలోని జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్‌గా ఏ ర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు అధికారుల నుంచి ప్రభుత్వానికి అందాయి.
రెండున్నరేళ్ల కిందటే నోటిఫికేషన్....
అధికారులు పంపిన ప్రతిపాధనల మేరకు 2023 అక్టోబర్ 4వ తేదీన చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ డివిజన్‌తోపాటు చెన్నూరు మండలం ఆస్నాద్, కోటపల్లి మండలం పారుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ వి డుదలైంది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు సరిహద్దులు, జనా భా, భౌగోళిక, తదితర వివరాలపై అప్పట్లోనే ఉన్నతాధికారులకు నివేదిక సైతం ఇచ్చారు. ఈ తతంగం పూర్తయి దాదాపు రెండున్న రేళ్లు కావస్తుండగా, ఇప్పటి వరకు చెన్నూరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కాలేదు. ప్రభుత్వానికి నివేదికలు అందడంతో రెవెన్యూ డి విజన్‌కు అధికారికంగా ఆమోద ముద్ర వేసే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరడం జరిగాయి. ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ పూర్తిగా మరుగున పడింది.
ప్రజలపై దూర భారం...
చెన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం మంచిర్యాల రెవెన్యూ డివి జన్ పరిధిలో ఉంది. దీంతో ప్రతీ చిన్న పనికి కూడా అక్కడి ప్రజ లు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావలసి వస్తోంది. చెన్నూరు నుంచి మంచిర్యాల 35 కిలో మీటర్ల దూరం ఉండగా, నియోజక వర్గంలోని కోటపల్లి, చెన్నూరు మండలంలో పలు గ్రామాలు సు మారు 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. అంత దూ రం నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధిక దూర భారంగా భావి స్తుండగా, వ్యయ ప్రయాసలకు ఓర్చు కోవలసి వస్తోంది. చెన్నూ రును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పా టు చేస్తామని హామీలు ఇచ్చాయి. ప్రజల నుంచి డిమాండ్ అధి కం కావడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చొరవ చూపినన్పటికీ ఆ తరువాత ఆ అంశం పూర్తిగా మరుగున పడింది.
మంత్రిపైనే ప్రజల ఆశలు...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, మంత్రిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ప్రజ లు ఆయనపై గంపెడాశలు పెట్టుకున్నారు. చెన్నూరు నియోజక వర్గ ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రి కృషి చేయాలని, తద్వారా పరిపాలన సౌలభ్యం, పాలన మరింతగా చేరువ చేయాలనే విజ్ఞప్తులు ప్రజల నుంచి ఉన్నాయి.