Share News

kumaram bheem asifabad-అంగన్‌వాడీలకు పదవీ విరమణ సాయం అందేనా..?

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:11 PM

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు (ఆయాలుగా) విధులు నిర్వహించి విరమణ పొందిన వారికి ప్రభుత్వం నుంచి సాయం అందక నిరుత్సాహానికి గురవుతున్నారు. వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కొందరికి ఈ సాయం ఉపయోగ పడుతుందని ఆశించినా.. సర్కారు నుంచి స్పందన లేక ఆందోళనకు గురువతున్నారు. అధి కారులు, ప్రజా ప్రతినిధుల

kumaram bheem asifabad-అంగన్‌వాడీలకు పదవీ విరమణ సాయం అందేనా..?
సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు(ఫైల్‌)

జైనూర్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు (ఆయాలుగా) విధులు నిర్వహించి విరమణ పొందిన వారికి ప్రభుత్వం నుంచి సాయం అందక నిరుత్సాహానికి గురవుతున్నారు. వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కొందరికి ఈ సాయం ఉపయోగ పడుతుందని ఆశించినా.. సర్కారు నుంచి స్పందన లేక ఆందోళనకు గురువతున్నారు. అధి కారులు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తూ, ధర్నాలు చేస్తున్నా ఫలితం లేక పోవడం వారిని కుంగు బాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం సాయం పెంచుతూ జీవో జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు.

- చిన్నారులకు..

చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణు లు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య రక్షణలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకంగా మారిం ది. గత ప్రభుత్వం హయాంలో విరమణ పొందిన టీచర్‌ కు రూ. లక్ష, హెల్పర్‌కు రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించినా అమలు కాలేదు. 2024 ఏప్రపిల్‌ నుంచి 65 ఏళ్లకు పదవి విరమణ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక టీచరుకు రెండు లక్షలు, ఆయా కు రూ. లక్ష ఇస్తామని ప్రకటించింది. గతేడాది మే నెల లో జీవో జారీ చేశారు. 65 ఏళ్లలోపు స్వచ్ఛందంగా విరమణ చేసే వారికి ఇది వర్తిపజేస్తామని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. జిల్లాలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 841 మంది టీచర్లు, 559 మంది హెల్పర్లు పని చేస్తున్నారు. అదేవిధంగా 0-5 ఏళ్బ పిల్లలు 46,026, గర్భిణులు, బాలింతలు కలిసి 7,677లు ఉన్నారు. కాగా జిల్లాలో 2024 ఏప్రిల్‌ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారి వివరా లు అందించాలని ప్రభుత్వం కోరడంతో జిల్లా శిశు సంక్షే మ శాఖ అధికారులు పంపించారు. ఇప్పటి వరకు విర మణ పొందిన టీచర్లు 39, హెల్పర్లు 143 మంది ఉన్నా రు. వీరిలో కొందరు అనారోగ్య సమస్యలతో సతమ తమవుతున్నారు. కొందరు మృతి చెందినట్లు సంఘాల సభ్యులు చెబుతున్నారు.

రెండేళ్లయినా సాయం అందలేదు..

- లటపటే లీలాబాయి, జామ్ని

విరమణ పొంది రెండేళ్లయినా సాయం అందలేదు. జైనూర్‌ మండలంలోని జామ్ని అంగన్‌వాడీ కేంద్రంలో 35 సంవత్సరాల పాటు పనులు చేశాను. విరమణ పొందిన వారికి రూ. రెండు లక్షలు ఇస్తామన్నారు. ఇప్ప టి వరకు నయా పైసా రాలేదు. పింఛన్‌ కూడా రావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వృధ్ధాప్యం లో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Feb 12 , 2026 | 11:11 PM