kumaram bheem asifabad- బస్ డిపో ఏర్పాటయ్యేనా..?
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:53 PM
కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు నోచుకోవడం లేదు. పట్టణ జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యా లు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే భూమి కేటాయించారు. ఆ భూములు ఇంకా ఖాళీగానే ఉంటున్న కూడా డిపో ఏర్పాటు దిశగా మాత్రం అడుగులు పడడం లేదు.
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు నోచుకోవడం లేదు. పట్టణ జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యా లు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే భూమి కేటాయించారు. ఆ భూములు ఇంకా ఖాళీగానే ఉంటున్న కూడా డిపో ఏర్పాటు దిశగా మాత్రం అడుగులు పడడం లేదు. కాగజ్‌నగర్‌లో బస్ డిపో కోసం గతంలోనే బస్సు స్టేషన్ పక్కన స్థలం కేటాయించారు. కానీ నేటికి కూడా బస్ డిపో ఏర్పాటు కోసం నిధులు కానీ కార్యాచరణ కానీ ముందుకు సాగడం లేదు. కుమరం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు నేటికి కూడా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఉన్నప్పటికీ కాగజ్‌న గర్ డివిజన్‌లో ఉన్న ఏడు మండలాలైన సిర్పూర్ (టి). బెజ్జూరు, కౌటా ల, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్‌పేటతో పాటు కాగజ్‌నగర్ మండలాల్లోని పలుమారుమూల ప్రాంతాలకు నేటికి బస్సు సౌకర్యం లేదు. వీటిలో అటవీ గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసి బస్సు సౌకర్యం కాదుకదా కనీసం బస్సు షెల్టర్స్, బస్సు స్టేషన్‌ల నిర్మాణం కూడా కొన్ని మండల కేంద్రాల్లో దశాబ్దాలుగా జరగలేదు. ఒక్క కౌటాల మినహా సిర్పూర్ (టి), బెజ్జూరు, దహెగాంలతో పాటు కొత్త మండలాల్లో బస్సు స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అయినా గత ప్రభుత్వా లు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు న్నాయి. ఇందుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణ మని భావిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కూడా గత అసెంబ్లీ సమావేశాల్లో కాగజ్‌నగర్‌కు బస్ డిపో ఏర్పాటు చేయాలని, దీంతో సిర్పూరు నియోజకవ ర్గంలోని మారుమాల గ్రామాలకు రవాణా వ్యవస్థ మరింత మెరుగు పరిచేందుకు అవకాశాలున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కాగజ్‌నగర్ డిపో తెరమీదకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే డిపో ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
- నియోజవర్గ పరిధిలో..
కాగజ్‌నగర్‌లో డిపో ఏర్పాటు చేస్తే సిర్పూరు నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, సిర్పూ రు(టి), బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగు పడనుంది. ఈ మండలాల్లో గిరి గ్రామాలున్నాయి. నిత్యం వివిధ అవసరాల కోసం కాగజ్‌నగర్‌కు వస్తుంటారు. బస్సులు సకాలంలో రాక పోవడంతో వీరంతా ఆటోలు, జీపుల్లో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగజ్‌నగర్ డిపో ఏర్పాటు చేస్తే ఈ గ్రామాలకు నేరుగా బస్సులను పంపించేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ డిపో నుంచి కాగజ్‌నగర్ బస్టాండుకు బస్సులు రావాల్సి ఉంటుంది. కాగజ్‌నగర్‌కు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బస్సులను వివిధ రూట్లలో ఆయా గ్రామాలకు పంపించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు సకాలంలో ఆయా గ్రామాలకు పంపించలేని పరిస్థితి ఉందని వివిధ మండలాల వాసులు వాపోతున్నారు. కాగజ్ నగర్ బస్ డిపో ఏర్పాటు చేస్తే అన్ని మండలాలకు బస్సు సౌకర్యం కల్పించటమే కాకుండా సమీప మహారాష్ట్ర్ట్రకు కూడా సిర్పూరు(టి), చింతల మానేపల్లి. కౌటాల, బెజ్జూరు మండలాల మీదుగా బస్సు సౌకర్యం సైతం కలిగించే అవకాశం ఉంది. బస్సు డిపో స్థలం ఆక్రమణకు గురవుతుండడంతో గతంలో అధికారులు సర్వే చేపటిట హద్దులు ఏ ర్పాటు చేశారు. అలాగే కాగజ్‌నగర్ నుంచి ఆయా మండలాలకు వార సంతలకు వెళ్లే వ్యాపారులు బస్సు సౌకర్య కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నా రు. దీంతో మరింత ఆర్టీసీ ఆదాయం పెరిగే అవకా శాలున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కాగజ్‌నగర్‌లో బస్ డిపోతో పాటు బస్సు షెల్టర్ల నిర్మాణం, ఆయా మండలాల్లో బస్సు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఏడు మండలాల వాసులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి..
- అంబాల ఓదెలు, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్‌లో ఆర్టీసి బస్సు డిపో ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. బస్సు డిపో ఏర్పాటుతో సిర్పూరు నియోజకవర్గంలోని ఏడు మండలాల వాసులకు ఎంతగానో సౌకర్యం ఉంటుం ది. అలాగే మహారాష్ట్రకు కూడా రాకపోకలు సాగిం చేందుకు ఇబ్బందులు తొలగిపోతాయి. సంస్థకు ఆదాయం కూడా పెరుగుతుంది.