Share News

kumaram bheem asifabad- వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:59 PM

వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని బెజ్జూరు అటవీశాఖ ఇన్‌చార్జి రేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం పాఠశాల విద్యార్థులచేత ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

kumaram bheem asifabad- వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
బెజ్జూరులో ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

బెజ్జూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని బెజ్జూరు అటవీశాఖ ఇన్‌చార్జి రేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం పాఠశాల విద్యార్థులచేత ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అడవులతో పాటు వన్య ప్రాణులను సంరక్షించుకోవాలన్నారు. వాటి ద్వారా అడవులకు రక్షణ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో సెక్షన్‌ అధికారులు సాఫియాబేగం, మనోహర్‌, సంతోష్‌, బీట్‌ అధికారులు నవ్యరెడ్డి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శనివారం జాతీయ వన్యప్రాణి వారోత్సవాల కార్యక్రమాన్ని అటవీ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అడవుల రక్షణకు అంతా సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ ర్వహించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెంచికల్‌పేట్‌, (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పక్షులను పరిశీలించి.. ప్రకృతి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని పెంచికల్‌పేటలో శనివారం బర్డ్‌వాక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లూరు చెరువు వద్ద నిర్వహించిన బర్డ్‌ వాక్‌లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకాశంలో విహరిస్తున్న పక్షులను నేరుగా గమనిస్తూ, పక్షుల జీవన విధానం, ప్రకృతిలో వాటి ప్రాధాన్యతని తెలుసుకుంటూ ఆసక్తిగా బర్డ్‌ వాక్‌ సాగింది. కార్యక్రమంలో డీఆర్‌వో అస్మా, ఎఫ్‌ఎస్‌వెలు అహ్మద్‌ అలీ, గోవింద్‌, ఎఫ్‌బీవోలు సంగదీప్‌, కళ్యాణ్‌, స్వర్ణలత, శిరీష, సతీష్‌, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 10:59 PM