Share News

kumaram bheem asifabad- అడవి పందుల బెడద.. అన్నదాతలకు వ్యథ

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:48 PM

అన్న దాతలను అడవి పందులు నట్టేటా ముంచుతు న్నాయి. మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా అడవి పందుల దాడిలో పంటలు నష్టపోయి నష్టపరిహారం అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఎదురవుతున్న సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు.

kumaram bheem asifabad- అడవి పందుల బెడద.. అన్నదాతలకు వ్యథ
లోగో

- పంట నష్టపోతున్న రైతులు

- ఆర్థికంగా దెబ్బతింటున్నామని ఆవేదన

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అన్న దాతలను అడవి పందులు నట్టేటా ముంచుతు న్నాయి. మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా అడవి పందుల దాడిలో పంటలు నష్టపోయి నష్టపరిహారం అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఎదురవుతున్న సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల్లో ఎదుగుదల లేదని వాపోతున్నారు. ప్రారంభంలో కురిసిన అడపాదడపా జల్లులతో సాగవుతున్న మొక్కజొన్న పంట పొట్ట దశలో ఉంది. చేతికొచ్చే సమయంలో అడవి పందుల దాడులు చేస్తూ పంటలను పాడు చేస్తుండడడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో సమస్య తీవ్రంగా ఉంది. రాత్రీ పగలు పంటలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. అతివృష్టి, అనావృష్టి కారణంగా సతమత మవుతున్న అన్నదాతలకు అడవి పందుల దాడి కలవర పెడుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికంది అమ్ముకునే దాకా రైతులకు ఇబ్బందులే. రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి, కంది, వరి పంటలకు అడవి పందులు చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. జిల్లాలోని ఏజేన్సి మండలాలైన లింగాపూర్‌, సిర్పూర్‌(యు), జైనూర్‌, కెరమెరి, వాంకిడి, తిర్యాణి బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికలపేట, సిర్పూర్‌(టి) మండలాల్లోనే పందుల బెడద ఎక్కువగా ఉంది. రైతులు సాగు చేసిన పత్తి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పత్తి కాత, పూత కాలం కావడంతో పంట చేలల్లో అడవి పందులు గుంపులుగా వెళ్లి పంటలను నాశనం చేస్తున్నాయ ని రైతులు ఆందోళన చెందుతున్నారు.

- పంటల రక్షణకు రైతుల పాట్లు..

పంటల రక్షణకు రైతుల పాట్లు పడుతున్నారు. పంటల సాగుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వ్యవసాయం చేస్తున్నా ప్రకృతి వైపరిత్యాల కార ణంగా పంటల దిగుబడి రాక అప్పుల్లో మునుగు తుండగా మరోవైపు అడవి పందుల బెడదతో ఉన్న పంట కాస్తా చేతికి రాకుండా పోతుండడంతో అప్పులే మిగులు తున్నాయని వాపోతున్నారు. పత్తి కాయలు, పూతను పందులు పూర్తిగా తిని ద్వంసం చేస్తుండటంతో కాత సమయంలోనే పంటలకు నష్టం సంభవిస్తుండడంతో సాగు కోసం పెట్టిన ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు వివిధ పద్ధతులు అనుసరిస్తున్నారు. కొందరు మైకులు కొనుగోలు చేసి దానిలో ప్రత్యేక శబ్దాన్ని రికార్డు చేసి చేన్లలో పెడుతున్నారు. మరికొందరు చేను చుట్టూ తీగలు అల్లి వాటికి బ్యాటరీతో అనుసంధానించి తక్కువ మోతాదులో విద్యుత్తు షాక్‌ తగిలేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొందరు చేన్ల చుట్టూ చీరలు, నైలాన్‌వలలు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రివేళల్లో టపాకాయలను పేల్చడం, వివిధ రకాల శబ్దాలు వంటివి చేస్తున్నా రు. ఇన్నిరకాల చర్యలతో రైతులు చేన్లలో కాపలా ఉంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పందులతో నష్టం వాటిల్లిన పంటలకు పరిహారం అందించాలని అధికారులను కోరుతున్నారు. కానీ వాటి నుంచి పంటలను రక్షించుకోలేకపోతున్నా మని ఆవేదన చెందుతున్నారు. .ఇటీవల లింగాపూ ర్‌ మండలంలోని కొత్తపల్లి, లింగాపూర్‌, భీమానా యక్‌ తండా గ్రామాల శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో.అడవి పందులు రాత్రి సమయాల్లో గుంపులుగా స్వైర విహారం చేస్తూ పంటలను నాశనం చేశాయి.

- అందని పరిహరం..

జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల పంట చేలల్లో అడవి పందుల కారణంగా ఏటా పంటలకు నష్టం జరుగుతున్నా అటవీ శాఖ ఎలాంటి సాయం అందించడం లేదు. గత దశాబ్ద కాలంగా ఈ సమస్య అధికంగా ఉంది. అయితే అడవి పందుల బెడద కారణంగా పంటలకు నష్టం జరుగుతున్నా నష్టపరిహారం మాత్రం ఏమాత్రం అందడం లేదు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేం దుకు రైతులు రాత్రి, పగలు తేడా లేకుండా పంట చేలల్లోనే కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయ ని చెబుతున్నారు. ఒక్కోసారి పందులు గుంపులుగా వచ్చిన సమయంలో దాడి చేస్తాయనే భయంతో ఏం చేయలేకపోతున్నామని తెలుపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి పందులను చంపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ షరతులు ఉండడంతో వాటిని అటవీ శాఖ కూడా ఏం చేయలేకపోతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, వరి పంటల ను పూర్తిగా ధ్వంసం కావడంతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పంటలకు నష్టం సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఏటా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం పరిహారం అందించడం లేదని రైతులు వాపోతున్నారు.

పంటలకు రక్షణ కరువు..

-పవర్‌ రవిందర్‌, రైతు, లింగాపూర్‌

ఎంతో కష్టపడి సాగు చేస్తున్న పంటలకు రక్షణ కరువైంది. పంటలను కాపాడుకునేందుకు ప్రతిని త్యం ఇంట్లో వారంతా చేలల్లోనే కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినా పంటలకు నష్టం జరుగుతూనే ఉంది. రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి, పంటలకు తీవ్ర నష్టం కలుగు తోంది. అధికారులు మా గోడు పట్టించుకోని నష్టపో యిన పంటలకు పరిహారం అందేలా చూడాలి.

Updated Date - Sep 09 , 2026 | 10:48 PM