kumaram bheem asifabad- పంటలపై అడవిపందుల దాడి
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:28 PM
అన్న దాత లను అడవి పందులు నట్టేటా ముంచుతు న్నాయి. మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా అడవి పందుల దాడిలో పంటలు నష్టపోయి నష్టపరిహారం అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఎదురవుతున్న సమస్యలతో అన్న దాతలు సతమతమవుతున్నారు.
- కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు
కెరమెరి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అన్న దాత లను అడవి పందులు నట్టేటా ముంచుతు న్నాయి. మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా అడవి పందుల దాడిలో పంటలు నష్టపోయి నష్టపరిహారం అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఎదురవుతున్న సమస్యలతో అన్న దాతలు సతమతమవుతున్నారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల్లో ఎదుగు దల లేదని వాపోతున్నారు. ప్రారంభంలో కురిసిన అడపాదడపా జల్లులతో సాగవుతున్న మొక్కజొన్న పంట పొట్ట దశలో ఉంది. చేతికొచ్చే సమయంలో అడవి పందుల దాడులు చేస్తూ పంటలను పాడు చేస్తుండడడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో సమస్య తీవ్రంగా ఉంది. రాత్రీ పగలు పంటలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. అతివృష్టి, అనావృష్టి కారణంగా సతమత మవుతున్న అన్నదా తలకు అడవి పందుల దాడి కలవర పెడుతోంది.
- అమ్ముకునే దాక..
ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికం ది అమ్ముకునే దాకా రైతులకు ఇబ్బందులే. రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి, కంది, వరి పంటలకు అడవి పందులు చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు.మండలంలో అడవి పందుల బెడద రోజు రోజుకు అధికమవుతోంది. రైతులు ఎం తో శ్రమించి సాగు చేసిన వివిధ రకాల పంటలపై అడవి పందులు రాత్రి వేళల్లో ఏకకాలంలో దాడులు చేసి నాశనం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు కళ్లముందే ధ్వంసం అవుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కెరమెరి మండలం లోని కెరమెరి, సుర్ధాపూర్, బాబేఝరి, కొలాంగూడ తదితర గ్రామాల్లో వివిధ పంటలను కాపాడుకు నేందుకు రైతులు తమ పొలాల్లో రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపాల కాస్తున్నారు. అయినా కూడా కళ్లు తప్పి దాడికి గుంపులు గుంపులుగా పందులు దాడి చేస్తున్నాయి. అడవులు నుంచి గుంపులుగా పొలాల్లోకి వస్తున్న అడవి పందులు వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు తదితర పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో దాడులు చేయటంతో రైతులు వాటిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. పంటలపై దాడి చేసి అనంతరం తిరిగి అడవుల్లోకి వెళ్లిపోతుం డడంతో వాటిని నియంత్రించడం కష్టంగా మారిం దని రైతులు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు కోసం రైతులు భారీగా పెట్టుబడులను పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో అటవీ పందులు దాడి చేయటంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చెందుతు న్నారు. కొందరు రైతులు పంట పొలాల వద్ద కాపాలు కాస్తు మంటలు వేస్తూ, టపాసాలు కాలుస్తూ శబ్దాలు చేస్తు వాటిని తరిమే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గుంపులుగా వస్తున్న అడవి పందులను అడ్డుకోవటం సాధ్యం కావడం లేదని రైతులు తెలిపారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అం దించినట్టు తెలిపారు. తమకు పంట నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
- అందని సాయం..
జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల పంట చేల ల్లో అడవి పందుల కారణంగా ఏటా పంటలకు నష్టం జరుగుతున్నా అటవీ శాఖ ఎలాంటి సాయం అందించడం లేదు. గత దశాబ్ద కాలంగా ఈ సమస్య అధికంగా ఉంది. అయితే అడవి పందుల బెడద కారణంగా పంటలకు నష్టం జరుగుతున్నా నష్టపరిహారం మాత్రం ఏమాత్రం అందడం లేదు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేం దుకు రైతులు రాత్రి, పగలు తేడా లేకుండా పంట చేలల్లోనే కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయ ని చెబుతున్నారు. ఒక్కోసారి పందులు గుంపులుగా వచ్చిన సమయంలో దాడి చేస్తాయనే భయంతో ఏం చేయలేకపోతున్నామని తెలుపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి పందులను చంపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ షరతులు ఉండడంతో వాటిని అటవీ శాఖ కూడా ఏం చేయలేకపోతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, వరి పంటల ను పూర్తిగా ధ్వంసం కావడంతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పంటలకు నష్టం సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఏటా వేల ఎకరా ల్లో పంట నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం పరిహా రం అందించడం లేదని రైతులు వాపోతున్నారు.