kumaram bheem asifabad- ఎయిడెడ్ పాఠశాలలపై పట్టింపేది..?
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:08 PM
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న కూడా ఎయిడెడ్ పాఠశాలలపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎయిడెడ్ పాఠశాలల్లో బోధిం చే ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతుండగా, కొత్త వారిని నియమించే అవకాశాలు లేక పోవడంతో ఆయా ఎయిడెడ్ యాజమాన్యాలు తాత్కాలికంగా ప్రయివేటు వ్యక్తులతో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా మార్కెట్‌లో పోటీ తత్వం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు చదివేందుకు మొగ్గు చూపుతుండడంతో ఎయిడెడ్ పాఠశాలలు వరుసగా మూత బడుతున్నాయి
- పట్టించుకోని పాలకులు, అధికారులు
కాగజ్‌నగర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న కూడా ఎయిడెడ్ పాఠశాలలపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎయిడెడ్ పాఠశాలల్లో బోధిం చే ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతుండగా, కొత్త వారిని నియమించే అవకాశాలు లేక పోవడంతో ఆయా ఎయిడెడ్ యాజమాన్యాలు తాత్కాలికంగా ప్రయివేటు వ్యక్తులతో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా మార్కెట్‌లో పోటీ తత్వం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు చదివేందుకు మొగ్గు చూపుతుండడంతో ఎయిడెడ్ పాఠశాలలు వరుసగా మూత బడుతున్నాయి. ఈ పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బంది ఖాళీలున్న చోట బదిలీ చేస్తున్నారు. కాని అర్హత కలిగిన వారికి ఇంత వరకు ప్రమోషన్లు కల్పించడం లేదని, పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరించడం లేదని ఎయిడెడ్ పాఠశాలల్లో బోధిస్తున్న టీచర్లు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రయోజనం చేకూరడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
- జిల్లా కేంద్రంలో..
జిల్లా కేంద్రంలో ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఒకప్పుడు విద్యార్థులతో ఎంతో క్రేజీ ఉన్న ఈ పాఠశాలలు ఇప్పుడు మూసివేతకు గురవుతున్నాయి. ఈ ఎయిడెడ్ పాఠశాలలు విద్యార్థులు, ఉద్యోగులు లేక ఇప్పుడు పూర్తిగా బోసి పోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 23 ఎయిడెడ్ పాఠశాలలుండగా, ఒక్క కుమరం భీం జిల్లాలోనే ఏడు ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో నూతన నియామాకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వక పోవటంతో ఉన్న ఉపాధ్యాయులంతా పదవీ విరమణ పొందడం, కొత్త విద్యార్థులు రాక పోవడంతో తద్వారా పూర్తిగా మూసివేసితకు గురవుతున్నాయి. ఐదేళ్ల క్రితం కాగజ్‌నగర్‌లోని బాలవిద్యామందిర్ పాఠశాల విద్యార్థులు, కొత్త ఉపాధ్యాయులు రాక పోవ డంతో పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఏ ఎయిడెడ్ పాఠశాలలుండగా, ఇందులో కాగజ్‌నగర్‌లో మూడు పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలు కూడా బాలభారతి, శిశుమందిర్, అన్వర్ హైస్కూల్ ఉన్నాయి. 1954లో ప్రారంభించిన బాలవిద్యామందిర్ పాఠశాల మా త్రం ఘనమైన చరిత్ర ఉంది. సిర్పూరు పేపర్ మిల్లు ఉండడంతో స్థానికేతరులు అధి కంగా రావడంతో హిందీ పాఠశాల ఆవశ్యతక ఏర్పడింది. ఆ సమయంలో ఎస్పీఎం యాజమాన్యం సౌజన్యంతో బాలవిద్యామందిర్ పాఠశాలను ప్రారంభించారు. అధికారికంగా 1954లో ఎయిడెడ్ పాఠశాలగా గుర్తిం పు తెచ్చింది. ప్రారంభించిన సమయంలో 23 మంది ఉపాధ్యాయులు, 900 మంది విద్యార్థులతో కళకళలాడేది. కానీ ఒక్కొక్క ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొందుతుండటంతో కాలక్రమేణ ఉపాధ్యాయుల పూర్తిగా లేకుండానే పోయింది. దీంతో ఐదేళ్ల క్రితం మూసివేశారు. ఇదే తరహాలో కూడా పట్టణంలోని పలు పాఠశాలల పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయంగా ప్రయివేటు క్వాలిఫైడ్ టీచర్స్‌తో బోధనను కొనసాగిస్తున్నారు. కొత్త నియామకాలు చేపట్టేందుకు అనుమతులు లేక పోవడంతో ఎయిడెడ్ పాఠశాలలు ఒక్కొక్కటి మూసివేతకు గురవుతున్నాయి. ఎయిడెడ్ పాఠశాల్లో పని చేస్తున్న సిబ్బంది, ఉపాధ్యాయులకు జీతాలు సక్రమంగా రాక పోవడం, పదవీ విరమణ పొందిన వారికి బకాయిలు ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.