రోడ్డు వెడల్పు పనుల్లో జాప్యం ఎందుకు
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:12 PM
పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు వరకు చేపట్టిన రోడ్ల విస్తరణ పనుల్లో జాప్యం ఎం దుకు జరుగుతుందో మంత్రి వివేక్‌వెంకటస్వామి ప్రజలకు చెప్పాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పేర్కొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్
చెన్నూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు వరకు చేపట్టిన రోడ్ల విస్తరణ పనుల్లో జాప్యం ఎం దుకు జరుగుతుందో మంత్రి వివేక్‌వెంకటస్వామి ప్రజలకు చెప్పాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళ వా రం పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనుల్లో ఇప్పటికే ఏడు నెలల జాప్యం జరిగిందని, ఇటీవల టెండరు ప్రక్రియ పూర్తి చేయడంలో మంత్రి నిర్లక్ష్యం మంత్రి అనుచరుల ఒత్తిడి కనబడిందని అందువల్లనే అధికారులు టెం డర్లు ఓపెన్ చేయడం లేదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నాలుగు నెలల క్రితం రెండు భవనాల నిర్మాణం కొరకు టెండరు ప్రక్రియ పూర్తయి నా నేటి వరకు టెండర్లు ఓపెన్ చేయలేదని నలుగురు ప్రజాప్రతినిధులు తన కంటే తనకని కొట్లాడడం మూలంగా ఇంత వరకు టెండరు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఇలా జరగడం ఎంత వరకు సమంజసమన్నారు. రానున్న దసరా, దీపావళి పండగలను దృష్టిలో ఉం చుకుని కనీసం డ్రైనేజీ వాటర్‌నైనా సరైన దిశలో ప్రవహించే విధంగా చ ర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శాంత వెంకటనర్సయ్య, శివకృష్ణ, నాయకులు వెంకటేశ్వర్, శంకర్, శ్రీని వాస్, మధుకర్ పాల్గొన్నారు.