kumaram bheem asifabad-ఎవరి వ్యూహం వారిదే..
ABN , Publish Date - Feb 06 , 2026 | 10:18 PM
మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు, పట్టు నిలుపుకునేలా బీఆర్‌ఎస్ వ్యూహా లు, ఎక్కువ స్థానాల్లో గెలవాలని బీజేపీ తహతహ లాడుతున్నాయి. దీంతో జిల్లాలో పుర పోరు వేడెక్కుతోంది. అగ్ర నాయకులు సైతం ప్రచారంలో పాల్గొంటూ మున్సిపాలిటీల్లో పాగా వేసేలా పావులు కదుపుతున్నారు.
- సీటు చేజారిపోకుండా అగ్ర నాయకుల దృష్టి
- వేడెక్కుతున్న పుర రాజకీయం
మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు, పట్టు నిలుపుకునేలా బీఆర్‌ఎస్ వ్యూహా లు, ఎక్కువ స్థానాల్లో గెలవాలని బీజేపీ తహతహ లాడుతున్నాయి. దీంతో జిల్లాలో పుర పోరు వేడెక్కుతోంది. అగ్ర నాయకులు సైతం ప్రచారంలో పాల్గొంటూ మున్సిపాలిటీల్లో పాగా వేసేలా పావులు కదుపుతున్నారు.
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిప ల్ ఎన్నికల వేళ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 11న పోలింగ్ జరుగనుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పరిస్థితులు భిన్నంగా మారాయి. స్థానిక సమస్యలు, వర్గ సమీకరణాలు, కార్మిక ఓటు బ్యాంక్ కీలకంగా మారడంతో పార్టీల వ్యూహాలతో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు సభల్లో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తు తం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయని వాటిపై వివరిస్తూ తమకు అనుకూలంగా ఓటర్లు ఉండేలా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీ ఎన్ని కల్లో కాంగ్రెస్ హవా వీచినా కూడా జిల్లాలో ఆశించిన మేర ఫలితాలు రాలేదు. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ పట్టు సాధించేందుకు పక్కాగా ప్రణాళికలను రూపొందిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం చేసిన సూచనలు, వర్గ పోరు లేకుండా అన్ని చర్యలు తీసుకొని ఎన్నికల బరిలోకి దిగింది. ఆరు గ్యారంటీల అమలు తీరుపైనే ప్రచా రంలో వివరిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉందంటూ కర పత్రాల ద్వారా ఇంటింటా అవగాహన పరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కూడా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ సత్తాను చాటేందుకు దీటుగా ఎత్తు గడలు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, డబుల్ బెడ్ రూం బిల్లులు, ఉచిత కరెంటు తదితరు పథకాలు అమలుపై కూడా దగ్గరుండి వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణలను తిప్పి కొట్టేస్తున్నారు. మరో మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, తప్పకుండా తమను గెల్పిస్తేనే నిధులు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీకి చెందిన నాయకులు కర పత్రాలు, వాల్ పోస్టర్లు వేస్తూ వార్డుల వారీగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నారు. ఏ వార్డు నుంచి ఎవరు గెలుస్తారు, అనుకూలతలు, ప్రతికూలతల పై దృష్టి సారించారు. ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది. దీంతో అగ్రనాయ కులతో పాటు అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
మెజార్టీ స్థానాల కోసం..
జిల్లాలో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసు కోవాలని ఊవ్విళ్లూరుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని తమకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఇక్కడి నాయకుల ప్రచారం చేస్తున్నారు. బీజే పీ జాతీయ నాయకత్వం సైతం మున్సిపల్ ఎన్నిక లపై దృష్టి సారించింది. పుర పోరులో జెండా ఎగుర వేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు బల మైన పునాది అవుతాయని ఆ పార్టీ భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ఓటర్లు తమను ఎక్కువ ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్న కమలనాథు లు మున్సిపాలిటీల్లో పట్టు సాధించేందుకు ప్రయ త్నిస్తున్నారు. రాష్ట్రంలోనే అన్ని మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తోందని, రా ష్ట్ర ఖాజానా నిండుకుందంటూ అన్ని సభల్లో ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జిల్లాలో రెండు మున్సి పాల్టీల్లో బోణి కొట్టేందుకు ఆ పార్టీకి చెందిన నాయకులు గెలుపు గుర్రాలను బరిలోకి దించారు. మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరుగనుండడంతో జిల్లాలో ఉత్కంఠ ఏర్పడింది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచార కోసం మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కాగజ్‌నగర్‌కు శనివారం రానున్నారు. ఎస్పీ ఎం క్రీడా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు జిల్లా నుంచి బీజేపీ శ్రేణు లను అధిక సంఖ్యలో తరలించేందుకు నాయకులు ప్రణాళికతో వెళుతున్నారు. మున్సిపల్ ఎన్ని కలకు అగ్ర నాయకత్వం వస్తుండడంతో ఎన్నికల పోరు ఒక్కసారిగా వేడేక్కింది.