Share News

కుర్చీ ఎవరిదో...?

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:09 PM

క్యాతన్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో కుర్చీ ఎవరిదనే సందిగ్దానికి తెరపడనుంది.

కుర్చీ ఎవరిదో...?
క్యాతన్‌పల్లి మునిసిపల్‌ కార్యాలయం

-నేడు క్యాతన్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు

-క్యాంపు నుంచి తిరిగి రానున్న బీఆర్‌ఎస్‌, సీపీఐ కౌన్సిలర్లు

మంచిర్యాల, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): క్యాతన్‌పల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో కుర్చీ ఎవరిదనే సందిగ్దానికి తెరపడనుంది. వాస్తవానికి ఫబ్రివరి 13న మునిసి పల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడగా, 16వ తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎ న్నిక నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య నెలకొన్న పోరు సం దర్భంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు పలువురు హై కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. రాష్ట్రంలో వాయిదాపడ్డ క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానా పూర్‌ మునిసిపల్‌ ఎన్నికలను మూడు వారాల్లోగా నిర్వహించాలని హై కోర్టు గత నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గడువు సమీపిస్తుం డటంతో ఈ నెల 4వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమి షన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో నేడు నిర్వహంచే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

క్యాంపు నుంచి నేరుగా కార్యాలయానికి...

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడటంతో అప్ర మత్తమైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ బీఆర్‌ఎస్‌తోపాటు మిత్రపక్ష మైన సీపీఐ సభ్యులు 14 మందిని క్యాంపునకు తరలించారు. అప్పటి నుంచి వారంతా క్యాంపులోనే ఉండగా, శనివారం నేరుగా మునిసిపల్‌ కా ర్యాలయంలో జరుగున్న ఎన్నికకు తిరిగి రానున్నారు. అయితే ఈసారైనా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందా అన్న సందేహాలు ప్రజల్లో నెల కొన్నాయి. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయగా, గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీస్‌శాఖ ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా మునిసిపల్‌ కార్యాలయ పరి సర ప్రాంతాల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలు చేస్తోంది. ఇందులో భా గంగా మునిసిపల్‌ కార్యాలయం ఆవరణతోపాటు, పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 సిబ్బందిని ఎన్నికల కోసం నియమించారు.

బీఆర్‌ఎస్‌కే అవకాశాలు...

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల్లో మిత్రపక్షమైన సీపీఐతో కలిసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బీఆర్‌ఎస్‌కే అధికంగా ఉన్నాయి. మొ త్తం 22 వార్డులకుగాను బీఆర్‌ఎస్‌, సీపీఐ కూటమికి కలిపి మొత్తం 14 సీట్లు లభించాయి. అలాగే అధికార కాంగ్రెస్‌కు ఏడు సీట్లురాగా, స్వతంత్ర అభ్యర్థి పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గడ్డం వివేకానంద, ఆయన కుమారుడు పె ద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఎక్స్‌ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియో గించుకోనున్నారు. వారిద్దరితో కాంగ్రెస్‌ సంఖ్య 10కి చేరుతుంది. అయినా మ్యాజిక్‌ ఫిగర్‌ దాటకపోవడంతో ఆ పార్టీ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసు కొనే అవకాశాలు దాదాపుగా లేవు. ఒకవేళ ఊహించని విధంగా సీపీఐ సభ్యులు నలుగురు హస్తం పార్టీకి మద్దతు తెలిపితే తప్ప చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు కాంగ్రెస్‌ ఖాతాలో పడే అవకాలు లేవు.

Updated Date - Apr 03 , 2026 | 11:09 PM