Share News

మేయర్‌ పదవి వరించేదెవరినో...!

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:47 PM

మునిసిపల్‌ ఎన్నికలు ముగిసి, ఫలితాలు కూడా వెల్లడికాగా, ఇక మేయర్‌/చైర్మన్‌ పదవుల భర్తీ చేపట్టవలసి ఉంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా సెలవుదినడం కావడం తో ఆ ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ సోమవారం చేప ట్టనుంది.

మేయర్‌ పదవి వరించేదెవరినో...!

-మంచిర్యాల కార్పొరేషన్‌లో టెన్షన్‌

-ఇప్పటికీ ఖరారుకాని పేర్లు

-మునిసిపాలిటీల్లోనూ పూర్తిగాని అభ్యర్థుల ఎంపిక

-రేపు మునిసిపల్‌ మేయర్‌/చైర్మన్‌ల ఎన్నిక

మంచిర్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలు ముగిసి, ఫలితాలు కూడా వెల్లడికాగా, ఇక మేయర్‌/చైర్మన్‌ పదవుల భర్తీ చేపట్టవలసి ఉంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా సెలవుదినడం కావడం తో ఆ ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ సోమవారం చేప ట్టనుంది. జిల్లాలో ఎన్నికలు జరిగిన మంచిర్యాల కార్పొ రేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షె ట్టిపేట మునిసిపాలిటీలకు మేయర్‌/చైర్మన్‌ల ఎన్నిక ఈ నెల 16న చేపట్టనుండగా, ఎవరు ఆ పదవులను అలం కరిస్తారోనన్న టెన్షన్‌ విజేతలతోపాటు ప్రజల్లోనూ ఉం ది. మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు చెన్నూరు, లక్షెట్టిపే ట, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి మునిసిపాలిటీల్లో కలెక్టర్‌ సమక్షంలో సోమవారం మధ్యాహ్నం చైర్మన్లు, మే యర్‌ పదవులకు ఎన్నిక జరుగనుంది. ఈ మేరకు ఆయా మునిసిపాలిటీల్లోనే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత మేయర్‌/చైర్మన్‌లను ఎన్నుకున్న తరువాత డి ప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఉండనుంది. పై పదవుల ఎంపిక పూర్తికాగానే వారితోపాటు కార్పొరేట ర్లు/కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టనున్నారు.

చేతులెత్తడం ద్వారా ఎంపిక....

మేయర్‌/చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఎన్నికల్లో గెలుపొం దిన వారు చేతులెత్తడం ద్వారా చేపట్టనున్నారు. మంచి ర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 44 సీట్లు వచ్చినం దున మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు ఆ పార్టీకే దక్కనున్నాయి. చెన్నూరు, లక్షెట్టిపేట మునిసిపాలిటీల ను సైతం కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకున్నందున ఆ పార్టీ కౌన్సిలర్ల నుంచే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్ను కోనున్నారు. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు చెందిన వారు చైర్మన్‌ పదవిని అలంకరించే అవకాశాలు ఉన్నాయి. క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకున్నందున సీపీఐకి చెందిన కౌన్సిలర్‌ ఒకరికి వైస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక బెల్లంపల్లి మునిసిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఎప్పటిక ప్పు డు మారుతున్నందున అక్కడ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పద వులు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య దోబూచులాడు తున్నా యి. బెల్లంపల్లిలో 34 వార్డులకు గాను కాంగ్రెస్‌, బీఆర్‌ ఎస్‌ చెరో 14 వార్డులు గెలుచుకోగా, బీజేపీ 1, స్వతంత్రు లు 5 సీట్లలో గెలుపొందారు. రెండు పార్టీలకు సమా నంగా సీట్లు దక్కడంతో బలనిరూపణ చేసే పార్టీకి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల విష యంలో కౌన్సిలర్ల మధ్య ఇప్పటికే గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ వివాదం కౌన్సిలర్లు పార్టీ మారేదాక వచ్చింది. ప్ర స్తుత పరిస్థితుల్లో బెల్లంపల్లిలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగిరే అవకాశాలే అఽధికంగా కనిపిస్తున్నాయి.

తెరపైకి పలువురి పేర్లు...

మంచిర్యాల కార్పొరేషన్‌కు సంబంధించి మేయర్‌, డి ప్యూటీ మేయర్‌ పదవులు ఆశించే కాంగ్రెస్‌ కార్పొరేటర్ల పేర్లు కొన్ని తెరపైకి వచ్చాయి. మేయర్‌ పదవి బీసీ జ నరల్‌ విభాగానికి రిజర్వ్‌ అయినందున ఆ పదవిని ఆ శిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిలో 14 వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన తూముల నరేష్‌, 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ ధరణి మధూకర్‌, 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెంట రజిత, వ 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ సల్ల రమ్య మహేష్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నా యి. పై వారిలో ఎవరో ఒకరిని మేయర్‌ పదవి వరించ నుండగా, మరొకరు డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కాను న్నారు. లక్షెట్టిపేట మునిసిపాలిటీ ఎస్సీ జనరల్‌కు రిజ ర్వ్‌కాగా 2వ వార్డు అభ్యర్థి దొంత అంజలికి చైర్మన్‌ పద వి లభించే అవకాశాలు ఉన్నాయి. క్యాతన్‌పల్లి ము నిసి పాలిటీ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌కాగా 17వ వార్డు కౌన్సిలర్‌ గొడిశెలి సంధ్యారాణికి ఇచ్చే అవ కాశా లు అధికంగా ఉన్నాయి. బెల్లంపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌కాగా, వర్గానికి చెందిన 28వ వార్డు కౌన్సిలర్‌ చిప్ప అర్చన, 7వ వార్డు కౌన్సిలర్‌ దావా స్వాతి ఆశిస్తున్నారు. చెన్నూరు మునిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌కాగా ఆ వర్గానికి 2వ వా ర్డు కౌన్సిలర్‌ పెద్దింటి పద్మ, 8వ వార్డు కౌన్సిలర్‌ సుంకరి శిరీష, 9వ వార్డు కౌన్సిలర్‌ సుద్దపల్లి సునీత, 12వ కౌన్సి లర్‌ ఎండీ నజ్మా, 15వ వార్డు కౌన్సిలర్‌ కొమ్మెర జయలక్ష్మి ఆశిస్తున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 11:47 PM