Share News

ప్రభుత్వ భూమిని కాపాడేదెవరు..!

ABN , Publish Date - May 31 , 2026 | 11:45 PM

మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ఐదెకరాల ప్ర భుత్వ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ భూమిని కాపాడేదెవరు..!
నస్పూర్‌ శివారు సర్వే నెంబరు 64లోని ప్రభుత్వ స్థలం

-ప్రైవేటు వ్యక్తి పేరిట ఉన్న ప్రొసీడింగ్‌ రద్దు

-కలెక్టర్‌ ఆదేశాలను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్‌

-పదేళ్లుగా కౌంటర్‌ దాఖలు చేయని అధికారులు

-తాజాగా కౌంటర్‌ దాఖలుకు రంగం సిద్ధం

-అన్యాక్రాంతం కానున్న రూ. 30 కోట్ల సర్కారు భూములు

మంచిర్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ఐదెకరాల ప్ర భుత్వ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. అధికారుల అండదండలతో ఏకంగా కోర్టు ద్వారానే భూమి పొందేందుకు కొందరు వ్యక్తులు పథక రచ న చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అ ధికారులే తప్పిదాలకు పాల్పడుతూ కబ్జాకోరులకు సహక రించడం కొసమెరుపు. అధికారులు చేసిన మొదటి తప్పు కారణంగా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నిజామాబాద్‌ జిల్లాలో నిర్మించిన ఎస్సారెస్పీ కింద భూములు కోల్పోయిన రైతుకు ఇక్కడ రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని వ్యవసా య భూమి కింద అప్పనంగా అప్పగించగా, నాలుగు వారా ల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలన్న హై కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి పరోక్షంగా కబ్జాకోరుల పక్షాన నిలవడం రెవెన్యూ అధికారులకే చెల్లింది. ఫలితంగా రూ. 30 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలానికి రెక్కలు వచ్చాయి.

ఎస్సారెస్పీ నిర్వాసితుని పేరుతో...

1963లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భూమి కో ల్పోయిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ముథోల్‌ మండ లం రాయపూర్‌ కాండ్లీ గ్రామానికి చెందిన సైదుల నర్సయ్య పేరుతో స్థలం కోసం అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అశోక్‌కు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న న స్పూర్‌ శివారు సర్వే నెంబర్లు 42లో మూడెకరాలు, 64లో రెండెకరాలను సైదుల నర్సయ్యకు ఇవ్వడానికి ఆమోదిస్తూ (జీ1/787/2013, తేది 23.04.2013న) లేఖ రాశారు. (వాస్త వానికి రాయ్‌పూర్‌ కాండ్లీ గ్రామం లోకేశ్వరం మండలంలో ఉండగా తప్పుడు పత్రాలు సృష్టించారు). కలెక్టర్‌ లేఖ ఆధా రంగా అప్పటి మంచిర్యాల తహసీల్దార్‌ ప్రొసీడింగ్‌ నం.ఏ/428/2013, తేదీ 13.05.2013, ఆర్వోఆర్‌ /నస్పూర్‌/134/2013, తేదీ13.05.2013 జారీ చేశారు. నిబం ధనల ప్రకారం నిర్వాసితుడికి కేటాయించిన భూమిలో మూ డేళ్లపాటు తప్పనిసరిగా వ్యవసాయమే చేయాలని పట్టాలో నే పేర్కొన్నారు. ఈ ప్రకారం భూమిని ఇతరులకు విక్ర యించడం కుదరదు. కానీ...పట్టా చేసిన 17 రోజులకే భూ మి మంచిర్యాల పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు వాలా శ్రీనివాసరావు, వంగపెల్లి పూర్థచందర్‌రావులకు బదిలీ అయింది. రెవెన్యూ అధికారులు ఆ ఇద్దరి పేరిట ఆర్వోఆర్‌ ప్రొసీడింగ్‌, పాసు పుస్తకాలు జారీ చేశారు.

ప్రొసీడింగ్‌ను రద్దు చేసిన కలెక్టర్‌....

ఎస్సారెస్పీ నిర్వాసితుడికి మంచిర్యాలలో భూమి కేటా యించడం, 17 రోజులకే ఇతరుల పేరిట పట్టాలుగా మా రడంతో ’ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచిక, జిల్లా అనుబంధంలో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో 2015లో అప్పటి ఉ మ్మడి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ ఎం జగన్మోహన్‌ విచారణకు ఆదే శించారు. ఎస్సారెస్పీ నిర్వాసితుడు సైదుల నర్సయ్యకు కేటా యించిన స్థలంలో నిబంధనలు పాటించలేదని వెల్లడైంది. దీంతో 2015 నవంబరు 2న అంతకు ముందు నిర్వాసితుడి పేరిట ఇచ్చిన ఆర్వోఆర్‌ ప్రొసీడింగును రద్దు చేస్తూ తక్షణ మే భూమిని కస్టడీలోకి తీసుకోవాలని మంచిర్యాల ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. ఎలాంటి ముందస్తు నోటీసు లు ఇవ్వకుండా నేరుగా పట్టా ఎలా రద్దు చేస్తారని, రద్దు ఆదేశాలను నిలువరింపజేయాలని కోరుతూ వాలా శ్రీనివాస రావు, వంగపెల్లి పూర్ణచందర్‌రావులు 17.11.2015న హై కోర్టును ఆశ్రయించారు. దీంతో పట్టా రద్దు చేసిన విషయమై నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని అప్పటి ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌, మంచి ర్యాల ఆర్డీవో, తహసీల్దార్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిం ది. హై కోర్టు ఆదేశాలను పెడ చెవిన పెట్టిన అధికారులు పదేళ్ల పాటు కౌంటర్‌ దాఖలు చేయకుండా కాల యాపన చేశారు. అంతా సద్దుమనిగిందని భావించిన వ్యాపారులు మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. వారికి అనుకూలంగా అఽధికార యంత్రాంగం ప్రస్తుతం కోర్టుకు నివేదిక సమర్పిం చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అది కూడా అప్పట్లో జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆ శ్రయించిన వారికే మద్దతుగా నివేదిక సమర్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

విలువైన భూములు అన్యాక్రాంతం...

అధికారులు కబ్జాకు మద్దతుగా హై కోర్టులో పిటిషన్‌ దా ఖలు చేసేందుకు సిద్ధపడుతుండటంతో జిల్లా కేంద్రంలో అ త్యంత విలువైన భూములు అన్యాక్రాంతం కానున్నాయి. ప్రస్తుతం ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా రూ. 6 కోట్లు పై చిలుకు పలుకుతోంది. ఇదిలా ఉండగా ఇ ప్పటికే సర్వే నెంబరు 64లో అక్కడక్కడా భూమి కబ్జాలకు గురికాగా, శాశ్వత కట్టడాలు కూడా వెళిశాయి. సర్వే నెంబ రు 42లో మాత్రం ఖాళీ స్థలం ఉండగా ప్రభుత్వ భూము లను చేజిక్కించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. ఇదే జరిగితే భవిష్యత్తులో జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను ఎవరైనా చేజిక్కించుకునేందుకు మా ర్గం చూపినట్లు అవుతుందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను రెవె న్యూ అధికారులు కాపాడాలని వారు కోరుతున్నారు.

Updated Date - May 31 , 2026 | 11:45 PM