బరిలో మిగిలేది ఎవరో..!
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:33 PM
ముసినిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 28 నుంచి నామి నే షన్ల పర్వం ప్రారంభం కాగా మొదటి రెండు రోజుల్లో అ భ్యర్థుల నుంచి ఓ మోస్తరు స్పందన లభించింది
-ముగిసిన నామినేషన్ల పర్వం
-నేడు పరిశీలన
-ఒక్కొక్కరు రెండు మూడు సెట్లు దాఖలు
-ఫిబ్రవరి 3వ తేదీన అభ్యర్థుల తుది జాబితా విడుదల
మంచిర్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ముసినిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 28 నుంచి నామి నే షన్ల పర్వం ప్రారంభం కాగా మొదటి రెండు రోజుల్లో అ భ్యర్థుల నుంచి ఓ మోస్తరు స్పందన లభించింది. చివరి రోజున పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖల య్యాయి. మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసి పాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా, మొత్తంగా 149 వార్డు సభ్యు ల స్థానాల్లో అభ్యర్థులు తలపడనున్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్‌లు, బె ల్లంపల్లి మునిసిపాలిటీలో 34 వార్డులు, క్యాతన్‌పల్లిలో 22, చెన్నూరులో 18, లక్షెట్టిపేటలో 15 వార్డులు ఉన్నాయి.
భారీగా నామినేషన్లు దాఖలు....
జిల్లాలోని ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీ ల్లో గడిచిన మూడు రోజుల్లో భారీ సంఖ్యలో నామినేష న్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ అభ్యర్థులతోపాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలుస్తున్నారు. మిగతా మునిసిపాలిటీలతో పోల్చితే మంచిర్యాల కార్పొరేషన్‌లోనే అభ్యర్థుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. కార్పొరేష న్‌గా తొలి ఎన్నికలు కావడంతో ఆశావహులు పెద్ద మొ త్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రెండు రో జుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో మొత్తం 374 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో మం చిర్యా ల కార్పొరేషన్‌లో 186 నామినేషన్లు దాఖలు కాగా అమ్ ఆద్మీ పార్టీ నుంచి 5, బీఎస్పీ నుంచి 3, బీజేపీ నుంచి 42, కాంగ్రెస్ నుంచి 53, ఏఐఎంఐఎం నుంచి 1, బీఆర్ ఎస్ నుంచి 60, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్రుల నుంచి 11 నామినేషన్లు ఉన్నాయి. బె ల్లంపల్లి మునిసిపాలిటీలో 97 నామినేషన్లు దాఖలు కాగా బీజేపీ నుంచి 11, సీపీఐ(ఎం) నుంచి 2, కాంగ్రెస్ నుంచి 51, ఏఐఎంఐఎం నుంచి 1, బీఆర్‌ఎస్ నుంచి 23, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 2, స్వతంత్రుల నుంచి 7 దాఖలయ్యాయి. చెన్నూరు మునిసిపాలిటీలో 29 నామినేషన్లు దాఖలు కాగా, బీజేపీ నుంచి 9, కాం గ్రెస్ నుంచి 6, బీఆర్‌ఎస్ నుంచి 4, ఇతర గుర్తింపు పొం దిన పార్టీల నుంచి 6, స్వతంత్రుల నుంచి 4 దాఖ ల య్యాయి. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో 32 నామినేషన్లు దాఖలు కాగా, బీజేపీ నుంచి 5, కాంగ్రెస్ నుంచి 9, బీఆర్‌ఎస్ నుంచి 5, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 6, స్వతంత్రుల నుంచి 7 ఉన్నాయి. లక్షెట్టిపేట మునిసిపాలిటీలో 30 నామినేషన్లు దాఖలు కాగా, బీ ఎస్పీ నుంచి 1, బీజేపీ నుంచి 7, కాంగ్రెస్ నుంచి 14, బీ ఆర్‌ఎస్ నుంచి 5, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుం చి 1, స్వతంత్రుల నుంచి 2 నామినేషన్లు ఉన్నాయి. ఇక చివరి రోజైన శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మంచిర్యాల కార్పొరేషన్‌లో సాయం త్రం 5 గంటలకు గడువు ముగిసే సమయానికి 400 పైచిలుకు నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్ణీత గడువులోగా కలెక్టరేట్‌లోని కౌంటర్ల వద్దకు చేరుకున్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేశారు. వారందరినీ నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమ తించనున్నారు. గడువు ముగిసే సమయానికి 300 పై చిలుకు టోకెన్లు జారీ అయ్యాయి. అలాగే ఇతర మునిసి పాలిటీల్లోనూ చివరి రోజున పెద్ద సంఖ్యలో నామి నేషన్లు దాఖలయ్యాయి.
రెండు మూడు సెట్లు దాఖలు...
వివిధ పార్టీలు, స్వతంత్రులు ఒక్కొక్కరు రెండు మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు నామినేషన్ల దా ఖలు చివరి రోజున కూడా అభ్యర్థులను ఖరారు చేశా యి. దీంతో ఆయా పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థు లు పార్టీ పరంగా రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, ఒ కవేళ అనుకొని పరిస్థితుల్లో పార్టీలు టికెట్ నిరాకరిస్తే బరిలో నిలిచే విధంగా స్వతంత్రులుగా సైతం నామినే షన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా బీ ఫాం ఇస్తే అప్పటి వరకు పార్టీ పరంగా వేసిన నామినే షన్ ఉపయోగపడుతుండగా, పార్టీలు నిర్ణయం మా ర్చుకుంటే ఇండిపెండెంట్‌గా దాఖలు చేసిన నామినే షన్ పనికి వస్తుందనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్త చ ర్యగా రెండు మూడు సెట్లు దాఖలు చేసినట్లు తెలు స్తోంది. అలా జిల్లాలోని మొత్తం 149 వార్డులకు మొద టి రెండు రోజుల్లో 374 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా చివరి రోజున అన్ని చోట్లా మొదటి రెండు రోజు ల్లో దాఖలైన సంఖ్యకు రెట్టింపు నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది.
3న తుది జాబితా విడుదల...
శుక్రవారంతో నామినేషన్ల దాఖలు పర్వం ముగి యగా, ఫిబ్రవరి 3వ తేదీన బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడించనున్నారు. ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు స్వీకరించిన నామినేషన్లను అధికారులు పరిశీలించనుండగా, రద్ద యిన నామినేషన్లు పోను అదే రోజు అభ్యర్థుల జాబి తా విడుదల చేయనున్నారు. అలాగే జాబితాపై ఫిబ్ర వరి 1వ తేదీన తుది అభ్యంతరాలు స్వీకరించి, 2వ తే దీన వాటికి పరిష్కారం చేపట్టనునున్నారు. నామినేష న్ల ఉప సంహరణ 3వ తేదీన చేపట్టనుండగా, అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను విడు దల చేయనున్నారు.