Share News

ఎవరికిద్దాం..

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:23 PM

మున్సిపల్‌ ఎన్నికల్లో ఎవరికి పార్టీల మద్దతు లభిస్తుందోనన్న ఉ త్కంఠ ఆశావహుల్లో నెలకొంది. రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తికావడంతో ఇక అభ్యర్థుల ఎంపికనే మిగిలి ఉంది. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండగా, అసలు బీ ఫాంలు ఎవరికి అందుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెల కొంది

ఎవరికిద్దాం..

బీ ఫాంలు దక్కేదెవరికో..?

-అధికార కాంగ్రెస్‌లో పోటీ తీవ్ర తరం

-ఒక్కో వార్డులో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు

-ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించిన పలువురు

-అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగేస్తున్న ముఖ్య నాయకులు

మంచిర్యాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో ఎవరికి పార్టీల మద్దతు లభిస్తుందోనన్న ఉ త్కంఠ ఆశావహుల్లో నెలకొంది. రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తికావడంతో ఇక అభ్యర్థుల ఎంపికనే మిగిలి ఉంది. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండగా, అసలు బీ ఫాంలు ఎవరికి అందుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెల కొంది. ముఖ్యంగా ఈ పరిస్థితి అధికార కాంగ్రెస్‌లో రో జు రోజుకూ తీవ్రతరం అవుతోంది. అయితే మున్సిపల్‌ ఎన్నికల్లో తమకే టికెట్లు లభిస్తాయన్న ఆశతో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఆశావహులు ఇప్పటి నుం చే ప్రత్యక్ష ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. త్వ రలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఆచి తూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో అన్ని సీ ట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ ముఖ్య నాయకు లు భావిస్తుండగా, గట్టి పోటీ ఇవ్వడం ద్వారా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్‌, బీజేపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

బీ ఫాం కోసం ఎదురు చూపులు....

తమ నేతలపై నమ్మకంతో ఇంతకాలం పార్టీలను అంటిపెట్టుకుని పని చేసిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్లందరూ ఇప్పుడు బీ ఫాంల కోసం ఎదురు చూ స్తున్నారు. బీ ఫాం ఎవరికి ఇవ్వాలనే విషయమై నాయకులు తర్జనబర్జన పడుతున్నారు. ఎలాగైనా టికెట్‌ ద క్కించుకోవాలనే ప్రయత్నాల్లో అభ్యర్థులు ఉన్నారు. మ రోవైపు మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ముందుగానే టికెట్లు కేటాయించి, నిరసన సెగలు తగిలించుకొనే కంటే, చివరి నిమిషం వరకు వేచి ఉండటమే మేలన్న భావనలో ఎమ్మెల్యేలు ఉ న్నట్లు తెలుస్తోంది. ఈ లోగా టికెట్లు దక్కని ఆశావహులు ఇతర పార్టీల నాయకులతో అంటకాగకుండా వారిని బుజ్జగించడం ద్వారా సమస్య జఠిలం కాకుండా ముం దు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి....

జిల్లాలోని ఎన్నికలు జరుగనున్న మంచిర్యాల కార్పొ రేషన్‌తోపాటు మిగతా నాలుగు మున్సిపాలిటీలు బెల్లం పల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు, లక్షెట్టిపేటలో మొత్తం 149 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని మూడు నియోజక వర్గాల ఎమ్మెల్యేలు భావిస్తుండగా, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్‌ఎస్‌, బీజీపీలు సైతం ప్రణాళికలు రచిస్తున్నాయి. గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇచ్చేందుకు మంచి ర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేం సాగర్‌రావు, గడ్డం వినోద్‌, గడ్డం వివేకానంద జాబితాలను సిద్ధం చేయగా, ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటంతో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో టికెట్లు తమకే ఇవ్వాలనే అభ్యర్థుల ఒత్తిడి కారణంగా ఎమ్మెల్యేలు ఆచితూచి నిర్ణ యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల ము న్సిపల్‌ కార్పొరేషన్‌లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు కౌన్సిలర్‌ పదవులు చేపట్టిన వారి లో కొందరికి ఈసారి మొండి చేయి చూపుతారనే ప్రచా రం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న వారిలో కొంత మందికి చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. వా రిలో పార్టీపట్ల విశ్వసనీయత లోపించిందనే భావన తో పాటు మొదటి నుంచి పార్టీని అంటి పెట్టుకొని ఉండి, ప్రజాభిమానం చూరగొన్న వారికే టికెట్ల కేటాయింపు లో ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఎమ్మెల్యే ప్రేంసా గర్‌రావు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో టి కెట్లు దక్కనివారు బీజేపీలో చేరాలనే ఆలోచనతో ఉన్న ట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల ని యోజక వర్గంలో బీజేపీ ద్వితీయ స్థానంలో నిలవడ మే ఆశావహులు ఆ పార్టీ వైపు చూడటానికి ప్రధాన కార ణమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను వదులుకోరాదనే ఆలోచనలో ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు ఉన్నట్లు సమాచారం.

Updated Date - Jan 20 , 2026 | 11:23 PM