అధికారులను భయపెట్టేందుకే కేటీఆర్ పింక్ బుక్ డ్రామా: విప్ ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:40 AM
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ‘పింక్ బుక్’, ‘రెడ్ బుక్’ పేరుతో కేటీఆర్ బెదిరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా ...
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ‘పింక్ బుక్’, ‘రెడ్ బుక్’ పేరుతో కేటీఆర్ బెదిరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అధికారులను భయపెట్టాలని చూడడం కేటీఆర్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల సూచనలు తీసుకుంటూ, ఎవరికీ ఇబ్బంది కలగకుండా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. కేటీఆర్ మాత్రం కుటుంబ గొడవల వల్ల కలిగిన అసహనాన్ని అధికారులపై ప్రదర్శిస్తున్నారని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పూర్తయితే తన రాజకీయ ఉనికి ఎక్కడ గల్లంతవుతుందోనన్న భయంతోనే కేటీఆర్ ‘చిట్ చాట్’ పేరుతో చెత్తమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.