kumaram bheem asifabad- జన ఔషధి జాడేదీ..?
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:45 PM
పేదలకు తక్కువ ధరకే ఔషధాలు అందిం చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజ న(పీఎంబీజేపీ) కింద జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటులో వేల ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో పట్టణాలు, మండల కేంద్రాలు పలెల్లో వీటిని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది.
కాగజ్‌నగర్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పేదలకు తక్కువ ధరకే ఔషధాలు అందిం చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజ న(పీఎంబీజేపీ) కింద జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటులో వేల ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో పట్టణాలు, మండల కేంద్రాలు పలెల్లో వీటిని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. కాని సంబంఽధిత అధికారుల అలసత్వంతో జిల్లాలో ఇవీ పూర్తి స్థాయిలో ఏర్పాటుకు నోచుకోవడం లేదు. దీంతో జిల్లా వాసులంతా కాగజ్‌నగర్ పట్టణంతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఆర్థికంగా ఎదుర య్యే ఇబ్బందులు అధికమవుతాయి. చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రిలకు వెళ్లినా, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌లో ప్రైవేటు ఆసుపత్రిల్లో చికిత్స పొందిన ఔషధాలు ఎక్కువ బయటే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇందుకయ్యే ఖర్చుల కోసం వారు అప్పులు చేయక తప్పడం లేదు. ఇలాంటి పేదలకు తక్కువ ధరకే ఆయా కంపెనీలకు చెందిన ఔషధాలు అందుబాటులోకి తీసుకరావాలనే లక్ష్యంతో ప్రభుత్వం జన ఔషధిని ప్రొత్సాహిస్తోంది. ఈ దుకాణాలపై నాణ్యమైన మందులు 50-80 శాతం తక్కువ ధరకే లభిస్తాయి.
- గ్రామీణ ప్రాంతాల్లో..
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వ ర్యంలో దుకాణాలను ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన లక్ష్యం కూడా ఇంకా నెరవేరడం లేదు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలు కావడంతో పాటు వారి కుటుంబం దగ్గరి బంధువుల్లో ఎవరైనా బీ ఫార్మసి, ఎంఫార్మసి విద్యార్హత కలిగి ఉండాలి. రుణం పొందడానికి ముందుగా సభ్యురాలిగా ఉన్న సంఘం, గ్రామైక్య సంఘం తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ధ్రువపత్రం కొటేషన్, విద్యార్హత ధ్రువప త్రాలతో స్త్రీనిధి అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్జీదారులను అర్హులుగా భావిస్తే అధికారులు రుణం మంజూరు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో కాగజ్‌నగర్‌లో మాత్రమే జనరిక్ ఔషధ దుకాణాలను నెలకొల్పారు. పెట్రోలు పంపు ఏరియా, భట్టుపల్లి చౌరస్తా, మార్కెట్ ఏరి యాలో కొనసాగు తున్నాయి. మండలానికి ఒకటి చొప్పున దుకాణాలను ఏర్పాటు చేస్తే పేదలకు ఆర్థిక ఇబ్బందులు దూరం కానున్నాయి. ఈ దిశగా అధికార యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించిన మహిళా సంఘాల సభ్యులను ప్రొత్సహించి రుణాలు, మంజూరు చేసి దుకాణాలను ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా అడుగు వేయా లని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.