kumaram bheem asifabad- ఆటలకు చోటేది?
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:18 PM
జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యాప్రమాణాల మాట ఎలా ఉన్నా విద్యార్థుల సర్వతోము ఖాభివృద్ధి కి దోహదపడే ఆటలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చదువుతో పాటు ఆటలు ఉన్నప్పుడే పిల్లలు మానసి కంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. కానీ జిల్లా లోని ఉన్నత పాఠశా లల్లో ఆడుకునే మైదానాలు, ఆటల పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
- పాలకుల హామీలే తప్ప కనిపించని ఆచరణ
- భర్తీకాని వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు
జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యాప్రమాణాల మాట ఎలా ఉన్నా విద్యార్థుల సర్వతోము ఖాభివృద్ధి కి దోహదపడే ఆటలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చదువుతో పాటు ఆటలు ఉన్నప్పుడే పిల్లలు మానసి కంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. కానీ జిల్లా లోని ఉన్నత పాఠశా లల్లో ఆడుకునే మైదానాలు, ఆటల పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఆసిఫాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆటలు అటకెక్కుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడ లకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో వ్యాయా మ ఉపాధ్యాయుల కొరత అతిగతిలేని మైదానాలతో క్రీడలకు బావి క్రీడాకారులు దూరమవుతున్నారు. దీంతో విద్యార్థులకు క్రీడలు అందని ద్రాక్షగా మిగిలి పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిం చలేక పోతున్నారు. ఇదిలా ఉండగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మినీ స్టేడియం జిల్లా ఏర్పాటులో భాగంగా పోలీసుశాఖకు కేటాయించారు. అందులో ఏఆర్ హెడ్‌క్వార్టర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలోని యువకులు, క్రీడాకారులు, వాకర్స్ వ్యా యామానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పా టు చేసిన క్రీడా ప్రాంగాణాలు క్రీడా సదుపాయాలు లేకపోవడంతో అలంకారప్రాయంగానే మిగిలి పోతున్నాయి.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో మొత్తం 1258 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 908 ప్రాథమిక, 180 ప్రాథమి కోన్న త, 170 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో సగానికి పైగా పాఠశాలల్లో క్రీడామైదనాలులేవు. ఇక వ్యాయా మ విద్యను బోదించే పీఈటీ, పీఈడీ పోస్టులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకుండా ఉన్నాయి. ప్రాథమిక స్థాయి లోనే నిర్భంద వ్యాయామ విద్య ప్రవేశపెట్టి విద్యా ర్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడే క్రీడలు వ్యాయామం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపె ట్టాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కాగాగతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడ ప్రాంగణాలు సదుపాయాలకు నోచుకొవడంలేదు. ఈ ప్రాంగణాలు ఊరు చివర నిర్మించడం, చదునుగా లేకపోవడం, పిచ్చి మొక్క లు ఏపుగా పెరగడంతో ఆటలు ఆడేందుకు అనువ ుగాలేవు. దీంతో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు అలంక రప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. దీంతో గ్రామీణ క్రీడకారులు తమలో దాగిఉన్న క్రీడా నైపుణ్యతను ప్రదర్శించలేక పోతున్నారు.
- మినీ స్టేడియం..
జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో లక్షలు వెచ్చించి నిర్మించిన మినీ స్టేడియంను ప్రభు త్వం పోలీసుశాఖకు కేటాయించింది. 2016లో జిల్లా ఏర్పడిన సందర్భంగా అప్పుడే పూర్తయి అందుబా టులో ఉన్న మినీ స్టేడియాన్ని పోలీసుశాఖకు కేటా యించడంతో ప్రస్తుతం ఆ మినీ స్టేడియంలో ఏఆర్ హెడ్‌క్వార్టర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పట్టణంలోని యువకులు, క్రీడాకారులు, విద్యార్థులు ఆటలు అడుకునేందుకు మైదానం లేకుండా పోయింది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నవారు వాకింగ్, జాగింగ్ చేయాలంటే ఇబ్బందులు పడక తప్పడంలేదు. అలాగే పోలీసు, ఆర్డీ ఉద్యోగాల భర్తీ సమయంలో కసరత్తు చేసుకునేందుకు యువ తకు క్రీడామైదానం లేకపోవడంతో ప్రాక్టిస్ కోసం ఇతర ఖాళీ స్థలాలే దిక్కవుతున్నాయి. మినీ స్టేడి యాన్ని తిరిగి అప్పగించాలని గతంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకో వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వ్యాయామ విద్యను పకడ్బందీగా అమలు చేయాలి..
- అవిడపు ప్రణయ్, జిల్లా యువజన సంఘం నాయకుడు
పాఠశాలల్లో వ్యాయామ విద్యను పకడ్బందీగా అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ప్రభుత్వం క్రీడా మైదానాల నిర్మాణాలతో పాటు ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాఽ ద్యాయుల పోస్టులను భర్తీ చేయాలి. పట్టణంలోని మినీ స్టేడియంను తిరిగి క్రీడలకు కేటాయిస్తే ఆట గాళ్లకు వ్యాయామ కసరత్తులు చేసేందుకు ప్రయో జనకరంగా ఉంటుంది.