సింగరేణి లాభాలపై స్పష్టత ఏదీ...?
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:48 AM
సింగరేణి సంస్థ గడించిన లాభాలను ప్రకటించడంలో తీవ్ర జా ప్యం జరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా యాజమాన్యం, ప్రభుత్వం లాభా లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోలిండియాలో ప్రతీ త్రైమాసికానికి ఒకసారి లాభాలను ప్రకటిస్తుండగా, సిం గరేణిలో మాత్రం ఆర్థిక సంవత్సరం ముగిసి నెలలు గ డుస్తున్నా ఇంకా కొలిక్కి రాకపోవడం గమనార్హం.
-ఆర్థిక సంవత్సరం ముగిసినా ప్రకటించని వైనం
-నాలుగు నెలలు గడుస్తున్నా కొలిక్కిరాని ప్రక్రియ
-నాలుగు వేల కోట్ల మేర లాభాలు ఉంటాయని అంచనా
-40 శాతం వాటా కోసం కార్మికుల పట్టు
మంచిర్యాల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ గడించిన లాభాలను ప్రకటించడంలో తీవ్ర జా ప్యం జరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా యాజమాన్యం, ప్రభుత్వం లాభా లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోలిండియాలో ప్రతీ త్రైమాసికానికి ఒకసారి లాభాలను ప్రకటిస్తుండగా, సిం గరేణిలో మాత్రం ఆర్థిక సంవత్సరం ముగిసి నెలలు గ డుస్తున్నా ఇంకా కొలిక్కి రాకపోవడం గమనార్హం. వా స్తవానికి ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఆడిట్ ని ర్వహించి లాభాలను ప్రకటించాల్సి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా లాభాల ప్రకటనకు ప్రభుత్వం ఆరేడు నెలల సమయం తీసుకుంటుంది. దీంతో అక్టోబర్ వరకు కా ర్మికులకు లాభాల వాటా చేతికి అందుతోంది.
58 మిలియన్ టన్నుల ఉత్పత్తి...
2025-2026 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అన్ని ఏ రియాల్లో కలిపి మొత్తంగా 58 మిలియన్ టన్నుల బొ గ్గు ఉత్పత్తిని సాధించింది. అంతకు ముందు ఏడాదితో 61 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరంలోకొంతమేర ఉత్పత్తి తగ్గింది. అయినప్ప టికీ ఈ ఆర్థిక సంవత్సరం సాధించిన ఉత్పత్తిపై దాదా పు నాలుగు వేల కోట్ల నికర లాభాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏటేటా పెరుగుతున్న లాభాలు.....
సింగరేణిలో ప్రతీ ఏటా ఉత్పత్తి లక్ష్యం మేరకు జరు గుతుండగా అదే స్థాయిలో నికర లాభాలను కూడా సంస్థ ఆర్జిస్తోంది. 2013-14లో రూ. 11928 కోట్లుగా ఉ న్న అమ్మకాలు 123 శాతం వృద్ధితో గత ఏడాదికి రూ. 26607 కోట్లకు చేరుకున్నాయి. లాభాలు కూడా గరిష్టంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో రూ. 419 కోట్లు నికర లాభం సాధించగా 2021-22 నాటికి రూ. 1227 కోట్ల రూపాయలను సంస్థ ఆర్జించింది. అలా గే 2024-25లో రూ. 2వేల కోట్లు లాభాలను ఆర్జించగా, సంస్థ సాధించిన టర్నోవర్‌పై కార్మికులు లాభాల వాటా కింద 39 శాతాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎని మిదేళ్ల కాలంలో ప్రగతి బాటన పయనిస్తున్న కంపెనీ ఏటేటా తన లాభాలను పెంచుతూ వస్తోంది. ఇదిలా ఉండగా ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ము గియగా, గరిష్టంగా రెండు నెలల వ్యవధిలో లాభాలను ప్రకటించాల్సి ఉంది. అయితే పదేళ్లుగా సంస్థ ఆర్జించి న లాభాలను ఆరేడు నెలల అనంతరం ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఏడు కూడా ఇప్పటి వరకు లాభాలపై స్పష్టతనివ్వకపోవడంతో పాత ఆనవాయితీనే కొనసాగి స్తుందన్న ప్రచారం జరుగుతోంది.
40 శాతం వాటాకు కార్మికుల పట్టు....
సింగరేణి సాధించిన నికర లాభాలను ప్రకటించే సమయం ఆసన్నం కావడంతో తమ వాటా 40 శాతం గా ఖరారు చేయాలని కార్మికులు కోరుతున్నారు. గత ఏడాది 39 శాతం వాటా చెల్లించగా, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో 40 శాతం చెల్లించి తీరాలనే డిమాం డ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గుర్తింపు సంఘం తోపాటు ఇతర జాతీయ కార్మిక సంఘాలు కూడా సంస్థపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దపడుతున్నాయి. సంస్థ లాభాలపై 40 శాతం కార్మిక వాటా చెల్లిస్తే ఒక్కో కార్మి కుడికి దాదాపు లక్ష రూపాయల వరకు నగదు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి యేడు దసరా పం డుగ సమయంలో యాజమాన్యం లాభాల వాటా కార్మి కులకు చెల్లిస్తుండగా, ఈ ఏడాది కూడా అదే సమ యంలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
త్వరగా ప్రకటించాలి....
ఏఐటీయూసీ అధ్యక్షుడు, వాసిరెడ్డి సీతారామయ్య
ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగిసినప్ప టికీ ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించక పోవడం సమంజసం కాదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ప్రక్రియ పూర్తి చేసి, గరిష్టంగా రెండు నెలల లోపు లాభాల వాటా ప్రకటించాలి. యాజమాన్యం వెంటనే ఆడిట్ పూర్తి చేసి, లాభాలపై స్పష్టత ఇవ్వాలి. అలాగే ఈ సంవత్సరం సంస్థ సాధించిన లాభాల్లో కార్మికుల వాటా కింద 40 శాతం చెల్లించాలి.