Share News

ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టత ఏదీ

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:32 PM

యాసంగిలో వరిసాగు చేయ వద్దని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రత్యామ్నాయ పంటలు వేసు కోవా లో, రోజుకు ఎన్ని గంటలు కరెంట్‌ ఇస్తుందో స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టత ఏదీ

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి

దండేపల్లి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో వరిసాగు చేయ వద్దని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రత్యామ్నాయ పంటలు వేసు కోవా లో, రోజుకు ఎన్ని గంటలు కరెంట్‌ ఇస్తుందో స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి అన్నారు. దండేపల్లిలో పార్టీ నాయకులతో కలిసి స్థానిక సబ్‌స్టేషన్‌ సందర్శించారు. ఈసందర్బంగా ఏఈ బాపుతో మాట్లాడి ప్రస్తుతం రైతులకు అందిస్తున్న విద్యుత్‌ సరఫరా వివరాలు, రాబోయే యాసంగి పంటలకు ఎన్ని గంటల పాటు కరెంటు ఇస్తారనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం ట్రాన్స్‌కో ఎస్‌ఈకి ఫోన్‌ చేసి మండల రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ కోతల స మస్య తక్షణమే పరిష్కరించాలని నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలి సినప్పటికీ ప్రభుత్వం సరైన ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల రై తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈసారి అసలు అసలు పంటలే వేయవద్దని చెప్పడం రైతులను మరింత ఆందోళనకు గు రిచేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నందుర్క సుగుణ, పార్టీ నా యకులు సురేందర్‌, సంతోష్‌, సురేష్‌, శేఖర్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 11:32 PM