kumaram bheem asifabad- స్వచ్ఛతలో మనమెక్కడ..?
ABN , Publish Date - May 05 , 2026 | 10:27 PM
దేశ వ్యాప్తంగా పట్టణ పరిశుభ్రతను మెరుగుపరుచడం, ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంపొందించటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను నిర్వహిస్తోంది. వారం రోజులుగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ద్వారా నగరాలు, పట్టణాలు శుభ్రత, వ్యర్థ నిర్వహణ ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో ఎలా పని చేస్తున్నాయో అంచనా వేస్తారు.
- స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాకింగ్‌పై సర్వే
- రెండు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న నమోదు
కాగజ్‌నగర్, మే 2 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా పట్టణ పరిశుభ్రతను మెరుగుపరుచడం, ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంపొందించటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను నిర్వహిస్తోంది. వారం రోజులుగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ద్వారా నగరాలు, పట్టణాలు శుభ్రత, వ్యర్థ నిర్వహణ ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో ఎలా పని చేస్తున్నాయో అంచనా వేస్తారు. ఈ సర్వే ప్రధాన లక్ష్యం స్వచ్ఛ భారత్ విజన్‌ను మరింత బలోపేతం చేయడం, వీధుల శుభ్రత, చెత్తసేకరణ విధానం, చెత్తను వేరు చేయడం(వెట్ అండ్ డ్రై), రీ సైక్లింగ్, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ వంటి అంశాలు ప్రధానంగా పరిశీలిస్తారు. ప్రజలు శుభ్రత కార్యక్రమాల్లో ఎంత మేర పాల్గొంటున్నారన్నది కీలకంగా ప్రమాణంగా పరిగణిస్తారు.
- వివరాలు సేకరిస్తున్న సిబ్బంది..
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో ఈ సర్వేకు కేటాయించిన సిబ్బంది ఇంటింటా వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా సర్వేకు వచ్చిన సిబ్బంది ఇంటి యాజమానికి పేరు, తన సెల్ నెంబరును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వెంటనే ఓటీపీ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అడిగి నమోదు చేస్తున్నారు. మీ వార్డుల్లో చెత్త ఎత్తివేసేందుకు ఎన్ని రోజుల సమయం తీసుకుంటున్నారు..? ఉదయం పూట చెత్త బం డి వస్తోందా..? మురికి కాల్వల సమస్య ఉందా..? పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అడిగి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే సేకరించిన అంశాలను స్వచ్చ సర్వేక్షణ్ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేల ద్వారా వచ్చిన ర్యాంకుల ఆధారితంగా ప్రొత్సాహకాలను అందిస్తోంది. స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు వార్డుల వారీగా అఽధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నారు. ప్రతి ఇంటికి సిబ్బంది సర్వే చేసేందుకు వస్తున్నారని, అన్ని వివ రాలు కూలంకుషంగా సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. అలాగే ఈ సర్వేలో సెల్‌కు వచ్చే ఓటీపీతోనే కొనసాగుతుండడంతో ఎలాంటి పక్కాదారి పట్టకుండా ఉండేందుకు మున్సిపల్ నుంచి సర్వేకు వచ్చే అధికారులకు గుర్తింపు కార్డులు కల్పించారు. ఈ గుర్తింపు కార్డులకు కూడా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఉండేందుకు పక్కాగా చర్యలు తీసుకున్నారు. ఈ సర్వే ద్వారా రెండు మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది త్వరలోనే తేలనుంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ తిరుపతిని వివరణ కోరగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షణపై సర్వే చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఈ సర్వే జరుగుతుందన్నారు. ఆన్‌లైన్‌లోనే పూర్తి వివరాలు నమో దు చేయాల్సి ఉంటుందని తెలిపారు.