kumaram bheem asifabad-వార్డు కమిటీలెక్కడ..?
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:14 PM
జిల్లాలో మున్సిపాల్టీల్లో వార్డు కమిటీలు నిస్తేజంగా మారాయి. వాటిని పట్టించుకునే వారే లేరు. కమిటీలు ఉన్నా లేనట్టే అన్న చందంగా వాటి పరిస్థితి మారింది. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉండగా, కొత్త పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నిధులను విడుదల చేస్తోంది.
నామమాత్రంగా కమిటీల నియామకం
కాగజ్‌నగర్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపాల్టీల్లో వార్డు కమిటీలు నిస్తేజంగా మారాయి. వాటిని పట్టించుకునే వారే లేరు. కమిటీలు ఉన్నా లేనట్టే అన్న చందంగా వాటి పరిస్థితి మారింది. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉండగా, కొత్త పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నిధులను విడుదల చేస్తోంది. వార్డుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో భాగస్వాములను చేయాలని వార్డు కమిటీలను గత నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో వార్డు అభివృద్ధికి ఈ కమిటీ లు కీలక బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొదట్లో సమావేశాలు నిర్వహించినా కూడా అవి నామమాత్రంగానే మారాయి. కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి.
- ఐదేళ్ల కాల పరిమితితో..
వార్డు కమిటీలను ఐదేళ్ల కాల పరిమితితో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కమిటీలో 16 మంది సభ్యులున్నారు. వార్డు పరిఽధిలోని డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించటం, గుర్తించిన సమస్యల ఆధారంగా వార్డు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కోసం పంప డం, వార్డుల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరించే ప్రక్రియ సజావుగా సాగు తుందో లేదో చూడాలి. వార్డు పరిధిలో మొక్కలు నాటడం, పార్కుల నిర్వహణ, పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు స్థానిక వ్యాపారు లు, ప్రజలతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేసేందుకు అర్హులైన పేదలను గుర్తించడం, సహాయ పడడం, స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పని తీరును పర్యవే క్షించాలి. వీటితో పాటు మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తి పన్ను, నల్లా బిల్లులు వంటి పన్నులను ప్రజ లు సకాలంలో చెల్లించేలా ప్రొత్సాహించాలి, వార్డుల్లోని ప్రభుత్వ స్థలా లు అక్రమణలకు గురి కాకుండా మున్సిపల్ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కీలక బాధ్యతలుగా ఉంటాయి. అలాగే ప్రతీ మూడు నెలలకు ఒక సారి వార్డు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక ప్రజల నుంచి నేరుగా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించాలి. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారుల మఽధ్య ఒక వారధిగా పని చేస్తూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్న లక్ష్యంతో ఈ కమిటీలను ఏర్పా టు చేశారు. కానీ అమల్లో మాత్రం ఏ మాత్రం కన్పించక పోవడంతో కమిటీ నిర్వహణ ఉత్తదేనన్నది తేలింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వార్డు కమిటీ లతో అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం చేయించి పారదర్శక పాలన, జవాబుదారి వ్యవస్థను రూపొందిం చాలని ఆయా వార్డుల ప్రజలు కోరుతున్నారు.