Share News

kumaram bheem asifabad- పంచాయతీలకు పక్కా భవనాలేవి..?

ABN , Publish Date - Jun 27 , 2026 | 10:56 PM

జిల్లాలోని గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు లేక పాలక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో భవనాలు లేక సరైన సదుపాయాలు లేని కారణంగా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక పాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు పూర్తిస్థాయిలో భవనాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 335గ్రామపంచాయతీలు ఉండగా, ఇందులో 162పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అయితే కొత్త పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడంతో పాలనాపరంగా సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతు న్నాయి.

kumaram bheem asifabad- పంచాయతీలకు పక్కా భవనాలేవి..?
లోగో

- మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక మహిళా ఉద్యోగుల ఇబ్బంది

- పాలనాపరంగానూ అవస్థలు

బెజ్జూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు లేక పాలక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో భవనాలు లేక సరైన సదుపాయాలు లేని కారణంగా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక పాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు పూర్తిస్థాయిలో భవనాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 335గ్రామపంచాయతీలు ఉండగా, ఇందులో 162పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అయితే కొత్త పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడంతో పాలనాపరంగా సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. దీంతో కొత్త పంచాయతీలను ఆయా గ్రామాల పరిదిలోని పాఠశాలలు, ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిలో సరైన వసతులు లేక కార్యాలయాలు కొనసాగడం ఇబ్బందిగా మారుతోం ది. జిల్లాలోని 153పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.20లక్షలు మంజూరు చేసినా, కొన్నిచోట్ల పలు కారణాలతో భవన నిర్మాణ పనులు కొనసాగడం లేదు. భవనాలు నిర్మించే కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు చెల్లింపులో ఆలస్యం జరగడమే కారణమని తెలు స్తోంది. జిల్లాలో భవనాలు నిర్మించేందుకు ఉపాధి హామీ, ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేయగా, సంబంధిత కాంట్రాక్టర్లు పనులు నత్తనడకన చేయడంతో పనులు ముందుకు సాగడం లేదు. కొన్నిచోట్ల పనులు పూర్తి చేసినా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. చాలాచోట్ల పనులు అసంపూ ర్తిగా కొనసాగుతున్నాయి. దీంతో పాలనా వ్యవ హారాలు కొనసాగించడం కష్టతరంగా మారిందని పాలకవర్గాలు వాపోతున్నాయి.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో 335గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 52 పంచాయతీలకు ఐటీడీఏ, 101 పంచా యతీలకు ఉపాధి హామీ ద్వారా భవనాల నిర్మాణా లకు ఒక్కో దానికి రూ.20లోల చొప్పున నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి స్థలాల కొరతతో పనులు ప్రారంభించలేదు. ప్రారంభమైన చోట తదుపరి బిల్లులు రాక అర్దంతరంగానే నిలిచిపోయాయి. రెండేళ్లు కావస్తున్నా నిధులు రాక అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో ఆయా పంచాయ తీల్లో అవస్థల మద్య కొనసాగుతున్నాయి. పాలక వర్గాలకు సమావేశాలు నిర్వహించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. కాగా జిల్లాలో 162కొత్తగా ఏర్పట య్యాయి. పాత పంచాయతీలు శిథిల భవనాల్లో కొనసాగుతుండగా, కొత్తగా ఏర్పడ్డవి ఆరేళ్లు గడిచినా సొంత భవనాలకు నోచుకోలేదు. దీంతో చాలా పంచాయతీలు పాఠశాల భవనాలు, ఇతర వాటిల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మూత్ర శాలలు, మరు గుదొడ్లు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళా అధికారులు, సర్పంచులు ఉన్నచోట ఇబ్బందులు అనేకం. మరోవైపు కార్యాలయానికి తగ్గట్లుగా భవ నాలు లేక, సమావేశాల నిర్వహణ, రికార్డులు, సామ గ్రి భద్రతలకు రక్షణ లేకుండా పోయింది. పంచా యతీలు ఏర్పడి ఇన్నేళ్లు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో భవనాలు ఎప్పుడు నిర్మిస్తారంటూ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

- కీలక గ్రామాల్లో..

పాలనకు పట్టుగొమ్మలు గ్రామపంచాయతీలే. అ లాంటి కీలకమైన గ్రామాలకు జిల్లాలో పంచాయతీ కార్యాలయాలే కరువయ్యాయి. దశాబ్దాల కిందట ఏర్పడిన గ్రామాలదీ ఇదే పరిస్థితి. పలుచోట్ల భవ నాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని పాఠ శాలలు, ఇతర భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీం తో పల్లె పాలనకు ఆటంకాలు తలెత్తుతున్నాయి. కొత్త పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా అవే సమస్యలంటూ ఆవేదన చెందుతున్నారు. పాఠ శాలలు, ఇతర భవనాల్లో కార్యాలయాలు కొనసా గడం కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. కొన్నిచోట్ల భవనాలు పూర్తయినా బిల్లులు రాని కార ణంగా వాటిని ఉపయోగించలేని దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి పంచాయతీలకు పూర్తి స్థాయిలో భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 10:56 PM