Share News

kumaram bheem asifabad- నిధులేవి..

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:13 PM

నిధులు విడుదల కాక జిల్లాలోని ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూ నిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు ఏటా నిర్వహణ కోసం హెచ్‌డీఎఫ్‌(హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) ప్రభుత్వం విడుదల చేస్తుంది

kumaram bheem asifabad- నిధులేవి..
లోగో

- పీహెచ్‌సీల నిర్వహణకు వైద్యాధికారుల తంటాలు

- చిన్నపాటి మరమ్మతులకు సైతం అవస్థలు

బెజ్జూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నిధులు విడుదల కాక జిల్లాలోని ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూ నిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు ఏటా నిర్వహణ కోసం హెచ్‌డీఎఫ్‌(హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇందులో కేంద్రం వాటా 40శాతం ఉంటుంది, రాష్ట్రం వాటా 40శాతం ఉంటుంది. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదికి రూ.లక్షా 75వేలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లకు రూ.2లక్షల 50వేలు, ఏరియా ఆస్పత్రికి రూ.2లక్షల 50వేలు, జిల్లా ఆస్పత్రికి రూ.2లక్షల 50వేలు నిధులు విడుదల వుతాయి. ఈ నిధుల నుంచే ఆస్పత్రుల్లో పారిశుధ్య కార్యక్రమాలు, ఫర్నిచర్‌, ఆఫీస్‌ వర్క్‌, ఇతర మరమ్మతులు, చీపుర్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. కానీ గత మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ భారం సంబంధిత మెడికల్‌ అధికారులపై పడుతోంది. అత్యవసర అవసరాలకు వైద్యాధికారులు సొంత డబ్బులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2023-24లో నిధులు విడుదయ్యాయి. కాగా ఇప్పటికీ 2024-25, 2025-26,, 2026-27కు సంబంధించిన మూడేళ్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ఆరోగ్య ఉపకేంద్రా లకు సైతం ప్రతి ఏడాది రూ.50వేలు విడుదలవుతాయి. జిలా ్లలో 109ఆరోగ్య ఉపకేంద్రాలుండగా, కొన్నింటిని ఆయుష్మాన్‌ మందిరాలుగా మార్చారు. వీటికి సంబంధించి గత ఏడాది బడ్జెట్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్‌ రాగా ఇంకా నిధులు విడుదల కావాల్సి ఉంది.

- జిల్లా వ్యాప్తంగా ఇలా..

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు 15ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్‌ సెంటర్లు, ఐదు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. నిత్యం వేలాది మంది వైద్య సేవల కోసం ఈ కేంద్రా లకు వస్తుంటారు. కానీ ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు లేక పోవడంతో రోగులతో పాటు వైద్యసేవలు అందించే సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతు న్నారు. గత మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో వీటి నిర్వహణ భారం అంతా సంబంధిత వైద్యాధికారులే చూసుకో వల్సిన పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి నిర్వహణకు నిధులు విడుదల కాకపోవడంతో అక్కడ కూడా కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతు న్నారు. ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌డీసీ నిధుల ద్వారా ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తారు. విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యం, చిన్న చిన్న మరమ్మత్తులకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. మూడేళ్లుగా నిధులు విడుదల చేయని కారణంగా సమస్యలు పేరుకపోతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ప్రతి నెలా రూ.5వేల నుం చి రూ.10వేల వరకు నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోందని వైద్యాధికారులు వాపోతున్నారు.

- ఏడాదిన్నరగా..

గత ఏడాదిన్నరగా మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కాల ేదు. గతంలో కమిటీలు ఉన్నప్పటికీ నిధులు విడుదల కాకపో వడంతో పీహెచ్‌సీల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆయా మండలాల పరిదిలో గ్రామాల నుంచి ప్రతిరోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వందల మంది రోగులు వస్తుంటారు. గర్బిణీలతో మొదలుకొని వృద్దులు, చిన్నారులు, ఇతరులు వైద్య పరీక్షల కోసం వస్తారు. కానీ ఆరోగ్య కేంద్రాల్లో వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఆస్పత్రులకు నిధులు విడుదల చేయని కారణంగా డాక్టర్లకు నిర్వహణ ఖర్చులు తప్పడం లేదు. దీంతో వాటి నిర్వహణ భారంగా మారుతోందని వైద్యాధికారులు వాపోతున్నారు.

నిధులు రావాల్సి ఉంది..

- డాక్టర్‌ నాగేంద్ర సిడాం, జిల్లా వైద్యాధికారి, ఆసిఫాబాద్‌

ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. పాథమిక, పట్టణ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు మూడేళ్లుగా నిధులు విడుదల కావడం లేదు. ప్రతి నెలా వీటి నిర్వహణకు వేలల్లో ఖర్చు అవుతుంది. సంబంధిత వైద్యాధికారులే అవసరాలకు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. వీటి నిర్వహణ భారం వారిపై పడుతుంది. ఆస్పత్రి అభివృద్ధి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.

Updated Date - Aug 10 , 2026 | 11:13 PM