Share News

రహదారి విస్తరణకు మోక్షమెప్పుడో...?

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:15 PM

మంచిర్యాల- మందమర్రి జాతీయ రహదారి దశాబ్దాలు గడుస్తున్నా విస్తరణకు నోచుకోకపోవడంతో వాహన చోధకులకు ఇబ్బం దులు తప్పడం లేదు.

రహదారి విస్తరణకు మోక్షమెప్పుడో...?

-ప్రమాదరకంగా మంచిర్యాల-మందమర్రి హైవే

-సింగిల్‌ రోడ్డుతో పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య

-దశాబ్దాలుగా అభివృద్దికి నోచుకోని జాతీయ రహదారి

-ప్రకటనలకే పరిమితం అవుతున్న నాయకుల హామీలు

మంచిర్యాల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల- మందమర్రి జాతీయ రహదారి దశాబ్దాలు గడుస్తున్నా విస్తరణకు నోచుకోకపోవడంతో వాహన చోధకులకు ఇబ్బం దులు తప్పడం లేదు. రహదారిని నాలుగు వరుసలుగా వి స్తరిస్తామని రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవే రకపోవడంతో సింగిల్‌ రోడ్డుపై అష్టకష్టాలు పడుతున్నా రు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం నుంచి శ్రీనివా స గార్డెన్‌ ఫంక్షన్‌ హాలు వరకు దాదాపు రెండు కిలో మీ టర్ల మేర పొడవు సింగిల్‌ రోడ్డు ఉన్న కారణంగా తరు చుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రోడ్డుపై ఇప్పటి వ టరకు సుమారు పది మంది వరకు వాహన చోధకులు ప్ర మాదాల భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించి, మధ్యలో డివైడర్‌ నిర్మిం చాల్సి ఉంది. అయినా రహదారిని విస్తరించడంలో నేషనల్‌ హై వే ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు మీనమేషాలు లెక్కిస్తుండటం ప్రజలకు శాపంగా మారింది.

ఇరువైపులా పూర్తయిన విస్తరణ పనులు...

జిల్లా కేంధ్రం నుంచి క్యాతనపల్లి వద్ద ఉన్న చంద్రా పూర్‌-మంచిర్యాల జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టవలసి ఉండగా, గతంలో కొంతభాగం వి స్తరించారు. మధ్యలో కేవలం రెండు కిలోమీటర్ల మేర వి స్తరణకు మోక్షం కలగడం లేదు. చెన్నూరు నియోజక వ ర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్‌ ఫంక్షన్‌ హాలు సమీపం నుంచి బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వరకు రూ. 22 కోట్ల అంచనా వ్య యంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు 2023 సెప్టెంబరు 17న నాటి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ భూమి పూజ చేయగా, ఆ మేరకు రహదారి వి స్తరణ పనులు పూర్తయ్యాయి. అదే సమయంలో జిల్లా కేంధ్రంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్‌ ఫంక్షన్‌ హాలు వరకు జాతీయ రహదారిని ఆనుకొనేలా చేపట్టవ లసిన పనులు పెండింగులో ఉన్నాయి. ఆ తరువాత మం చిర్యాల ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఎన్నికైన తరువాత ఐబీ చౌరస్తా నుంచి స్థానిక డీసీపీ కార్యాలయం సమీపంలోని ఏసీసీ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అక్కడి నుంచి శ్రీనివాస గా ర్డెన్‌ వరకు రోడ్డును విస్తరించాల్సి ఉండగా, దాదాపు రెండు సంవత్సరాలుగా పనులు ముందుకు కదలడం లేదు.

నగరం విస్తరించడంతో పెరిగిన కష్టాలు....

రెండు సంవత్సరాల కాలంలో నగరం అతివేగంగా విస్త రించడంతో రోడ్లపై జన సంచారం కూడా విపరీతంగా పె రిగింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. ఇందులో భాగంగా ఏసీసీ నుంచి మొ దలుకొని శ్రీనివాస గార్డెన్‌ వరకు అనేక నివాసగృహాలు వె లిశాయి. విద్య, వైద్యం, తదితర ముఖ్య పనులతోపాటు ప్రతి చిన్న చిన్న అవసరాలకు కూడా ప్రజలు ప్రధాన సెం టర్లయిన మార్కెట్‌ ఏరియా, ఐబీ చౌరస్తా, బస్టాండ్‌ ఏరి యాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాతోపాటు తాండూరు, బెల్లంపల్ల, మంద మర్రి ప్రజలు సైతం నిత్యం నగరానికి వివిధ పనుల నిమి త్తం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో మంచిర్యాల- మం దమర్రి మధ్య వాహనాల రాకపోకలతో రహదారిపై విప రీతమైన రద్దీ ఉంటుంది. ముఖ్యంగా విద్యా సంస్థలు, వివి ధ కార్యాలయాలకు వెళ్లే సమయంలో, అలాగే వాటి ము గింపు సమయం తరువాత ఈ రహదారిపై విపరీత మైన రద్దీ నెలకొంటుంది. వాటితోపాటు డీసీపీ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపైకి గ్రీన్‌సిటీ వాసులు, క్వారీ రోడ్డు, ఆర్‌ఆర్‌నగర్‌, బీ జోన్‌ ప్రజల రాకపోకలు పెరగడంతో రహదారి ఎప్పుడు చూసిన వాహనాలతో బీజీగా ఉం టుంది. రోడ్డు చిన్నదిగా ఉండటం వాహనాల రద్దీ ఉండటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఆ రహదారి గుండా ప్రయాణించాలంటేనే వాహన చోధకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. డివైడర్‌ లేకుండా ఒకే వరుసలో రోడ్డు ఉండటం వల్ల ఎదురెదుగా వస్తున్న వాహనాల కారణంగా ద్విచక్ర వాహన చోధకులు కిందకు దించే పరిస్థితి కూడా ఉండటంలేదు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో వాహనా లను కిందికి దించలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఇదిలా ఉండగా లక్ష్మీటాకీస్‌ చౌరస్తా నుంచి ఏసీసీ సెంటర్‌ వరకు యూటర్న్‌ తీసుకునేందుకు ఐదు చోట్ల డివైడర్‌ మధ్య సందులు వదిలారు. ఆ సందుల్లో నుంచి వచ్చే వాహనాలు కానరాకపోవడం కూడా ప్రమాదాలకు కారణం అవుతోంది. బెల్లంపల్లి చౌరస్తా నుంచి లక్ష్మీటాకీస్‌ సెంటర్‌ వరకు ఒక్క యూటర్స్‌ కూడా లేకపోగా, అవతల మాత్రం అవసరం లేకపోయినా ఐదు చోట్ల దగ్గర దగ్గరగా సంధులు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. హైటెక్‌ సిటీ, డీసీ పీ కార్యాలయం వద్ద రెండు యూటర్న్‌లు ఉంటే సరిపో తుందన్న అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అలా గే లక్ష్మీ టాకీస్‌ చౌరస్తా నుంచి రహదారిని ఆనుకొనేలా అంతర్గత రోడ్లు ఉన్న చోట్లా వైట్‌ లైనింగ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే వాహనాల వేగం అదుపులో ఉండి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా రహదారిని నాలుగు వరుస లుగా విస్తరించడంతో పాటు మధ్య డివైడర్లు ఏర్పాటు చేయాలని పలువురు వాహన చోధకులు కోరుతున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 10:15 PM