పీఆర్‌పీ అమలయ్యేది ఎప్పుడు...?
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:06 PM
సింగ రేణి సంస్థ నిర్వహణలో అన్నీ తామై వ్యవహరిస్తున్న అధికారులు... యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్ర నిరాశ నిస్పృలకు లోనవుతున్నారు.
-మూడేళ్లుగా చెల్లించని సింగరేణి సంస్థ
-యాజమాన్య వైఖరితో అఽధికారుల పోరుబాట
-సమస్య పరిష్కరిస్తామన్న హామీ మరిచిన ప్రభుత్వం
-ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు
మంచిర్యాల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సింగ రేణి సంస్థ నిర్వహణలో అన్నీ తామై వ్యవహరిస్తున్న అధికారులు... యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్ర నిరాశ నిస్పృలకు లోనవుతున్నారు. సంస్థ నిర్వ హణ పూర్తిగా వారి చేతుల్లోనే ఉన్నప్పటికీ, వారికి అందాల్సిన ఫెర్‌ఫార్మెన్స్‌డ్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) చె ల్లించడంలో మాత్రం సింగరేణి యాజమాన్యం మీన మేషాలు లెక్కిస్తోంది. అధికారులకు మూడున్నరేళ్లుగా పీఆర్పీ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ యాజ మాన్యం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. సింగరేణి సంస్థలో సుమారు 2200 మంది అధికారులు పనిచేస్తున్నారు. వారందరికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో పీఆర్పీని వ్యక్తిగత ప్రతిభ ఆధా రంగా లెక్కించి చెల్లించాల్సి ఉంది. అయితే 2022-23, 2023-24, 2024-25లలో చెల్లించాల్సిన పీఆర్పీ ఇం తవ రకు అందలేదు. మొదటి రెండేళ్ల బకాయిలే సుమారు రూ. 277 కోట్లు ఉండగా, మరో ఏడాదిన్నర లెక్కిం చాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
హామీలకే పరిమితం....
వివిధ రాష్ర్టాల్లో వేర్వేరు ప్రాజెక్టులు చేపడుతూ సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపాంతరం చెందింది. కంపెనీ నిర్వహణలో భాగస్వాములైన అధికారులకు పెండింగులో ఉన్న పీఆర్పీని 15 రోజుల్లో మొత్తం చె ల్లిస్తామని 2025 ఆగస్టు 31వ తేదీన సంస్థ అప్పటి సీఎండీ బలరాం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరి గిన రక్షణ అవార్డుల ప్రధానోత్సవంలో హామీ ఇచ్చారు. కానీ ఏడాది గడిచినప్పటికీ పీఆర్పీ చెల్లింపుల ప్రక్రియ ముందుకు కదలలేదు. కంపెనీ నిర్వహణ బాధ్యతలు అన్నీ తామై నిర్వహిస్తుండటంతో తమ సమస్య పరి ష్కారం కోసం యాజమాన్యాన్ని నిలదీయలేని పరిస్థి తులు నెలకొన్నాయి. కంపెనీ బాధ్యతలు మోసే అధి కారులే భీష్మించుకుని కూర్చుంటే కార్మికుల్లో వ్యతిరేక ఆలోచనలు వస్తాయన్న భావనతో మూడేళ్లపాటు స హనం పాటిస్తూ వస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మొన్నటి జూన్ మాసంలో ఆందోళనబాట పట్టారు. ఇందులో భాగంగా దశలవారీ కార్యాచరణ రూపొందించారు. మొదటి దశలో భాగంగా కార్మిక వాడల నుంచి ర్యాలీలు నిర్వహించి ఏరియాల జనరల్ మేనేజర్లకు వినతిపత్రాలు అందజేయగా, మలిదశలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో జూన్ 13న మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సిం గరేణి డిపెండెంట్ల నియామకపత్రాల పంపిణీ కార్యక్ర మానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క దృష్టికి సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ పతిగౌడ్ తమ సమస్యను తీసుకెళ్లారు. దీంతో సమస్య ను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటి వరకు తమ సమస్యలపై ప్రభు త్వం ఎటూ తేల్చకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ సమస్యలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ప్రత్యక్ష నిరసనలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగం గా ప్లేడేలు బాయికాట్ చేయడం, వర్క్ టూ రూల్ పాటించడం వంటి చర్యలకు పూనుకునేందుకు సిద్ధప డుతున్నారు. అయితే పీఆర్పీ బకాయిలు వందల కోట్లు ఉండటంతో ప్రభుత్వం కూడా ఎటూ తేల్చుకోని స్థితిలో ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమతుతున్నాయి. ఇదిలా ఉండగా అధికారులు పలు డిమాండ్‌లను యాజమా న్యం ముందు ఉంచుతున్నారు. మూడేళ్ల పీఆర్‌పీ చెల్లించడంతో పాటు పదోన్నతి పాలసీ రూపొందించి తక్షణమే అమలు చేయాలి, పార దర్శకంగా పదోన్నతి, బదిలీలు చేపట్టాలి, సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండవద్దు, సంస్థకు రావాల్సిన రూ. 56 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి, అధికారుల క్వార్ట ర్లకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉచిత కరెంటుపై హామీ ఇవ్వాలి, అధికారుల పిల్లలు ఐఐటీ వంటి కోర్సుల్లో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింప జేయాలనే డిమాండ్లు ఉన్నాయి.