Share News

ఎస్టీపీపీలో కొత్త యూనిట్‌కు మోక్షమెప్పుడో...!

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:19 PM

జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మల్‌ ప వర్‌ ప్లాంట్‌ (ఎస్టీపీపీ)లో కొత్త యూనిట్‌ శంకుస్థానకు మోక్షం కలగడం లేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ పూర్తయి, కాంట్రాక్ట్‌ర్‌తో ఒప్పందం కుదిరినా పనులు ప్రారంభిం చేందుకు ముహూర్తం కలిసిరావడం లేదు.

ఎస్టీపీపీలో కొత్త యూనిట్‌కు మోక్షమెప్పుడో...!

-శంకుస్థాపనకు కలిసిరాని ముహూర్తం

-రూ.6,700 కోట్లతో బీహెచ్‌ఈఎల్‌తో పూర్తయిన ఒప్పందం

-40 నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ

-అయినా ముందుకు సాగని పనులు

మంచిర్యాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మల్‌ ప వర్‌ ప్లాంట్‌ (ఎస్టీపీపీ)లో కొత్త యూనిట్‌ శంకుస్థానకు మోక్షం కలగడం లేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ పూర్తయి, కాంట్రాక్ట్‌ర్‌తో ఒప్పందం కుదిరినా పనులు ప్రారంభిం చేందుకు ముహూర్తం కలిసిరావడం లేదు. బొగ్గు ఉత్ప త్తికే పరిమితమైన సింగరేణి సంస్థ తొలిసారిగా 2016 జనవరిలో విధ్యుత్‌ తయారీని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్టీపీపీలో విద్యుత్‌ ఉత్పత్తికి అంకు రార్పణ జరుగగా, తొలుత 600 మెగావాట్ల విద్యుత్‌ ఉ త్పత్తిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. అనతికా లంలోనే మరో 600 యూనిట్లను విస్తరించి మొత్తం 1200 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధిస్తోంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న విధ్యుత్‌ నుంచి తన సొంత అవసరా లకు పోను మిగిలిన విధ్యుత్‌ను జెన్‌కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది.

రూ. 6,700 కోట్లతో మూడో యూనిట్‌కు సన్నాహాలు...

ఎస్టీపీపీలో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కోసం ప్రధాన వనరులైన బొగ్గు, నీరు అందుబాటులో ఉండటంతో అంచెలంచెలుగా ప్లాంట్‌ను విస్తరించేందుకు సింగరేణి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. 2015 సంత్సరాంతంలో విధ్యుత్‌ ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో 2011 లో కాంట్రాక్టు పూర్తికాగా, 2012 సంవత్సరంలో పను లు పట్టాలెక్కాయి. తొలుత రూ.7573 కోట్ల అంచనా వ్య యంతో (రెండు యూనిట్లు) 1200 మెగావాట్ల విద్యు త్‌ ప్లాంట్‌ పనులు పూర్తి చేయగా మరో రూ.6,700 కో ట్ల అంచనా వ్యయంతో మూడో యూనిట్‌లో భాగంగా 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ ర్పాటు చేసే లక్ష్యం పెట్టుకుంది. 2015లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారం భం కావడంతో అప్పట్లో ప్రధానమంత్రి నరేంధ్రమోదీ తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ప్లాం ట్‌ను జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి నిరంత రాయంగా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ మూడో యూనిట్‌ పనులు ప్రారంభించేందుకు మాత్రం ము హూర్తం కలిసి రావడం లేదు.

ఇప్పటికే పూర్తయిన టెండర్‌ ప్రక్రియ...

ఎస్టీపీపీలో మూడో యూనిట్‌ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తికాగా, పనులు ప్రారంభిం చడమే మిగిలి ఉంది. ఈ మేరకు యాజమాన్యం హై ద్రాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ సంస్థతో 2024 ఫిబ్రవరిలో ఒప్పందం కూడా చేసుకుంది. అగ్రిమెంట్‌ పూర్తయిన నాటి నుంచి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉం ది. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోగా, కాంట్రా క్టర్‌తో అగ్రిమెంట్‌ మరో రెండేళ్లలో ముగియనుంది. అ యినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో మూ డో యూనిట్‌ విస్తరణపై సందేహాలు నెలకొన్నాయి.

శంకుస్థాపనలో తీవ్ర జాప్యం...

ఎస్టీపీపీలో ఏర్పాటు చేయదలిచిన మూడో యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి వి క్రమార్క 2024 మార్చి 12న హైద్రాబాద్‌లో భట్టి ప్రక టించారు కూడా. డిప్యూటీ సీఎం ప్రకటించి కూడా రెం డేళ్లు గడిచినందున జాప్యంపై తీవ్రంగా చర్చ జరుగు తోంది. స్థానికంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణం గానే ప్లాంట్‌ శంకుస్థాపనలో జాప్యం జరుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఒక దశలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ప్లాంట్‌ను ప్రారంభిస్తారన్న ప్రచారమూ జరిగింది. అయినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంతో ఎస్టీపీపీ మూడో యూనిట్‌ శంకుస్థాపనకు రాజకీయ గ్రహణం పట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎస్టీపీపీలో కొత్త యూనిట్‌ను విస్తరిస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగనున్నాయి. మూడో యూనిట్‌కు అవసరమైన దాదాపు 1200 మందికి కొత్త ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Nov 13 , 2026 | 11:19 PM