Share News

kumaram bheem asifabad- కొత్త పింఛన్లు ఎప్పుడో..?

ABN , Publish Date - Apr 17 , 2026 | 10:33 PM

కొత్త గా పింఛన్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వం నుంచి మంజూరుకు వేచి చూస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ్యాప్యంతో ఉన్నవారితో పాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలు, వితం తువుల నెలనెలా సాయం అందజేస్తోంది. ఇవి వారి కెంతో అవసరానికి ఉపయోగపడుతున్నాయి. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం పించన్లను మంజూరు చేసిఅర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 2016 అందజేస్తుంది. 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధులలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పించన్లను రూ. 4వేలకు, 6వేలకు పెంచుతామని ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పింఛన్ల పెంపు అటుంచితే.. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు

kumaram bheem asifabad- కొత్త పింఛన్లు ఎప్పుడో..?
లోగో

- జిల్లాలో 4,031 మంది దరఖాస్తులు

- కార్యాలయాలు, అధికారుల చుట్టూ అర్హుల ప్రదక్షిణలు

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కొత్త గా పింఛన్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వం నుంచి మంజూరుకు వేచి చూస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ్యాప్యంతో ఉన్నవారితో పాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలు, వితం తువుల నెలనెలా సాయం అందజేస్తోంది. ఇవి వారి కెంతో అవసరానికి ఉపయోగపడుతున్నాయి. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం పించన్లను మంజూరు చేసిఅర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 2016 అందజేస్తుంది. 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధులలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పించన్లను రూ. 4వేలకు, 6వేలకు పెంచుతామని ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పింఛన్ల పెంపు అటుంచితే.. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు. దీంతో అర్హులైన వారు కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఇటీవల అసెంబ్లీ సమావేశా ల్లో రాష్ట్రంలో 2 లక్షల నూతన పింఛన్లను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

- జిల్లాలో ఇలా..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 52,635 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి ప్రతీ నెలా బట్వాడా జరుగుతోంది. జిల్లా పరిధిలోఇప్పటి వరకు మొత్తం 4,031 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఇందులో ఒంటరి మహిళలు 248, దివ్యాంగులు 654, వృదుఽ్ధలు, 982, వితంతువులు 2,147 ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను రూ. 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అర్హులైన వారు పించన్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని మం డల కార్యాలయాలు, అధికారుల చుట్టూ అర్హులైన వారు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనూ వినతులు అందజేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించేవారు లేక పోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రస్తుతం ఒక కుటుంబంలో భర్తకు పింఛన్‌ వస్తుండగా ఆయన మృతి చెందితే వెంటనే దరఖాస్తు చేసుకుంటే భార్య పేరిట పింఛన్‌ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కొత్తగా ఎవ్వరికీ పింఛన్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. భర్తలు చనిపోయినవారు, ఒంటరి మహిళలు, వృద్దులు ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు. అయితే దీనికి సంబంధించిన పోర్టల్‌ అందుబాటులో ఉండకపోవడంతో మరికొంత మంది దరఖాస్తులు చేసుకోవడానికి వీలులేకుండా ఉంది. 2022 ఆగస్టు నుంచి ఈ పోర్టల్‌ అందుబాటులో లేదు. కాగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన విధంగా త్వరలోనే పింఛన్లు అందజేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలు విడుదల చేసి అర్హులైన వారికి పింఛ న్లు అందజేయాలని అబ్ధిదారులు కోరుతున్నారు. అధి కారులు సైతం ఈ విషయంలో జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 10:33 PM