Share News

కొత్త పింఛన్లకు మోక్షమెప్పుడు...?

ABN , Publish Date - May 13 , 2026 | 11:39 PM

రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరుకు మోక్షం కలగడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి రెండున్న రేళ్లు గడిచినా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. చేయూత పథకం కింద పింఛన్లను పెం చబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.

కొత్త పింఛన్లకు మోక్షమెప్పుడు...?

-రెండున్నరేళ్లు గడిచినా ముందుకు కదలని ప్రక్రియ

-జిల్లాలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

-ఓఏపీ మినహా ఇతర పింఛన్లకు కలగని మోక్షం

-ప్రభుత్వ కనికరం కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు

మంచిర్యాల, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరుకు మోక్షం కలగడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి రెండున్న రేళ్లు గడిచినా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. చేయూత పథకం కింద పింఛన్లను పెం చబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. 2024 జూలైలో గ్రామీణ పేదరిక నిర్మూలన సం స్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి ని ర్వహించిన సమీక్షలో పై విధంగా ప్రకటన చే శారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల జారీకి అ ర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. అం తా సవ్యంగా సాగితే అదే సంవత్సరం ఆగస్టు 1 నుంచే కొత్త పింఛన్లు అందుతాయనే ప్రచారం జరగడంతో దరఖాస్తుదారులు ఆశపడ్డారు. అ యితే నేటి వరకు ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.

ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వివిధ రకాల పథకాల కోసం స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగానే పింఛన్‌ దారుల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఆయా దరఖాస్తులతోపాటు బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్న పింఛన్ల లిస్టును కూడా పరిగణలోనికి తీసుకు న్న అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశా రు. ప్రస్తుతం చేనేత, పైలేరియా రోగులు, వృ ద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, విక లాంగులు, ఎయిడ్స్‌ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తు న్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథ కం కింద రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016 ఇవ్వగా, కాంగ్రెస్‌ హయాంలో చేయూత పథకం ద్వారా వాటిని రూ. 4 వేలకు పెంచుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

దరఖాస్తుల పరిశీలన పూర్తయినా....

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెం టీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన పేద ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే ప్రజా పాలన కార్యక్ర మం ఏర్పాటు చేసి దరఖాస్తులు ఆహ్వానించిం ది. చేయూత పథకం అమలుకు ప్రభుత్వం స న్నాహాలు చేస్తుండటంతో ఆయా విభాగాలకు చెందిన దరఖాస్తుల పరిశీలనను కూడా అధికా రులు పూర్తి చేశారు. జాబితాను కంప్యూటరైజ్‌ చేసిన అనంతరం అర్హుల తుది జాబితాను ప్ర భుత్వానికి అందజేశారు. కాగా కాంగ్రెస్‌ ప్రభు త్వం ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉ చిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు సౌక ర్యం, రూ. 500 వంట గ్యాస్‌ సబ్సిడీ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయి.

లక్షల్లో దరఖాస్తులు...

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భా గంగా వివిధ పథకాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు అందగా, అర్హత గల వాటిని అధికారులు ఆమోదించారు. కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అంగవైకల్యం కింద మొత్తం 6,591 దరఖాస్తులను అధికారు లు ఆమోదించారు. అలాగే ఇతర విభాగాలకు చెందిన పింఛన్ల కోసం 50వేల 467 దరఖాస్తు లు అర్హత సాధించాయి. అంగవైకల్యం కింద జిల్లాలోని అర్హులకు పింఛన్లు అందజేసేందుకు నెలకు రూ. 3 కోట్ల 95 లక్షల 46 వేలు అవస రం కాగా ఇతర విభాగాల వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు నెలకు రూ. రూ 20 కోట్ల 18 లక్షల 68 వేలు అవసరం అవుతాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం లబ్దిదారులకు అందజే యాల్సి ఉండగా, కేవలం ఓల్డ్‌ ఏజ్‌ పింఛన్లు మాత్రం అమలుకు నోచుకున్నాయి. జిల్లా వ్యా ప్తంగా కొత్తగా భర్త చనిపోయిన స్త్రీలు 2891 మందికి పింఛన్లు సక్రమంగా అందుతున్నాయి. ఇదిలా ఉండగా గృహిణులకు రూ. 2500 పథ కం కింద 210614 దరఖాస్తులు రాగా పథకం అమలుకు నోచుకోలేదు. అలాగే కౌలు రైతులకు రూ. 12000 పథకం కింద 106365, ఉద్యమకా రులకు 323 చదరపు గజాల ఇంటి స్థలం పథ కం కింద 2534 దరఖాస్తులు వచ్చాయి. వాటికి ఏడాదిన్నర గడిచినా మోక్షం లభించడంలేదు.

Updated Date - May 13 , 2026 | 11:39 PM