Share News

భూముల లెక్క తేలేదెప్పుడు...?

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:48 PM

మంచిర్యాల జిల్లా కేంధ్రంలోని అత్యంత ఖరీదైన స్థలం కబ్జా విషయమై అధికా రులు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. కబ్జాకు గురైందని ప్రచారంలో ఉన్న ప్రభుత్వ స్థలం అసలు కబ్జాకు గురైందో...లేదో తేల్చడానికి తటపటాయిస్తున్నారు.

భూముల లెక్క తేలేదెప్పుడు...?

-సర్వేలతోనే సరిపెట్టిన అధికారులు

-కబ్జా విషయం తేల్చడంలో నాన్చుడు ధోరణి

-వివాదాస్పద స్థలంలో వెలుస్తున్న భవనాలు

-కోర్టులో ఆలస్యంగా కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు

మంచిర్యాల, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంధ్రంలోని అత్యంత ఖరీదైన స్థలం కబ్జా విషయమై అధికా రులు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. కబ్జాకు గురైందని ప్రచారంలో ఉన్న ప్రభుత్వ స్థలం అసలు కబ్జాకు గురైందో...లేదో తేల్చడానికి తటపటాయిస్తున్నారు. సంవత్స రాల తరబడి సర్వేల పేరుతో కాలయాపన చేస్తుండటంతో అధికారుల తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే విషయమై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన సదరు స్థలంలో సర్వే జరపాలని హైద్రాబాద్‌లోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి లేఖ రాశారు. దీంతో హైద్రాబాద్‌ బృందం రెండేళ్ల క్రితం ఒకసారి, గత ఏడాది మరోసారి సర్వే జరిపారు.

నాన్చుడు ధోరణితోనే...!

హైద్రాబాద్‌లోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి నేతృత్వంలో అధికారులు గతేడాది జిల్లా కేంధ్రంలోని ఆర్టీసీ డిపో వెనకాల ఉన్న సర్వే నెంబ ర్లు మంచిర్యాల శివారులోని 422, గర్మిళ్ల శివారులోని 92,93 గల 13.38 ఎకరాల పై చిలుకు ప్రభుత్వ భూమిలో సర్వే జరిపారు. గత కొంతకాలంగా ఈ స్థలం విషయమై తీవ్ర వివాదం నెలకొంది. అది ప్రభుత్వ భూమి కాగా, కొందరు అక్రమంగా కబ్జా చేశారని చాలా కాలంగా ప్రచారం జరు గుతోంది. ఈ విషయమై ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ, స్థానిక ల్యాండ్‌ సర్వే అధికారులు పలుమార్లు సర్వేలు జరి పినప్పటికీ అది పట్టా భూమో, ప్రభుత్వ స్థలమో నిర్దారిం చకపోవడంతో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.

కలెక్టర్‌కు ఫిర్యాదుతో....

మంచిర్యాల శివారు సర్వే నెంబరు 422లో ప్రభుత్వ భూ ములు పెద్ద మొత్తంలో కబ్జాలకు గురవుతున్నాయని, వా టిని కాపాడాలని పట్టణానికి చెందిన తులా మధుసూ ధన్‌రావు అనే వ్యక్తి పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశా రు. మంచిర్యాల ఆర్డీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ము న్సిపల్‌ అధికారులు నిర్మాణ అనుమతులు ఇచ్చారని, ఆర్డీఓ నివేదికలో దొర్లిన సాంకేతిక లోపాలను గమనించనించకుండానే అనుమతులు మంజూరు చేశారని, కలెక్టర్‌ స్పందించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అప్పటి కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ నాయక్‌ హైద్రాబాద్‌లోని ల్యాండ్‌ సర్వే అధి కారులకు లేఖ రాశారు. ఇదే విషయమై జిల్లా కేంధ్రంలో భూకబ్జా్‌ శీర్షికన 2023 జూలై 18న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మార్చి 28న హైద్రాబాద్‌కు చెందిన అధికారుల బృందం స్థానిక రైల్వే స్టేషన్‌ నుంచి ఆర్టీసీ డి పో వరకు సర్వే నిర్వంచారు. భూమి సర్వే జరిపిన జాయిం ట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేది కను కలెక్టర్‌కు అందజేస్తామని అప్పట్లో మీడియా సమక్షంలో తెలిపారు.

యథేశ్ఛగా వెలుస్తున్న భవనాలు....

మరోవైపు వివాదాస్పద స్థలంలో రోజు రోజుకూ నిర్మా ణాలు ఊపందుకుంటున్నాయి. ఓ వైపు అఽధికారుల బృం దం సర్వే జరిపి, రిపోర్టు పెండింగులో ఉండగానే బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు జరుగుతుండటం గమనార్హం. హైదరాబాద్‌ బృందం సర్వే జరిపినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనం ప్రస్తుతం అన్ని హంగులు పూర్తి చే సుకుంది. దీంతోపాటు సమీపంలో మరికొన్ని నిర్మా ణాలు కూడా చేపడుతున్నారు. అసలు భూమి స్వ భావం తేలకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం పట్ల ప్రజలు విస్మయం చెందుతు న్నారు. ఇదిలా ఉండగా అధికారులు సర్వే జరపడంతో భూమి త మదని భావిస్తున్న పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భూమి తమదేనని, అధికారులు చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ పి టిషన్‌లో పేర్కొన్నారు. దీంతో అధికారులకు కోర్టు నోటీసు అందగా, గరిష్టంగా నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉండగా, మూడు సం వత్సరాల అనంతరం ఇటీవల అధికారుల నుంచి స్పందన లభించింది.

ఒకవేళ సదరు స్థలం ప్రభుత్వ భూమి అయితే అధికారులు కోర్టు నోటీసు వెలువడగానే ఎందుకు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడం లేదనే సందేహా లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్ల క్ష్యం కారణంగానే ఇంతకాలం జాప్యం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో చేపట్టిన పలు ని ర్మాణాలకు సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే కా వాలనే కౌంటర్‌ దాఖలు చేయడంలో జాప్యం చే సినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:48 PM