’’పోడు’’ పట్టాల జారీకి మోక్షమెప్పుడు...?
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:40 PM
పోడు రైతు లకు పట్టాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో కొంతమందికి పోడు ప ట్టాలిచ్చినప్పటికీ అది సంపూర్ణం కాకపోవడంతో అర్హు లైన గిరిజనులు, గిరిజనేతరులు తీవ్ర అసంతృప్తితో ఉ న్నారు.
-జిల్లాలో 11వేల పై చిలుకు దరఖాస్తులు
-తొలిదఫా 1847 మంది లబ్దిదారుల ఎంపిక
-గత ప్రభుత్వ హయాంలో కొందరికే పట్టాలు జారీ
-తమకూ ఇవ్వాలని దరఖాస్తుదారుల డిమాండ్
మంచిర్యాల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పోడు రైతు లకు పట్టాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో కొంతమందికి పోడు ప ట్టాలిచ్చినప్పటికీ అది సంపూర్ణం కాకపోవడంతో అర్హు లైన గిరిజనులు, గిరిజనేతరులు తీవ్ర అసంతృప్తితో ఉ న్నారు. దశాబ్ధాల తరబడి హక్కు పత్రాల కోసం ఆది వాసీలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వా రికి హక్కు పత్రాలు అందజేయడం ద్వారా శాశ్వత ప రిష్కారం లభించనుందని ఆశపడ్డ రైతులకు ఆశని పాతమే మిగిలింది. అర్హులైన గిరిజనులు, గిరిజనేతరు లకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు పంచాయతీ, రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారుల సమన్వయంతో ‘పోడు’ పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలను గత ప్రభుత్వ హయాంలో రూపొందించారు. ఈ విష యమై గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో అటవీ హ క్కుల కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్ర మాలు సైతం చేపట్టారు. గ్రామాల వారీగా క్షేత్రస్థాయి లో పరిశీలన జరిపిన అంనతరం అర్హులను గుర్తించి హక్కులు కల్పించనున్నట్లు మూడేళ్ల క్రితం అధికారు లు ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పటి వరకు పోడు పట్టాల అంశం మళ్లీ ప్రస్తావనకు రాలేదు.
ఆర్వోఎఫ్‌ఆర్ చట్టం ప్రాతిపదికన...
అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్) ప్రాతిపదికన అర్హులైన వారికి పోడు భూములకు హ క్కు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. 29 డి సెంబరు 2006 నుంచి ఆర్వోఎఫ్‌ఆర్ చట్టం అమల్లోకి రాగా 1930 నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరులు, 2005కు ముందు నుంచి సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే హక్కు పత్రాలు పొందే వెసులుబాటు ఉంది. పోడు సమస్యను పరిష్కరించి 2005 నాటికి సాగులో ఉన్నవారిని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో అధికా రులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని 14 మం డలాల్లోని 93 గ్రామాల్లో మొత్తం 33, 418. 19 ఎకరా ల పోడు భూములు ఉన్నాయి. వీటిలో గిరిజనులకు చెందినవి 13,587. 37 ఎకరాలు కాగా మిగతా 19,830. 22 ఎకరాల్లో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు. పోడు పట్టాల కోసం 2022 నవంబరు 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అదే నెల 20న ముగిసింది. గడువు ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,877 దరఖాస్తులు రాగా, దరఖాస్తు దారుల్లో 4460 మంది గిరిజనులు, 7427 మంది గిరిజనేతరులు ఉన్నారు.
తొలిదఫా 1847 మంది ఎంపిక...
పోడు పట్టాలు జారీ చేసేందుకు తొలి దఫాలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 1847 మందిని అర్హులుగా గుర్తించా రు. మొత్తం 11,877 మంది పోడు పట్టాలకు దరఖాస్తు చేసుకోగా, అర్హులైన ఆదివాసీ రైతులను మాత్రమే పరి గణలోకి తీసుకున్నారు. తొలి దఫాలో ఆయా మండ లాలకు చెందిన లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు మొత్తం 3821.06 ఎకరాల భూమిని కూడా గుర్తించగా 2023 జూన్ 30న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతు ల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రా రంభించారు. ఇదిలా ఉండగా పోడు పట్టాలు ఇచ్చేం దుకు దరఖాస్తుదారుల్లో అతి తక్కువ మందిని ఎంపిక చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. తొలి దఫా లో చెన్నూరు నియోజక వర్గంలో 602, బెల్లంపల్లి ని యోజకవర్గంలో 904 పైచిలుకు మంది, మంచిర్యాల నియోజక వర్గంలో 5, ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలో 311 మంది, సిర్పూర్ నియోజక వర్గంలో (జిల్లాలోని కన్నెపెల్లి, భీమిని మండలాల ప రిధిలో కొన్ని గ్రామపంచాయతీలు) 25 మందిని అర్హు లుగా గుర్తించి హక్కు పత్రాలు జారీ చేశారు. మిగతా అర్హులకు రెండో దఫాలో అందజేస్తామని ప్రకటించి నా...అది కార్యరూపం దాల్చలేదు.
ఎదురు చూస్తున్న గిరిజనేతరులు...?
అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనేతర కుటుం బాలకు గరిష్టంగా పదెకరాలకు పట్టాలు ఇవ్వనున్నట్లు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందు కోసం విది విధానాలు కూడా రూపొందించింది. గిరిజనే తరులు మూడు తరాలు (కనీసం 75 ఏళ్లు) సాగులో ఉంటేనే అటవీ హక్కు పత్రాలు జారీ చేస్తామని ప్రక టించింది. సదరు కుటుంబాలు 2005కు ముందు ఎన్ని ఎకరాలు సాగులో ఉన్నా...వారు ఇక మీదట పది ఎక రాలు మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధన వి ధించింది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వారి వద్ద మిగిలిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసు కోవాలని కూడా నిర్ణయించింది. అయితే అధికారులు ప్రకటించిన అర్హుల జాబితాలో గిరిజనేతరులు లేకపోవ డంతో అసలు తమకు పట్టాలు వస్తాయో...లేదోనన్న సందేహంలో ఉండిపోయారు. పోడు పట్టాలకు జిల్లా వ్యాప్తంగా 7427 మంది గిరిజనేతరులు దరఖాస్తు చే సుకున్నారు. పట్టాలు ఇచ్చేందుకు సర్వేలు కూడా జరిపి న ప్రభుత్వం ఆర్వోఎఫ్‌ఆర్ చట్టం కింద తమను పరిగ ణలోకి తీసుకోకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహ ల్లో మునిగిపోయారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయమై గిరిజనశాఖ మంత్రి సీతక్క సైతం ప లుమార్లు ప్రకటన చేశారు. అయితే రెండున్నరేళ్లు గడి చినా పోడు రైతులకు పట్టాల జారీకి మోక్షం కలగడం లేదు.