Share News

రెవెన్యూ అక్రమాలపై విచారణ ఎప్పుడు..?

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:41 PM

ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు జారీ అయిన విషయంలో ’రెవెన్యూ అధికారుల చేతివాటం’పై విచారణ ముందుకు సాగడం లేదు. పూర్తిస్థాయి వి చారణకు స్వయంగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి, సీసీఎల్‌ఏ తో పాటు కలెక్టర్‌, ఆర్డీవో ఆదేశించినప్పటికీ చలనం లేకపోవడం గమ నార్హం.

రెవెన్యూ అక్రమాలపై విచారణ ఎప్పుడు..?

-ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌

-దండేపల్లి భూములపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

-సంవత్సరం గడుస్తున్నా బాధ్యులపై చర్యలు శూన్యం

మంచిర్యాల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు జారీ అయిన విషయంలో ’రెవెన్యూ అధికారుల చేతివాటం’పై విచారణ ముందుకు సాగడం లేదు. పూర్తిస్థాయి వి చారణకు స్వయంగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి, సీసీఎల్‌ఏ తో పాటు కలెక్టర్‌, ఆర్డీవో ఆదేశించినప్పటికీ చలనం లేకపోవడం గమ నార్హం. ఏడాది క్రితం దండేపల్లి మండలం అందుగుల పేటలో వె లుగు చూసిన ఘటనపై ’ప్రభుత్వ భూములకు అక్రమ పట్టా లు’ శీర్షికన 2025 మార్చి 6న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురి తమైం ది. దీనిపై స్పందించిన కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పూర్తి విచారణ కోసం దండేపల్లి మండల తహసీల్దార్‌ను ఆదేశించారు. పోలీస్‌శాఖ ఇంటలిజెంట్‌ విభాగం కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేధికను ప్రభుత్వానికి అందజేసింది.

పుట్టుకొచ్చిన అక్రమ పట్టాలు....

అందుగులపేటలో సర్వే నెంబర్లు 9, 49లలోని ప్రభుత్వ భూ ముల పంపిణీ విషయమై అసైన్‌మెంట్‌ చట్టాన్ని తుంగలో తొక్కు తూ గ్రామానికి చెందిన కొందరి పేర్లపై అక్రమ పట్టాలు పుట్టుకొ చ్చాయి. అక్రమంగా రికార్డుల్లో నమోదు చేసిన మండల రెవెన్యూ అధికారులు వారి పేరిట పట్టాలు జారీ చేశారు. సర్వే నెంబర్‌ 9లో 28 ఎకరాలకు పట్టాలు పుట్టుకురాగా, సర్వే నెంబర్‌ 49లో మరో 27 ఎకరాలు ఇతరుల పేరిట పట్టాలుగా మారాయి. ప్రభుత్వ భూ ములను ఇతరుల పేరిట లావుణి పట్టాగా మార్చాలంటే అసైన్‌ మెంట్‌ కమిటీ ఆమోదం ఉండాలి. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అ సైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహరి స్తుండగా, కన్వీనర్‌గా ఆర్డీవో, సభ్యుడిగా తహసీల్దార్‌ ఉంటారు. వారి ఆమోదంతో ఎలాంటి జీవనాధారం లేని నిరుపేద వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్టీ, బీసీ కులస్థులకు నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను సాగు చేసుకునేందుకు అసైన్‌ చేసే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకోసం ముందుగా గ్రామంలో అర్హులుగా పే ర్కొంటూ తీర్మాణం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మాణం ఆధారంగా అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం కావాల్సి ఉంటుంది. అసైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో దరఖాస్తుదారుల అర్హతలను బట్టి భూములను అ సైన్‌ చేస్తారు. అయితే జిల్లాలో చివరిసారిగా 2012-13లో అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎక్కడా కూడా అసైన్‌మెంట్‌ కమిటీ సమా వేశాలు ఏర్పాటు చేయకపోగా, ప్రభుత్వ భూములకు లావుణి ప ట్టాలు జారీ చేసే ప్రక్రియ నిలిచిపోయింది. అయినప్పటికీ రెం డు, మూడు సంవత్సరాల వ్యవధిలో అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం అక్రమ పట్టాలు పుట్టుకు రావడం గమనార్హం.

ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌...

అందుగుల పేటలో ప్రభుత్వ భూములకు జారీ అయిన పట్టా లన్నీ మండల తహసీల్దార్‌ పేరిట కావడం విశేషం. పట్టాలు జారీ అయిన సమయంలో విధుల్లో ఉన్న తహసీల్దార్‌కు సంబంధం లే కుండానే లబ్దిదారులకు పంపిణీ అయినట్లు ప్రచారం జరుగు తోం ది. పట్టాల జారీ విషయంలో కిందిస్థాయి సిబ్బంది కొందరు పెద్ద మొత్తంలో ముడుపులు అందుకున్నట్లు కూడా ప్రభుత్వానికి నివే దిక అందింది. ఒక్కో పట్టా జారీకి రూ. 20వేల నుంచి రూ. 30 వే ల వరకు వసూలు చేసినట్లు ప్రభుత్వానికి అందిన నివేదికలో పే ర్కొనడం గమనార్హం. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆ దేశించింది. 2025 మే నెలలో అప్పటి ప్రభుత్వ అదనపు కార్యదర్శి సరియైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చే శారు. అనంతరం జూన్‌లో ఛీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కూడా ఇదే విషయమై విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించా రు. కలెక్టర్‌ సైతం జూలై 8న ఆర్డీవోకు విచారణకు ఆదేశించారు. దీన్ని పురస్కరించుకొని మంచిర్యాల ఆర్డీవో అదే నెల 11న దండే పల్లి తహసీల్దార్‌కు లేఖ రాస్తూ ఏడు రోజుల్లో నివేధిక అందజే యాలని, దీన్ని అత్యవసరంగా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే దాదాపు సంవత్సరం గడుస్తున్నా విచారణ ముం దుకు సాగకపోగా అక్రమ పట్టాలు జారీ కావడంలో బాధ్యులపై చర్యలు కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఏకంగా ప్రభుత్వ అ దనపు కార్యదర్శి, సీసీఎల్‌ఏ ఆదేశాలు కూడా దండేపల్లి మండ లంలో అమలు కాకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతు చిక్క డం లేదంటూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దృష్టికి రాలేదు...రోహిత్‌ దేశ్‌పాండే, దండేపల్లి తహసీల్దార్‌

మండలంలోని అందుగులపేటలో అక్రమంగా ప్రభుత్వ భూమి కి పట్టాలు జారీ అయిన విషయం ఇప్పటిదాకా నా దృష్టికి రా లేదు. నేను మండల తహసీల్దార్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి అధికారికంగా ఎవరికి భూ పంపిణీ జరగలేదు. అంతకు ముందు జరిగిన విషయంలో కూడా నాకు అవగాహన లేదు. ఈ విషయ మై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం ద్వారా ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 21 , 2026 | 11:41 PM