Share News

kumaram bheem asifabad- ‘చేయూత’ అందేదెప్పుడు?

ABN , Publish Date - Nov 01 , 2026 | 10:48 PM

జిల్లాలో కొత్త పింఛన్ల కోసం వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు.

kumaram bheem asifabad- ‘చేయూత’ అందేదెప్పుడు?
లోగో

- దసరా ముందు ఆశలు రేపిన సర్కార్‌

- నెరవేరని ఎన్నికల హామీ

- నిరాశలో దరఖాస్తుదారులు

బెజ్జూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త పింఛన్ల కోసం వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్ల మంజూరుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన మొదలైంది. జూన్‌ 2వతేదీ, ఆగస్టు 15వతేదీ, దసరా పండుగ ఇలా ఏ పండుగొచ్చినా కొత్త పింఛన్లు వస్తాయని ఆశగా ఎదురుచూడటం, ఆ తర్వాత నిరాశ చెందడం దరఖాస్తుదారులకు పరిపాటిగా మారింది.

- ఆగస్టు 9 నుంచి..

చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు ప్రభు త్వం దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లాలో 9,466మంది దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు 9,458దరఖాస్తులను ట్యాగ్‌ చేశారు. ఇందులో 8,313మందిని అర్హులుగా గుర్తించారు. 676మందిని అనర్హులుగా తేల్చారు. మరో 406దరఖాస్తులు హోల్డ్‌లో ఉంచారు. 63దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. అనర్హుల ఏరివేతకు అధికారులు అల్యాధునిక సాప్ట్‌వేర్‌ను వినియోగించి విచారణ జరిపారు. ఆగా జిల్లాలో మొత్తం 15మండలాల పరిదిలో 56,225మంది పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్‌దారులు 24,235, దివ్యాంగులు 5,974, వితంతువులు 22,095, బీడీ కార్మికులు 86, ఒంటరి మహిళలు 2,605, ఫైలేరియా బాధితులు 567, డయాలసిస్‌ బాధితులు 30, గీతా కార్మికులు 139మంది లబ్ధిపొందుతున్నారు. ఇంకా కొత్త పింఛన్ల కోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకొని చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. దర ఖాస్తులు చేసుకొని అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పింఛన్ల మంజూ రుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

- రెట్టింపు చేస్తామని..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు పింఛన్ల మొత్తాన్ని రూ.2వేల నుంచి 4వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఇతర పింఛన్లు కూడా పెంచుతామని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు పింఛన్లు అందుతాయని అర్హులు ఆశించారు. ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కానీ వాటి మంజూరును మాత్రం పట్టించుకోలేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నెలలు గడుస్తున్నా పింఛన్లు మంజూరు కాకపోవడంతో కుటుం బ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

= ప్రతి సందర్భంలోనూ..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వతేదీన కొత్త పింఛన్లు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 15న పక్కాగా అన్నారు. ప్రధానంగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీతా కార్మకులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురింపజేశాయి. జూన్‌ 2వ తేదీ పోయి, ఆగస్టు 15వ తేదీ గడిచినా పింఛన్లు మంజూరు కాలేదు. ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి , మండలాల వారీగా అర్హతలను పరిశీలించారు. దీంతో కనీసం దసరా పండుగ నాటికైనా పింఛన్లు అందుతాయని దరఖాస్తుదారులు భావించారు. కానీ అది కూడా నిరాశే మిగిల్చింది. దీపావళి పండుగకైనా ఇస్తారా ఇవ్వరోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా పండుగ వచ్చిన ప్రతీసారి కొత్త పింఛన్లు ఇస్తామంటూ ప్రభు త్వం ఊరిస్తూ రావడమే తప్ప ఇచ్చింది లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంకా పింఛన్లపై ఆశలు వదులుకోవ ల్సిందేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 10:48 PM