గ్రామ పంచాయతీలకు గ్రేడింగ్ ఎప్పుడు...?
ABN , Publish Date - Nov 26 , 2026 | 11:18 PM
రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడి ఎనిమిది సంవత్స రాలు గడిచినా ఇప్పటి వరకు గ్రేడింగ్ చేయకపోవడం వల్ల గ్రామాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు ఏర్ప డుతున్నాయి.
-ఎనిమిదేళ్లయినా ముందుకు కదలని ప్రక్రియ
-గ్రామాల్లో తలెత్తుతున్న పాలనాపరమైన ఇబ్బందులు
-కార్యదర్శుల పదోన్నతులపైనా తీవ్ర ప్రభావం
-ప్రభుత్వ వైఖరితో జీపీల్లో తెరపైకి కొత్త సమస్యలు
మంచిర్యాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడి ఎనిమిది సంవత్స రాలు గడిచినా ఇప్పటి వరకు గ్రేడింగ్ చేయకపోవడం వల్ల గ్రామాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు ఏర్ప డుతున్నాయి. తెలంగాణలో 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీల సంఖ్యను పెంచింది. అప్పట్లో సుమారు 8,903గా ఉన్న గ్రామ పంచాయతీలను విభ జించి, దాదాపు 12,769 జీపీలను ఏర్పాటు చేసింది. అ యితే గ్రామ పంచాయతీల సంఖ్యను పెంచిన ఆనాటి ప్రభుత్వం, వాటిని గ్రేడ్‌ల వారీగా వర్గీకరించి, క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు తప్ప డంలేదు. పంచాయతీరాజ్ చట్టం 1994, జీవో ఎంఎస్ నెంబర్ 84, తేదీ 24-02-2010 ప్రకారం గ్రామ పంచా యతీలను నాలుగు గ్రేడ్‌లు 1,2,3,4గా విభజించారు. అ ప్పటి నుంచి 2018 వరకు నిరంతరాయంగా పంచాయ తీలు పని చేయగా, 2018లో వచ్చిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సమస్యలు మొదలయ్యాయి. రా ష్ట్రంలో జీపీల సంఖ్య పెంచినప్పటికీ, గ్రేడింగ్ విధానాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో అనేక సమస్యలు తలె త్తాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మేజర్ పంచాయతీలకు కొత్త పోస్టుల మంజూరు నిలిచిపోగా, కార్యదర్శుల పదోన్నతుల ప్రక్రియకూ బ్రేక్ పడింది. అ నంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో గ్రామ పంచాయతీల్లో నెలకొన్న గ్రేడింగ్ సమస్యను గుర్తించి ఉ ద్యోగ సంఘాలతో చర్చించింది. ఆ చర్చల్లో భాగంగా గ్రా మాల వారీగా గ్రేడింగ్ చేసేందుకు ఆమోదం తెలిపిం ది. ఈ విషయమై క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వే యగా, పంచాయతీల్లో గ్రేడింగ్ విధానం అమలు చే యాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు కూ డా జారీ అయ్యాయి. అయితే అప్పటి నుంచి పంచాయ తీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఫైలు పెండింగ్‌లో ఉండగా, ఏడాది కావస్తున్నా ఇప్పటికీ గ్రేడింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడం విశేషం. దీనివల్ల క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి.
కొత్త పోస్టులకు అవకాశమేదీ...?
సాధారణంగా మండల కేంద్రాలు, అధిక ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలను గ్రేడ్-1, గ్రేడ్-2 జాబితా లో ఉంచుతారు. వాటికి ప్రత్యేకంగా జూనియర్ అసిస్టెం ట్, బిల్ కలెక్టర్ పోస్టులు మంజూరవుతాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు గ్రేడింగ్ ప్రక్రియ పూర్తయితే గ్రేడ్ -1, 2 కలిగిన పెద్ద పంచాయతీలకు ఆయా పోస్టు లు మంజూరు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీ నివల్ల పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుండగా, ప్రజలకు కూడా సేవలు త్వరితగతిన అందుతాయి. గ్రేడింగ్ అ మలు పర్చకపోవడం వల్ల మేజర్ పంచాయతీల్లో కూ డా ప్రస్తుతం ఉన్న కార్యదర్శి ఒక్కరే గ్రామాల్లోని అన్ని పాలనాపరమైన పనులు పర్యవేక్షించాల్సి వస్తోంది. త ద్వారా పరిపాలనా పరమైన సమస్యలు తలెత్తుతుం డగా, వివిధ ప్రభుత్వ పథకాల కారణంగా కార్యదర్శు లపైనా అదనపు పనిభారం పడుతోంది. మంచిర్యాల జి ల్లాలో 306 గ్రామ పంచాయతీలకు గాను కేవలం జన్నా రం మండలం పొన్కల్ జీపీలో మాత్రమే జూనియర్ అ సిస్టెంట్ పోస్టు ఉంది. జిల్లాలో మరెక్కడా కూడా జూని యర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టులు లేవు. కొత్త పం చాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు గ్రేడింగ్ ఇవ్వని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యా పోస్టులు అతి తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక నిధుల మంజూరుకూ అవకాశం...
ఇదిలా ఉండగా మేజర్ పంచాయతీలలో అధిక జనా భా ఉండటం వల్ల గ్రామాలను గ్రేడ్‌లుగా వర్గీకరిస్తే జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టులు మంజూరు కావడంతోపాటు ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధులు వి డుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా పంచాయ తీలలో అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉండగా, ప్రజలకు సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. అలాగే గ్రేడింగ్ విధానం వల్ల పంచాయతీ కార్యదర్శుల పదోన్న తులకు మార్గం సుగమం అవుతుంది. గ్రేడింగ్ ఇవ్వడం వల్ల గ్రామ పంచాయతీల స్థాయి పెరిగి, కార్యదర్శులకు కూడా గ్రేడ్-1,2,3 క్రమ పద్ధతిలో పదోన్నతులు లభిస్తా యి. తద్వారా గ్రేడ్-3, 4 స్థాయి కార్యదర్శులకూ ప్రమో షన్లు వచ్చే అవకాశం ఉండగా, ఖాళీ అయిన స్థానాల్లో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. పైగా గ్రేడ్-1,2 పంచాయతీలకు అదనంగా పోస్టులు మంజూరు కావడం వల్ల పరిపా లన పరంగా సౌలభ్యం ఏర్పడుతుంది. అయితే ఉద్యోగ సంఘాల నేతలకు రాష్ట్ర క్యాబినెట్ ఇచ్చిన హామీ ఇ ప్పటి వరకు అమలు కాకపోవడం వల్ల పరిపాలన ప రంగా ప్రజలకు, పదోన్నతుల పరంగా కార్యదర్శులకు తీ వ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. పంచాయతీరాజ్ శా ఖలో పని చేస్తున్న ఎంపీడీఓలు, జడ్పీ సీఈఓలు, సీని యర్ అసిస్టెంట్‌లు, సూపరింటెండెంట్‌లకు పదో న్నతు లు లభిస్తుండగా, రాష్ట్రంలో కొత్త జోన్లు ఏర్పడ్డప్పటికీ పంచాయతీ కార్యదర్శులకు మాత్రం ప్రమోషన్లు రావ డం లేదు.