Share News

ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తయ్యేదెన్నడు...?

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:56 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్‌ చేయడాని కి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్‌ రిజిస్ట్రీ (వ్యవసాయ రైతు నమోదు) ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోం ది.

ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తయ్యేదెన్నడు...?

-నత్తనడక సాగుతున్న ప్రక్రియ

-జిల్లాలో 72 శాతం రిజిస్ర్టేషన్లు...

-ఆసక్తి చూపని రైతలు

-సాంకేతిక సమస్యలతో లక్ష్యం చేరని కార్యక్రమం

-పేర్లు నమోదు కాకుంటే పథకాలకు దూరం

మంచిర్యాల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్‌ చేయడాని కి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్‌ రిజిస్ట్రీ (వ్యవసాయ రైతు నమోదు) ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోం ది. ఈ కార్యక్రమం గత సంవత్సరం మే 5న ప్రారంభం కాగా, ఏడాది గడిచినా ఇప్పటి వరకు జిల్లాలో మరో 28 శాతం మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకో లేదు. జిల్లాలో అధికారుల గణాంకాల ప్రకారం లక్షా 75 వేల మంది రైతులు ఉండగా వారిలో ఇప్పటి వరకు ల క్షా 35వేల (72 శాతం) మంది రైతులు మాత్రమే తమ పేర్లను ఫామ్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నారు. పట్టా పాస్‌ పుస్తకం ఉన్న ప్రతీ రైతుకు ఫార్మర్‌ రిజిస్ట్రీ పేరుతో 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్‌ ఫార్మర్‌ ఐడీ) కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.

అవగాహన లేమితో....

ఫార్మర్‌ రిజిస్ట్రీపై రైతులకు పూర్తిస్థాయిలో అవగా హన లేకపోవడం ప్రధాన కారణం కాగా, సాంకేతిక స మస్యల కారణంగా కూడా ఈ ప్రక్రియ ముందుకు సా గడం లేదు. మండల విస్తరణ అధికారులు ఇతర పను ల్లో బిజీగా ఉండటం కూడా కారణంగా చెబుతున్నా రు. గత నెలాఖరులోగా నమోదు కార్యక్రమాన్ని పూర్తి చే యాలని ప్రభుత్వం ఆదేశించించడంతో కొంతమేర ముం దుకు కదలినప్పటికీ కేంధ్ర ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నెలకొన్న సమస్యల కారణంగా లక్ష్యం పూర్తికావడం లేదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏఈవోలు లేదా అధికారులు రైతులకు ఫోన్‌ చేసి ఆధార్‌ లింక్‌ అ యిన మొబైల్‌కు వచ్చే ఓటీపీలను అడుగుతున్నారు. అ యితే సైబర్‌ నేరాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీ పీ చెప్పడానికి రైతులు తటపటాయిస్తుండటం కూడా ప్రక్రియ నత్తనడకన సాగడానికి కారణంగా నిలుస్తోంది. సాంకేతిక సమస్యలతో పూర్తిగాని ప్రక్రియ....రైతులు పేర్లు నమోదు చేసుకోవాలంటే పట్టాపాసు పుస్తకం, ఆ ధార్‌ కార్డు, ఫోన్‌ నెంబర్‌ లింకు అయి ఉండాలి. పదే ప దే సెల్‌ఫోన్‌ నెంబర్లు మారుతుండడం, ఆధార్‌లో ఉన్న పేర్లలో కొన్ని పొరపాట్లు ఉండడంతో నమోదు కావడం లేదు. చాలా మంది రైతుల ఆధార్‌ పునరుద్దరించ కపో వడంతో ఫేస్‌ స్కాన్‌ కావడం లేదు. కనీసం ఓటీపీతో నమోదు చేయాలన్నా ఫోన్లకు ఆధారుకు లింకు లేక పో వడంతో నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతుల వద్ద ఆధార్‌కార్డులు, పట్టాదారుల పాస్‌ పుస్తకా ల వివరాల్లో పేర్లు సరిపోలడం లేదు. కొంత మంది రై తులు వేరే ప్రాంతాలకు వలస పోవడం వల్ల రిజి స్ట్రేష న్‌ ప్రక్రియ పూర్తికావడం లేదు. రైతులు వచ్చిన సమ యంలో సర్వర్‌ బిజీ ఉండటంతో నమోదు జాప్యం అ వుతోంది. రెండు వేర్వేరు జిల్లాలో భూములు కలిగి ఉన్న రైతులు ఏదో ఒక్క జిల్లాలోనే రిజిస్ట్రీ చేసుకునే అవకా శం ప్రస్తుతానికి ఉంది. దీంతో ఆధార్‌ కార్డు ఉన్న జి ల్లాలో రిజిస్ట్రీ పూర్తవుతుండగా, ఇతర జిల్లాలో ఆధార్‌ తి రిగి అప్‌లోడ్‌ చేయడానికి వెసులుబాటు లేదు. అలాగే రిజిస్ట్రీ కోసం ప్రభుత్వం రూపొందించిన మ్యాపింగ్‌ ప్రక్రి యలో లోపాల వల్ల కూడా ముందుకు సాగడం లేదు. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మ్యాపింగ్‌లో ఇతర జిల్లాల మండలాలు కలవడంతో వివరాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ కోసం 2025 డిసెంబరు 31 వరకు రైతుల వివరాలు నమోదు చేయాలనే గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. నిర్ణీత తేదీ తరువాత మరణించిన రైతుల వివరాలు కూడా ఫార్మట్‌లో కనిపిస్తున్నాయి. దీంతో మరణించిన వారి రి జిస్ట్రేషన్లు జరుగక కూడా లక్ష్యం చేరుకోలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా సాంకేతిక సమస్యల ను కేంద్ర ప్రభుత్వం సవరిస్తేగాని ఫార్మర్‌ రిజిస్ట్రీ లక్ష్యా న్ని చేరుకొనే అవకాశాలు లేవు. ఫార్మర్‌ రిజిస్ట్రీలో రైతు లు పేర్లు నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. రైతులు తమ ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు బుక్‌, బ్యాంకు ఖాతా వివరాలతో సమీపంలోని మీ సేవా కేంద్రాలను గానీ, తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని గానీ సంప్రదించి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు.

రిజిస్ట్రీ కాకుంటే పథకాలకు దూరం....?

రైతులు తమ వివరాలను ఏఈవోలకు ఇచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయా ధికారులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాల కోసం ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డు తప్పనిసరి చేస్తే ఇ బ్బంది పడే అవకాశం ఉన్నందున రైతులు వెంటనే న మోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు అయితే కిసాన్‌, రైతు బీమా వంటి ప్రయోజ నాలు పొందవచ్చు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అందించే ప్రతి పథకం, ఎరువులు, సబ్సిడీల పంపిణీ ఈ యూనిక్‌ ఐడీ ద్వారానే జరిగే అవకాశం ఉంది. రైతు లకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో రైతు లకు స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది.

Updated Date - Jun 11 , 2026 | 11:56 PM