రైతు భరోసా ఇంకెప్పుడు..?
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:16 PM
జిల్లాలో యా సంగి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పాటికే ఆ రుతడి పంటలు విత్తుకోగా, వరినాట్లు ముగింపుదశకు చేరుకున్నాయి. సాగు పనులవేళ పెట్టుబడికి చేతిలో డ బ్బులు లేక రైతులు ఇక్కట్లపాలవుతున్నారు.
జోరుగా సాగుతున్న యాసంగి పనులు
చేతిలో చిల్లిగవ్వ లేక అన్నదాతల అరిగోస
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు
నెన్నెల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో యా సంగి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పాటికే ఆ రుతడి పంటలు విత్తుకోగా, వరినాట్లు ముగింపుదశకు చేరుకున్నాయి. సాగు పనులవేళ పెట్టుబడికి చేతిలో డ బ్బులు లేక రైతులు ఇక్కట్లపాలవుతున్నారు. వానాకా లం సీజన్‌లో దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయా రు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో రైతన్న లు ఉన్నారు. యాసంగి పంటలకు విత్తనాలు, ఎరువు ల కొనుగోలు కోసం అరిగోసపడుతున్నారు. వానాకాలం లో దిగుబడులు బాగుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండే వి కావని అంటున్నారు. పనుల వేళ ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా అందితే కొంతలో కొంతైన ఊరట లభిస్తుం దని అన్నదాతలు పేర్కొన్నారు. సత్వరం రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
-పెట్టుబడికి అప్పులు..
యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావ స్తున్న రైతు భరోసా రాక పోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్‌లోనే బ్యాంకుల్లో పం టరుణం తీసుకొని ఉండటంతో మరోసారి క్రాప్‌లోన్ తీ సుకునే అవకాశం లేదు. చేసేదిలేక అధిక వడ్డీలకు ప్రైవే టు అప్పులు తెచ్చి పంటలకు పెట్టుబడి పెడుతున్నా రు. దుక్కులు, కేజీవీల్స్, ట్రాక్టర్ కిరాయి, కూలీల వేతనా లకు చేతిలో డబ్బులు లేకపోయిన అప్పు చేసి చెల్లించా ల్సిందేనని రైతులంటున్నారు. ఎరువులు, విత్తనాలు, పు రుగు మందులను పంట చేతికి వచ్చాక డబ్బులు ఇస్తా మని అధిక ధరలకు ఉద్దెర తెచ్చుకుంటున్నారు.
-జిల్లాలో 1.52 లక్షల మంది అర్హులు
జిల్లాలో వానాకాలంలో 3.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. యాసంగిలో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా లు రూపొందించారు. గత యాసంగిలో రైతు భరోసా ఇవ్వకుండా, రైతుల అభిప్రాయ సేకరణ, అనర్హుల గు ర్తింపు పేరిట కాలం వెల్లదీశారు. కాని వానాకాలం సీజ న్‌కు మాత్రం పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. జిల్లాలో 1,52,162 మంది రైతులకు రూ. 198.12 కోట్లు రైతు భరోసాగా ప్రభుత్వం అందజేసింది. ఈ సారి పం టలు సాగు చేసిన భూములకే రైతుభరోసా ఇస్తారని, శాటిలైట్ సర్వే చేసి అర్హులను గుర్తించే ప్రక్రియ నడు స్తుందని అధికారులంటున్నారు. గత నెలలో గ్రామ పం చాయతీ ఎన్నికల కోడ్ ఉందంటూ సాకులు చెప్పారు. ఎన్నికలు నిర్వహించి నెలదాటింది. యాసంగి రైతుభరో సాను సంక్రంతి వరకు అందజేస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పండుగ దాటిపోయింది కాని రైతుభరోసా మాత్రం అందలేదు.
-ఇస్తే.. ఇచ్చేది ఎంతనో...
ఇప్పటికైతే రైతు భరోసా అందలేదు.. ఇస్తే ఎంత ఇస్తారో అనే చర్చ రైతుల్లో ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం రైతుబంధు పథకాన్ని 2018లో ప్రారంభించింది. ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్‌లకు అం దజేసేది. ఆ తర్వాత ఎకరానికి వెయ్యి పెంచి రూ. 5 వే లు ఇచ్చింది. లబ్ధిదారులకు రెండు సీజన్‌లకు కలుపుకొ ని ఎకరానికి రూ. 10 వేలు అందేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ. 7500లు ఇ స్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. పథకం పేరును రైతుభరోసాగా మార్చి గత వానాకాలం సీజన్ లో ఎకరానికి రూ. 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జ మచేశారు. ఈ యాసంగికి ఎంత ఇచ్చినా మంచిదే.. సకాలంలో అందజేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సత్వరం అందేలా చూడాలి
ముద్రకోల సదయ్య, రైతు, నెన్నెల
వానాకాలం సీజన్‌లో రైతులకు కాలం కలసిరాలేదు. అధిక వర్షాలు, చీడపీడల బెడదతో పత్తి, వరి పంటలు దెబ్బతిని దిగుబడులు రాక రైతులు నష్టపోయారు. యా సంగి పంటలకు పెట్టుబడి కోసం కర్షకుల చేతిలో పైస లు లేవు. సాగు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వ స్తోంది. పనులు జోరుగా సాగుతున్న వేళ ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తే రైతులకు ఊరట లభిస్తుంది. సత్వరం పంట పెట్టుబడి సాయం అందేలా చూడాలి.