సాగు సమస్య తీరేదెప్పుడు...?
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:48 PM
ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేద రైతులకు సమ స్యలు రోజు రోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. దశా బ్దాలుగా ప్రభుత్వాలు సాగు పత్రాలు అందజేస్తామని హామీలు ఇవ్వడమేగానీ, వాటిని అమలు చేయకపోవ డంతో ఇబ్బందులు తప్పడంలేదు.
-నిర్వీర్యమైన అసైన్‌మెంట్ చట్టం
-జిల్లాస్థాయి నూతన కమిటీకి కలగని మోక్షం
-ఆరు నెలలైనా ముందుకు సాగని ప్రక్రియ
-అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న వందలామంది
-పత్రాలు లేకపోవడంతో కష్టసాధ్యంగా సాగు
మంచిర్యాల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేద రైతులకు సమ స్యలు రోజు రోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. దశా బ్దాలుగా ప్రభుత్వాలు సాగు పత్రాలు అందజేస్తామని హామీలు ఇవ్వడమేగానీ, వాటిని అమలు చేయకపోవ డంతో ఇబ్బందులు తప్పడంలేదు. భూములు లేని నిరు పేదలు, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ప్రభుత్వ భూ ముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఇబ్బందు లు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు అప్పటి ప్రభుత్వాలు అసైన్‌మెంట్ చట్టానికి రూపకల్పన చేశాయి. ఇందులో భాగంగా భూములు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూ ములను అసైన్ చేయడం ద్వారా అధికారికంగా వారికి సాగు హక్కులను కల్పించేవారు. దీంతో లబ్దిదారులు ప్ర భుత్వ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం గడిపే వారు. ఇందులో భాగంగా లబ్దిదారుల ఎంపిక, అర్హుల కు భూములు పంపిణీ చేసేందుకు అసైన్‌మెంట్ కమి టీలు సమావేశం అయ్యేవి. అయితే గత 13 సంవత్సరా లుగా అసైన్‌మెంట్ కమిటీ సమావేశాలు ఏర్పాటు కాక పోవడం, ప్రభుత్వాలు సైతం ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసైన్‌మెంట్ చట్టం రా ష్ట్రంలో నిర్వీర్యం అయింది.
వెంచర్లుగా మారిన ప్రభుత్వ భూములు....
అసైన్‌మెంట్ చట్టం అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు పొందిన లబ్దిదారులు వాటిని సా గు చేసుకున్నా...కాల క్రమంలో వాటికి రెక్కలు వచ్చా యి. లబ్దిదారుల్లో అనేక మంది తమ పేరిట అసైన్ అ యిన భూములను విక్రయించగా, ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాస్తవానికి అసైన్ భూములు లబ్దిదారు లు, ఆ తరువాత వారి వారసులు సాగు చేసు కోవడానికి మాత్రమే ఉద్దేశించినవి. ఆయా భూములను విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ జిల్లాలో పెద్ద మొత్తంలో అసైన్డ్ భూ ములు ఇతరుల పేరిట పట్టాలుగా మారడం గమనా ర్హం. భూముల ధరలు పెరగడంతో అవి చేతులు మా రుతున్నాయి. లబ్దిదారుల నుంచి అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తున్న పలువురు వాటిని ప్లాట్ల వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నా అడిగేవారు లేరు. ఎలాంటి అ ర్హతలు లేకపోయినా ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాలు సృష్టించిన పలుకుబడిగల చోటా మోటా నా యకులు కొందరు వాటిపై బ్యాంకు రుణాలు పొంది జల్సాలు చేస్తున్నారు. వారు ఎక్కడ కూడా ఆ భూము ల్లో సాగు చేసిన దాఖలాలు లేవు. అయినా సాగు చ ట్టాలు వారికి చుట్టాలుగా మారిపోయాయి. ఇదిలా ఉం డగా ఎలాంటి ఆధారం లేక, జీవనోపాధి కోసం అటవీ, ప్రభుత్వ భూములను చదును చేసుకొని, వాటిలో సాగు చేస్తున్న వందలాది మంది నిరుపేద రైతులకు ధృవ పత్రాలు జారీ చేయడంలో మాత్రం ప్రభుత్వాలు, అధి కార యంత్రాంగం మీన మేశాలు లెక్కిస్తున్నాయి. పైగా ప్రభుత్వ భూముల్లోకి అక్రమ చొరబాట్ల పేరుతో కేసుల్లో ఇరికించిన ఉదంతాలు జిల్లాలో అనేకం ఉన్నాయి.
నిర్వీర్యమైన అసైన్‌మెంట్ కమిటీలు....
ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట లావుణి ప ట్టాగా మార్చాలంటే అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం ఉం డాలి. రెవెన్యూ డివిజన్ పరిధిలో అసైన్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా ఆర్డీవో, సభ్యుడిగా మండల తహసీల్దార్ ఉం టారు. వారి ఆమోదంతో ఎలాంటి జీవనాధారం లేని నిరుపేద వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్టీ, బీసీ కులస్థులకు నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను సాగు చేసు కునేందుకు అసైన్ చేసే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకోసం ముందుగా గ్రామంలో అర్హులుగా పేర్కొం టూ తీర్మాణం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మాణం ఆధా రంగా అసైన్‌మెంట్ కమిటీ సమావేశం కావాల్సి ఉం టుంది. ఆ సమావేశంలో దరఖాస్తుదారుల అర్హతలను బట్టి భూములను అసైన్ చేస్తారు. జిల్లాలో చివరిసా రిగా 2012-13లో అసైన్‌మెంట్ కమిటీ సమావేశం జరి గింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎక్కడా కూడా అసైన్‌మెంట్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయకపోగా, అసైన్ కమిటీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి.
అర్హులకు తప్పని ఎదురు చూపులు...
అసైన్‌మెంట్ కమిటీలకు పూర్వవైభం తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాత అసైన్‌మెంట్ కమిటీలను రద్దు చేసి, కొ త్తగా జిల్లాస్థాయిలో ఒకే కమిటీ ఏర్పాటు చేయాలనే ని ర్ణయానికి వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే అసైన్‌మెం ట్ కమిటీ చైర్మన్‌గా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లాకు చెం దిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు సభ్యులుగా, కలెక్టర్ కో చైర్మన్‌గా లేదా కన్వీనర్‌గా వ్యవహరించేలా ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. ప్ర భుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలకు పాస్ పుస్తకాలు అందించడం, పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రా న్స్‌ఫర్స్) చట్టం కింద కొనుగోలు చేసిన భూములను క్రమబద్దీకరించే అంశంపైనా అసైన్‌మెంట్ కమిటీ బా ధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వా రా పేదలు సాగు చేసుకుంటున్న ఏజెన్సీ, ఇతర ప్రభు త్వ భూములను వారికే అసైన్ చేయడం ద్వారా లబ్ది చేకూర్చాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అయితే దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా అసైన్‌మెంట్ కమిటీ ఏర్పాటుకు భీజం పడకపోగా, ప్రభుత్వ నిర్ణయంతో ఆ నందోత్సాహాల్లో మునిగి తేలిన పేద రైతులకు జాప్యం కారణంగా ఎదురు చూపులు తప్పడం లేదు.