పంట నష్టం చెల్లించేదెప్పుడో...?
ABN , Publish Date - May 15 , 2026 | 11:05 PM
ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతన్నకు తీరని నష్టం వాటిళ్లు తోంది. రెండేళ్లుగా అకాల వర్షాలకు పంట నష్టం జరిగి నప్పుడల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు తయారు చేయడం, ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయడం చేస్తున్నారు.
ప్రతిపాదనలకే పరిమితమైన పరిహారం చెల్లింపులు
రెండేళ్లుగా రైతుల ఖాతాలో జమకాని నగదు
జిల్లాలో రూ. 9 కోట్ల పై చిలుకు నష్టం అంచనా
మంచిర్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతన్నకు తీరని నష్టం వాటిళ్లు తోంది. రెండేళ్లుగా అకాల వర్షాలకు పంట నష్టం జరిగి నప్పుడల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు తయారు చేయడం, ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయడం చేస్తున్నారు. అంతటితోనే పరిహారం చెల్లింపులు నిలిచిపోతున్నాయి. 2024-25 మార్చి 21 నుంచి 25వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 162 మంది రైతులకు చెందిన 120.17 ఎకరాల్లో ధాన్యం నీటిపాలుకాగా రూ. 12.04 లక్షల మేర నష్టం వాటిల్లింది. అలాగే ఏప్రిల్ 13, 14 తేదీల్లో 250 మందికి చెందిన 199 ఎకరాల్లో పంట వర్షం పాలుకాగా రూ. 19.95 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే ఏప్రిల్ 31 నుం చి మే 6 వరకు 1,898 మందికి చెందిన 3,186 ఎకరాల పంట నీట మునగగా, రూ. 3కోట్ల 18 లక్షల 63వేల నష్టం వాటిల్లింది. 2025-26కు సంబంధించి ఆగస్టులో కురిసిన వర్షాలకు 4,111 మంది రైతులకు చెందిన 5,290 ఎకరాల్లో పంట నీటిపాలుకాగా రూ. 5కోట్ల29 ల క్షల 6వేల నష్టం వాటిల్లింది. సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు 7 మధ్య 17 మందికి చెందిన 31 ఎకరాల్లో పంట కోల్పోగా రూ. 1.54 లక్షల నష్టం వాటిల్లింది. అక్టోబరు 28 నుంచి 31 వరకు కురిసిన వర్షాల కారణం గా 530 మందికి చెందిన 565 ఎకరాల్లో పంట నీటిపా లుకాగా రూ. 56 లక్షల 59 వేల నష్టం వాటిల్లింది. రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ. 9,37,86,000 పంట నష్టం జరిగింది.
అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల పరిహారం అందిస్తా మని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి, సంబంధిత రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అందలేదు. ఈ నెల 5న అర్ధరాత్రి గాలివాన బీభత్సానికి జిల్లాలోని 1,830 మంది రైతులకు చెందిన 3,191 ఎకరాల ధాన్యం నీటి పాలైంది.
ఫ సీఎం హామీ ఇచ్చినా..
భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దా ల్చడంతో ముఖ్యంగా రైతులకు భారీ నష్టం సంభవిం చింది. వరదల ప్రభావాన్ని పరిశీలించేందుకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి 2025 ఆగస్టు 28న ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడ అధికారులతో మాట్లాడతూ జరి గిన నష్టాన్ని అంచనా వేసి రిపోర్టును తక్షణమే ప్రభు త్వానికి అందజేయాలని సీఎం ఆదేశించారు. స్వయంగా సీఎం ఆదేశించడంతో అధికారులు ఉరుకులు, పరుగుల మీద నష్టం అంచనా వేసి, నివేది కను ప్రభుత్వానికి అందజేశారు. పరిహారం అందుతుం దేమోనని రైతులు ఆశపడ్డారు. సీఎం హామీ ఇచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా రైతులకు నష్ట పరిహారం అందకపోవడం గమనార్హం.