Share News

kumaram bheem asifabad- కోఆప్షన్ల ఎన్నికలు ఎప్పుడు..?

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:31 PM

పంచా యతీలకు ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేక పాలకవర్గాలు నిధుల వినియోగం విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుం టున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

kumaram bheem asifabad- కోఆప్షన్ల ఎన్నికలు ఎప్పుడు..?
పంచాయతీ కార్యాలయం

జైనూర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పంచా యతీలకు ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేక పాలకవర్గాలు నిధుల వినియోగం విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుం టున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం పంచాయ తీలకు డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్తపాలక వర్గాలు కొలువుదీరి ఆరు నెలలు దాటింది. సర్పంచులు, ఉపసర్పం చులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిం చే పనిలో పడ్డారు. సర్పంచుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయని రాజకీయ నేతల కన్ను కోఆప్షన్‌ పదవిపై పడింది. కో-ఆప్షన్‌ గతంలో మండల పరిషత్‌లో, జిల్లా పరి ష త్‌లో, మునిసిపల్‌ కౌన్సిల్‌లోనే ఉండేవి. మండల, జిల్లా పరిషత్‌లలో మైనార్టీలకు మా త్రమే అవకాశం ఉంటుంది. మున్సిపల్‌, కార్పొరేషన్లపై మైనారిటీలతో పాటు ఇతరవర్గాల సభభ్యులకు కూడా అవకాశం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యె ఎవరిని నియమిస్తే వారికే పదవి వరించేది. పంచాయతీరాజ్‌-2018 నూతన చ ట్టం ప్రకారం పంచాయతీలలో ముగ్గురు కోఆ ప్షన్‌ సభ్యులను నియమించాలని పేర్కొంది. దీ ని ప్రకారం ప్రతీ పంచాయతీలో ఈ పదవులపై ఆసక్తి ఏర్పడింది. ఎవరికి వారు సర్పంచులతో, మండల నాయకులు, ఎమ్మెల్యేలతో పైరవీలకు సిద్ధం అవుతున్నారు. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పాలక వర్గాలకు సలహాలు, సూ చనలు ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం గ్రామ పంచా యతీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక విధానం ప్రవేశ పెట్టింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో పంచాయతీల్లో కోఅప్షన్‌ సభ్యుల ఎన్నిక జాడే లేకుండా పోయింది. పంచాయతీరాజ్‌ 2018 చట్టం ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీల్లో ముగ్గురు చొప్పున కోఆప్షన్‌ సభ్యులను ఎన్ను కోవాలి. వారికి వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. పాలకవర్గం కొలువు దీరిన 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయా ల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగలేదు. కుమరం భీం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

- హోదా, అధికారం, బాధ్యతలు..

కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైన వారు పం చాయతీ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొని వివిధ ఆంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వీరికి వార్డు సభ్యుల తో సమానమైన రప్రొటోకాల్‌, హోదా, గౌరవం దక్కుతుంది. సమావేశాల్లో చర్చించే ఆవకా శం ఉన్నప్పటికీ, తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. కేవలం పంచాయతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృధ్ధికి సంబంధిం చిన ప్రణాళిక రూపకల్పనలో కోఅప్షన్‌ సభ్యు ల పాత్ర కీలకమవుతుంది.

- ఎన్నిక విధానం ఇలా..

సర్పంచ్‌, వార్డు సభ్యులు సమావేశమై గ్రామానికి చెందిన ముగ్గురిని కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇందులో ఒకరు పదవి వీరమణ చేసిన ఉద్యోగి, లేదా అనుభవంఉన్న సినీయర్‌ సిటిజన్‌, మరొకరు గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఇంకొకరు పంచాయ తీలకు స్థలాలు ఇచ్చిన దాతలు లేదా భారీ గా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభి వృద్ధి కి దోహదపడే ప్రవాస భారతీయులను నియ మించాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఎంపీ డీవో సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా పంచా యతీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సబం ధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశా లు రాలేదని చెప్పారు. స్పష్ఠమైన ఆదేశాలు రాగానే కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక చేపట్టేం దుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 10:31 PM