వివాదం సద్దుమణిగేది ఎప్పుడు..
ABN , Publish Date - Oct 27 , 2026 | 10:40 PM
కొంత కాలంగా ప్రశాంతంగాఉన్న మంచిర్యాల నియోజక వర్గంలో మళ్లీ పరస్పర దాడులు కలకలం రేపుతు న్నాయి. ఒక వర్గంపై మరో వర్గం ప్రత్యక్ష దాడుల కు పూనుకుంటుండడంతో ప్రజలు తీవ్ర భయాం దోళనకు గురవుతున్నారు.
మంచిర్యాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు
భౌతిక దాడులకు వెనుకాడని ద్వితీయ శ్రేణి నాయకులు
నిత్యం పోలీసు కేసులు, బైండోవర్లతో కలకలం
భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
మంచిర్యాల, అక్టోబర్ 27 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా ప్రశాంతంగాఉన్న మంచిర్యాల నియోజక వర్గంలో మళ్లీ పరస్పర దాడులు కలకలం రేపుతు న్నాయి. ఒక వర్గంపై మరో వర్గం ప్రత్యక్ష దాడుల కు పూనుకుంటుండడంతో ప్రజలు తీవ్ర భయాం దోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్‌పార్టీలో ఏర్పడ్డ వర్గ విభేదాల కారణంగా ద్వితీయ శ్రేణి నాయకు లు విడిపోయి ప్రత్యర్థి వర్గంపై దాడులకు పూను కుంటుండడంతో నిత్యం పోలీసు కేసులు, బైండో వర్లతో కలకలం రేగుతోంది. ఇటీవల జరిగిన బతు కమ్మ వేడుకల సందర్భంగా దండేపల్లి మండలం తాళ్లపేటలో మొదలైన ఇరు వర్గాల మద్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. అప్పటి నుంచి రెం డు వర్గాలకు చెందిన వారు వరుస దాడులకు పా ల్పడుతుండడం భయాందోళనలను కలిగిస్తోంది. గతంలో సైతం ఇలాంటి దాడులు జరిగినప్పటికీ కొంతకాలంగా ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా జనజీవనం ప్రశాంతంగా సాగిపోతోంది. అప్పట్లో వరుస దాడుల కారణంగా మంచిర్యాల జిల్లా కేం ద్రం గూండాగిరికి కేంద్ర బింధువైంది. అప్పట్లో హా కీ స్టిక్స్, ఇతర మారణాయుధాలతో కూడా దాడులు చేసిన సందర్భాలు అనేకమున్నాయి.
వర్గ విభేదాల కారణంగా....
మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేంసాగర్‌రావు గెలు పొందిన నాటి నుంచి నియోజకవర్గంలో పలు అభి వృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల సమయం వరకు ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలలో అనంతరం వర్గ విబేధాలు మొదలయ్యాయి. అప్పట్లో ప్రేంసాగర్‌రావుకు ప్ర ధాన అనుచరుడిగా ఉన్నమంతెన జగన్మోహన్రా వు ఇటీవలి కాలంలో వేరుకుంపటి పెట్టడంతో వర్గ విబేధాలకు ఆజ్యం పోసినట్లయింది. అనంతరం ఇ రువురి మధ్య ఏర్పడిన తగాదాల వల్ల నియోజ కవర్గంలో అలజడులు ప్రారంభమయ్యాయి. ఈ క్ర మంలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుపై ఒకింత ఆగ్ర హంగా ఉన్న మంత్రి గడ్డం వివేకానంద, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దీనిని అవ కాశంగా మలుచుకున్నారు. జగన్మోహన్రావుకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ ప్రేంసాగర్‌రావుకు వ్యతి రేకంగా కార్యకలాపాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నా రు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితి తయారైంది.
పోలీసుల బలగాల పహారా....
దండేపల్లి మండలంలో రెండు వర్గాల మధ్య నెల కొన్న దాడుల కారణంగా జిల్లా కేంద్రంలో అల జడు లు సృష్టించే అవకాశం ఉండటంతో బైపాస్రో డ్డులోని జగన్మోహన్రావుపై ఇంటి వద్ద పోలీసు బలగాలను మోహరించారు.
జగన్మోహన్రావు ఇంటికి వెళ్లే దారిలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయడం తోపాటు వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో దాదాపు 400 మందితో బైపాస్ ప్రాంతం లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగైదు రో జుల పాటు ఈ ఆంక్షలు అమలు చేయగా రెండు రో జుల క్రితం పోలీసు పికెటింగ్ ఎత్తివేశారు. కొంత ప్ర శాంత వాతా వరణం నెలకొంటున్న క్రమంలో ఈ నెల 25న రాత్రి పాత మంచిర్యాలలో అవే రెండు వ ర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు పరస్పరం దాడులు చేసుకో వడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన వారు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రెండు వర్గాల నాయకులపై కేసులు నమోదయ్యా యి.
కేసులు, బైండోవర్లు.....
ఇరు వర్గాల మద్య నెలకొన్న దాడులను అరికట్టే విధంగా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతు న్నా రు. ఈ క్రమంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఈ నెల 26న జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చారు. వివిధ కేసులలో ఉన్న 44 మంది రౌడీషీ టర్లను మంచిర్యాల ఆర్డీవో ఎదుట బైండోవర్ చేశారు. అంత కు ముందు దండేపల్లి మండలంలో జరిగిన గొడవల సందర్భంగా సంబంధం ఉన్న ఇరు వర్గాలకు చెందిన 21 మంది యువకులను పోలీసులు ఈ నెల 23న ఆర్డీవో ఎదుట బైండోవర్ చేశారు. దాడుల్లో పా ల్గొన్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా పరి స్థితి కుదుట పడక పోవడం గమనార్హం.
ఇప్పటికైనా పోలీ సులు పరస్పర దాడులకు పాల్పడే రౌడీ మూకలపై కఠినంగా వ్యవహరించడం ద్వారా పరిస్దితిని చక్కది ద్దాలని ప్రజలు కోరుతున్నారు.