Share News

సీఎంఆర్‌ రికవరీ ఎప్పుడు..?

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:54 PM

ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్‌ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోర ణి అవలంభిస్తున్నారు.

సీఎంఆర్‌ రికవరీ ఎప్పుడు..?

-జిల్లాలో రూ. కోట్లలో పేరుకు పోయిన బకాయిలు

-రైస్‌ మిల్లర్లపై అధికారులు సీరియస్‌

-ఆర్‌ఆర్‌ చట్టం ప్రయోగించినా ఫలితం శూన్యం

-పీడీ యాక్ట్‌ అమలు చేసే యోచనలో అధికారులు

మంచిర్యాల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్‌ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోర ణి అవలంభిస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసినా లక్ష్యం మేరకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ఇవ్వని మి ల్లులపై చర్యలకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవు తోంది. ఆయా సీజన్లలో పౌరసరఫరాల శాఖ అధ్వర్యం లో ధాన్యం కేటాయించిన మిల్లులు సకాలంలో బియ్యం అందించాలని ఆదేశాలు ఇస్తున్నా పట్టించుకోకపోవ డంతో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఎ ప్పటికప్పుడు గడవు విధిస్తున్నా మిల్లర్లు పెడ చెవిన పెడుతున్నారు. రబీ, ఖరీఫ్‌ సీజన్లకు సంబంధించి క చ్చితంగా మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదే శాలు ఉన్నాయి. చాలా మంది మిల్లర్లు పలు కారణా లు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేయడంతో అధికా రులు ప్రత్యక్ష చర్యలకు పూనుకునేందుకు సిద్ధప డుతున్నారు.

సీజన్ల వారీగా మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, తిరిగి ఇవ్వాల్సిన బియ్యం వివరాలు మెట్రిక్‌ టన్నుల్లో....

సంవత్సరం సీజన్‌ ధాన్యం ఇవ్వాల్సిన బియ్యం పెండింగ్‌

(మెట్రిక్‌ టన్నుల్లో)

2024-25 ఖరీఫ్‌ 53121 50512 2600

2024-25 రబీ 60897 55687 5209

2025-26 ఖరీఫ్‌ 49243 32309 16933

2025-26 రబీ 41330 5152 36177

ధాన్యం పక్కదారి...

జిల్లా వ్యాప్తంగా రైస్‌ మిల్లులకు అప్పగించిన ధాన్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో వి క్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీ ఎంఆర్‌ ఇచ్చే సమయంలో రేషన్‌ బియ్యాన్నే కొనుగోలు చేసి, తిరిగి అప్పగిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నా యి. తనిఖీలో సమయంలో నిల్వలు చూపించాల్సి రా వడంతో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం ఆర్‌గా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌సీఐ అధికారు లు పరిశీలన సమయంలోనూ లెక్కలు చూపించకుం డా తప్పించుకున్న మిల్లర్లు ఉన్నారు. గతంలో కొన్ని మిల్లుల్లో రేషన్‌ బియ్యం పట్టుబడటమే దీనికి నిదర్శ నం. అలాగే ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మిల్లులు ఉం డగా, కొన్నేళ్లు ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతో కోట్లకు పడ గలెత్తుతున్నారు. వీటన్నింటి పైనా విచారణ జరిపేం దుకు పౌరసరఫరాల శాఖ సిద్దపడుతోంది.

కేసులు నమోదవుతున్నా మారని తీరు...

సీఎంఆర్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై జరిమానాలు, కేసులు విధిస్తున్నా వారి తీరు మారడం లేదు. ప్రతీ సీజన్‌లో ప్రభుత్వమే రైతుల నుంచి మ ద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకర ణ జరుపుతోంది. ఈ ధాన్యాన్ని జిల్లాలో ఉన్న మిల్లుల కు కేటాయిస్తే మిల్లర్లు సీఎంఆర్‌ చేసి తిరిగి అందిం చాలి. బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తే రేషన్‌ షాపుల్లో లబ్దిదారులకు పంపి ణీ చేస్తారు. అయితే ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు.... బియ్యం మాత్రం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మిల్ల ర్లపై క్రిమినల్‌ కేసుల నమోదు, రెవెన్యూ రికవరీ (ఆర్‌ ఆర్‌) చట్టం అమలు చేశారు. ఆర్‌ఆర్‌ యాక్టు కింద మిల్లుల నిర్వాహకుల కుటుంబ సభ్యుల స్థిరాస్తుల జ ప్తునకూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో సీఎంఆర్‌ బకాయిలు ఉన్న మిల్లర్లపై ఇప్పటి వరకు 20 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. బియ్యం ఇవ్వని మిల్లు లకు జరిమానా, వడ్డీ కలిపి చెల్లించాలంటూ ప్రభు త్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ధా న్యం విలువకు వడ్డీతో సహా లెక్కలు గట్టి వసూలు చే స్తున్నారు. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు మొం డి కేస్తుండటంతో వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిరాస్థులను సైతం జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కఠిన చర్యలకూ అవకాశం...

సీఎంఆర్‌కు సంబంధించిన ధాన్యం బకాయిలు ఉ న్న మిల్లర్లపై కఠిన చర్యలకూ ప్రభుత్వం సిద్దపడుతు న్నట్లు తెలుస్తోంది. రూ. కోట్లలో బకాయిలు ఉన్న మి ల్లులపై ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టగా, అవస రమైన పక్షంలో ఈడీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) విచారణ కూడా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్న ట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మిల్లర్ల బకాయిలు పేరుకుపోవడంతో ఎలాగైనా రికవరీకి సి ద్దపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం యోచిస్తున్న విధంగా ఈడీ రంగంలోకి దిగితే బియ్యం పక్కదారి వి షయమేగాక, మిల్లర్ల ఆస్తిపాస్తులపైనా విచారణ లో తుగా జరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు మిల్లర్లు అప్రమత్తమై బకాయిలు చె ల్లిస్తుండగా, మిగతా వారు కూడా దారిలోకి వస్తారనే భావనలో అధికారులు ఉన్నారు. సీఎంఆర్‌ బకాయిలు న్న పెద్దపల్లి జిల్లాకు చెందన ఓ మిల్లర్‌పై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. అదేమా దిరగా జిల్లాలో కేసులు ఎదుర్కొంటున్న మొండి బకా యిదారులపైనా పీడీ యాక్టు ప్రయోగించాలనే ఆలో చనతో యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 11 , 2026 | 11:54 PM