kumaram bheem asifabad- ‘చేయూత’ అందేదెప్పుడు..?
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:19 PM
చేయూత పింఛన్ల కోసం అర్హులైన వారికి నిరీక్షణ తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త పింఛన్లుమంజూరు చేస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే మిగిలింది. ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుని ఉన్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి రెండున్నరేళ్లు దాటి పోయినా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. 2024 జూలైలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో పై విధంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల జారీకి అ ర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు
- ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకున్న ప్రజలు
- సర్కార్ నుంచి ప్రకటన రాకపోవడంతో నిరాశ
- జిల్లాలో 4,031 దరఖాస్తులు పెండింగ్
- ప్రభుత్వ కనికరం కోసం ఆశావహుల ఎదురు చూపు
కాగజ్‌నగర్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్ల కోసం అర్హులైన వారికి నిరీక్షణ తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త పింఛన్లుమంజూరు చేస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే మిగిలింది. ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుని ఉన్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి రెండున్నరేళ్లు దాటి పోయినా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. 2024 జూలైలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో పై విధంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల జారీకి అ ర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. అంతా సవ్యంగా సాగితే అదే సంవత్సరం ఆగస్టు 1 నుంచే కొత్త పింఛన్లు అందుతాయనే ప్రచారం జరగడంతో దరఖాస్తుదా రుల్లో ఆశలు చిగురించాయి. కానీ నేటి వరకు ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చక పోవడంతో నిరాశ చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన పేద ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.. ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 వంట గ్యాస్ సబ్సిడీ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయి. కానీ పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
- ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వివిధ రకాల పథకాల కోసం స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగానే పింఛన్ దారుల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఆయా దరఖాస్తులతోపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్న పింఛన్ల లిస్టును కూడా పరిగణలోనికి తీసుకున్న అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశా రు. ప్రస్తుతం చేనేత, పైలేరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, విక లాంగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తు న్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథ కం కింద రూ. 2,016, దివ్యాంగులకు రూ. 4,016 ఇవ్వగా, కాంగ్రెస్ హయాంలో చేయూత పథకం ద్వారా వాటిని రూ. 4 వేలకు పెంచుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు లబ్ధిదారులకు పాత పింఛన్ మాత్రమే కాంగ్రెస్ సర్కార్ అందజేస్తోంది.
- స్పష్టత కరువు..
జిల్లాలో కొత్త చేయూత పింఛన్లు ఎప్పుడు అందజేస్తారనే విషయంపై సర్కార్ స్పష్టత ఇవ్వడం లేదు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళల పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా మంజూరుపై స్పష్టత లేక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 52,635 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. కాగా కొత్తగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,031 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నా యి. ఇందులో 2,147 వితంతు, 982 వృద్ధాప్య, 654 దివ్యాంగులు, 248 ఒంటరి మహిళలు కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రజాపాలన, ప్రజవాణి కార్యక్రమాల్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికి వాటి పరిశీలన ఆమోద ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వృద్ధులు, భర్తను కొల్పోయిన మహిళలు, దివ్యాంగుల ప్రభుత్వ పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పింఛన్ మంజూరైతే కుటుంబ పోషణకు కొంత ఊరట లభిస్తోందని వారు చెబుతున్నారు. మరో వైపు కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాక పోవడంతో దరఖాస్తు దారులు మండల, జిల్లా కార్యాలయాల చుట్లూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్హతలు ఉన్నప్పటికీ పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులందరికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రజా సంఘాలు, వృద్ధుల సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించి అర్హుల జాబితా ప్రకటించాలని కోరుతున్నారు.