Share News

kumaram bheem asifabad- వంతెనలకు మోక్షమెప్పుడో..?

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:08 PM

జిల్లాలో పలు మండలాల పరిధిలో వంతెనల పనులు ముందుకు సాగక పోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, ఒర్రెలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని ఆనుకునో లేక వీటి అవతలి వైపునో ఉన్నాయి. వానాకాలంలో కురిసే భారీ వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి.

kumaram bheem asifabad- వంతెనలకు మోక్షమెప్పుడో..?
ఆసిఫాబాద్‌ మండలంలో అసంపూర్తిగా ఉన్న గుండి వంతెన

- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

- వర్షాకాలంలో రాకపోకలకు ప్రజలకు తీవ్ర అవస్థలు

ఆసిఫాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు మండలాల పరిధిలో వంతెనల పనులు ముందుకు సాగక పోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, ఒర్రెలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని ఆనుకునో లేక వీటి అవతలి వైపునో ఉన్నాయి. వానాకాలంలో కురిసే భారీ వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అంతంత మాత్రమే రహదారి సౌక ర్యం ఉన్న గ్రామాల ప్రజలు వంతెనలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా వంతెన నిర్మాణ పనులు సాగుతూ..ముందుకు కదలడం లేదు. అధికారులు, నాయకుల చిన్న చూపుతో నిధులు మంజూరు కాక వంతెనలు పూర్తికాక పోవడంతో జిల్లాలోని ఆయాగ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు.

- ఏజెన్సీ పరిధిలో..

ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో ప్రతి ఏటా వర్షాకా లం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడా ల నుంచి ప్రధాన పట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. జిల్లాలోని 335పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదు. ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే. ఇటు ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అయిదు ఏజెన్సీ మండలాలతో పాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, కాగజ్‌నగర్‌ వరకు అన్ని మండలాల్లో ప్రజలు ఒకే రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్నచిన్న వాగులు మొదలుకుని ఎర్రవాగు, పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని వంకలపై నేటికి వంతెనలు లేకపోవడంతో ప్రజానీకం బయట ప్రపంచానికి చేరుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. జిల్లాలో ఇలా చిన్న చితక కల్వర్టు మొదలుకుని భారీ వంతెనల వరకు ఏవీ పూర్తికాకపోవడంతో ఏటా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పనులను వేగిరం చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రతి వర్షాకాలంలో ఈ సమస్యలు తప్పడం లేదని వివిధ మండలాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. దాంతో అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లడానికి కూడా ఇబ్బం దులు పడాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొని ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాక పోవడంతో ఆయాగ్రామాల ప్రజలు తిప్పలు పడా ల్సిన పరిస్థితి నెలకొన్నది.

- మారుమూల గ్రామాల పరిస్థితి..

జిల్లాలో మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికి కష్టాలు పడుతున్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడి గుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడు తున్నారు. గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో చేరడం లేదు.ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దలుగా కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్ద వాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్ద న్నర కాలం పాటు కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామా నికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడు తున్నారు. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి-కరం జివాడ, లక్మాపూర్‌ వంతెనల నిర్మాణ పనులు అసం పూర్తిగానే ఉన్నాయి. కాగజ్‌నగర్‌- వాంకిడి మండ లాల మధ్య కనర్‌గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అసం పూర్త్తిగానే ఉంది. తిర్యాణి మండలంలోని నాయకపు గూడ గ్రామం నుంచి దుగ్గపూర్‌ గ్రామానికి వెళ్లెం దుకు మధ్యలో ఉన్న వంతెన నిర్మాణ పనులు ఇం కా పూర్తి కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడు తుంటారు. వేసవికాలంలో వాగులు, ఒర్రెలపై తాత్కాలిక వం తెనలు ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నా రు. పాలకులు స్పందించి జిల్లాలో అసంపూర్తిగా ఉ న్న వంతెనల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:08 PM